Astro Vidya

Astro Vidya Astrology And Psychology

02/12/2022

#నరదృష్టి_వలన_బాధపడే_వారికీ_రెమిడీ:-
చాల మంది దృష్టి ప్రభావం వలన దృష్టి ఉన్న వారే కాకుండా కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు.అటువంటి వారికోసం నివారణ మార్గం.
శనివారం రోజున ఇల్లంతా శుభ్రంగా కడిగి ఇంటి ప్రధాన ద్వారానికి పై నుండి క్రింది వరకు పొడవైన నల్లని దారాన్ని 7 వరసలు తీసుకోని వేలాది దియ్యండి. గడపకు రెండు వైపులా దీపాన్ని వెలిగించి, ఆ దారంతో సవ్యంగా 7 సార్లు అపసవ్యంగా 7 సార్లు దిష్టి తీసి రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి.
రావి చెట్టుని పసుపు,కుంకుమ,పుష్పాలతో అలంకరించి దీప ధూప నైవిధ్యాలను సమర్పించి 7 సార్లు ప్రదక్షిణ చేసి ఇంటికి దిగదుడిచిన దారాన్ని రవి చెట్టు ఏదో ఒక కొమ్మకు కట్టి వెనక తిరిగి రండి. ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని ఇష్టదైవానికి దీపారాధన చెయ్యండి. దీపారాధన చేసే సమయంలో గృహంలో ఉన్నవారి పేర్లు జన్మ నక్షత్రాలు చదవండి.దీని వలన నారా దృష్టి తొలగటమే కాకుండా నరఘోష,భూత,ప్రేత,పిశాచ బాధలు కూడా తొలిగి పోతాయి.

 #దారిద్య్రాన్ని_మార్చే_ఉంగరం:-మనం ఏ పని చేసిన తరుచూ ఆటంకాలు కలగటం,ఎంత కష్టపడినా ఉద్యోగంచేసే రంగం లో అభివృద్ధిలేకపోవటం, ...
14/11/2022

#దారిద్య్రాన్ని_మార్చే_ఉంగరం:-
మనం ఏ పని చేసిన తరుచూ ఆటంకాలు కలగటం,ఎంత కష్టపడినా ఉద్యోగంచేసే రంగం లో అభివృద్ధిలేకపోవటం, సమాజంలో రాజకీయంగా ఆర్థికంగా ఎదగటానికి ఈ రెమిడీని పాటించండి.
వెండి,బంగారం,రాగి లోహాలను సమానంగా కలిపిన ఉంగరాన్ని తయారుచేసుకొని చేతి యొక్క ఉంగరపు వేలుకు ధరించండి.గ్రహణంరోజు ధరించాలి అనుకున్న వారు ఉంగరం పైన 12 రాశుల గుర్తలను ఉంగరం పైభాగంలో చెక్కించుకొని ధరించండి.ఇది జాతకంలోని అవయోగ దశలనుకూడా యోగదశగా మార్చి అదృష్టాన్ని తెస్తుంది.ఈ ఉంగరాన్ని ధరించిన వారికీ జనాకర్షణ పెరిగి ధనధాన్య అభివృద్ధితోపాటు కుటుంబ వృద్ధిని కలిగిస్తుంది. రాజకీయరంగంలో ఉన్నవారికి ఇది చాల ఉపయోగపడుతుంది.

13/11/2022

కొన్ని బీజ మంత్రాలు:-

ఓం :- ఈ ప్రణవాన్ని జపం చేస్తూ ఉంటే దివ్యజ్ఞాన ప్రకాశం కలుగుతుంది.

ఐం :- సరస్వతి మంత్రం విద్య లభిస్తుంది.

హ్రీం:- ఇది మాయా బీజం, దీనిని జపం చేయడం వలన అనెక రకాల సిద్దులు కలుగుతుంది.

క్లీం:- ఇది మన్మధ బీజం. దీనిని జపం చేయడం వలన వశీకరణ సిద్ది కలుగుతుంది.

శ్రీం:- ఇది లక్ష్మీ బీజం, దీనిని జపం చేయడం వలన ఐశ్వర్య లాభం.

గం:- ఇది గణపతి బీజం, అనేక రకాల విఘ్నాలను, విఘాతాలను తొలగించి విజయం ప్రాప్తిస్తుంది.

ద్రాం:- ఇది శ్రీ దత్తాత్రేయ బీజం,దత్త ప్రభువు యొక్క అనుగ్రహం తో సర్వం సిద్దం.

హూం:- క్రోధ బీజం ఇది, దీనిని జపం చేయడం వలన అంతర్ బహిర్ శత్రు వినాశనం కలిగి మానసిక శాంతి లభిస్తుంది.

క్రీం:- ఇది కాళీ బీజం, దీనిని జపం చేయడం వలన కాళీ దేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.

సోం:- ఇది చంద్ర బీజం, దీనిని జపం చేయడం వలన ఆరోగ్యం.

జూం:- మృత్యుంజయ మంత్రం ఇది.

ధూం:- ఇది ధూమావతి దేవి బీజం, దీనిని జపం చేయడం వలన శత్రు యొక్క ఉఛ్ఛాటనము కలుగుతుంది. ముందుగా మన అంతరంగంలో ఉన్న సమస్త అసుర లక్షణాలు మొత్తం నాశనం అవుతాయి.

త్రీం:- ఇది తారా దేవి బీజం, దీనిని జపం చేయడం వలన తారా దేవి అనుగ్రహం చేత జ్ఞానాన్ని వాక్ సిద్ది.

13/11/2022

ద్వాదశ జ్యోతిర్లింగాలు తెలుసు.!!
12 రాశులు కూడా తెలుసు.!!
కానీ మన రాశికి సరిపడిన జ్యోతిర్లింగమేదో తెలుసా?

మేషం - రామేశ్వరం - తమిళనాడు
వృషభం - సోమనాథ్ - గుజరాత్
మిధునం - నాగేశ్వరం - గుజరాత్
కర్కాటకం - ఓంకారేశ్వరం - మధ్యప్రదేశ్
సింహం - వైద్యనాథ్ - jharkhand
కన్య - శ్రీశైలం - ఆంధ్ర ప్రదేశ్
తుల - మహాళేశ్వరం - మధ్యప్రదేశ్
వృశ్చికం - ఘృష్ణేశ్వరం - మహారాష్ట్ర
ధనుస్సు - విశ్వేశ్వరం - కాశి
మకరం - భీమశంకరం - మహారాష్ట్ర
కుంభం - కేదారేశ్వరం - ఉత్తరాఖండ్
మీనం - త్రయంబకేశ్వరం - మహారాష్ట
తెలుసుకుందాం.........
రాశికొక #జ్యోతిర్లింగం

మేషరాశి వారికి పూజనీయమైన జ్యోతిర్లింగం #రామేశ్వరం. మేషరాశి కుజునికి స్వగృహం. చరరాశి వారికి పదకొండవ రాశ్యాధిపతి శని బాధకుడు. గ్రహపీడా నివారణార్థం రామేశ్వర తీర్థ యాత్ర, సుత్రామ పర్ణీ జరరాషి యోగే, నిబధ్య సెతుం విశిఖైర సంఖ్యె శ్రీరామ చంద్రేన సమర్పితం త, రామేశ్వరాఖ్యం నియతం నమామి అనె శ్లోకం రోజూ చదువుకొవాలి. శ్రీరామచంద్రుడు శని బాధానివారణార్థం రామేశ్వర లింగాన్ని స్థాపించాడని ప్రతీతి.

వృషభరాశి వారి పూజాలింగం #సోమనాథ జ్యోతిర్లింగం. ఈ రాశి శుక్రునికి స్వగృహం, చంద్రునికి ఉచ్ఛ రాశి. సోమనాథ జ్యోతిర్లింగం శ్రీకృష్ణుడు స్థాపించిన మహాలింగం. ఈ రాశివారు శనిదోష శాంతికి సోమనాథ దేవాలయ దర్శనం, సౌరాష్ట్ర దేశే విదేశేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావసంతం, భక్తి ప్రాదానాయ క్రుపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకధ్యానం చేయడం శుభప్రదం. ఈ రాశివారు జన్మ నక్షత్రంలో సోమనాథంలో రుద్రాభిషేకం చేయించుకుంటే మంచి ఫలితాలు పొందగలరు.

మిధునరాశి వారి జ్యోతిర్లింగం #నాగేశ్వర లింగం. ఈ రాశి బుధునికి స్వగృహం. గ్రహదోషాలకు నాగేశ్వర పుణ్య క్షేత్ర దర్శన, రోజూ యామ్యే సదంగే నగరే తిరమ్యే విభ్శితాంగం వివిధైశ్చ భోగై, సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని పఠించడం, ఈ రాశిలో శని సంచారకాలంలో కైలాసయంత్రప్రస్తార మహాలింగార్చన జరిపిస్తే విశేష ఫలితాలు ఉంటాయి.

కర్కాటక రాశి వారికి #ఓంకారేశ్వరలింగం పూజనీయ జ్యోతిర్లింగం. ఈ రాశి చంద్రునికి స్వగృహం. ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం, రోజూ కావేరికా నర్మదాయో పవిత్రే, సమాగమే సజ్జన తారణాయ, సడైవమాన్దాత్రు పురే వసంతం, ఓం కారమీశం శివమే మీడే అనే శ్లోకం పఠించడం, జన్మనక్షత్రం ఉన్న రోజు ఓంకార బీజాక్షరం జపించడం శుభకరం.

సింహరాశి వారికి పూజనీయమైన జ్యోతిర్లింగం శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం. సింహరాశి సూర్యునకు స్వగృహం. ఘృష్ణేశ్వర జ్యోతిర్లిగం దర్శనం, ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసాంతం చ జగద్వ రేణ్యం, వందే మహాదారాతర స్వభావం, ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని నిత్యం పఠించడం ద్వారా సర్వదోషాల నుండి విముక్తులు కావచ్చు.

కన్యారాశి వారికి శ్రీశైల జ్యోతిర్లింగం పూజాలింగం. ఈ రాశికి అధిపతి బుధుడు. వీరు అన్నిరకాల బాధల నుండి ఉపశమనం పొందడానికి శ్రీశైల మల్లికార్జున దర్శనం, భ్రమరాంబకు కుంకుమ జన్మనక్షత్రం రోజున చండీ హోమం చేసుకోవాలి. శ్రీశైల శృంగే విభుధాతి సంగే తులాద్రి తుంగేపి ముదావసంతం, తమర్జునం మల్లిక పూర్వమేకం, నమామి సంసార సముద్ర సేతుం అనే శ్లోకాన్ని పఠించడం శ్రేయస్కరం.

తులారాశి వారికి పూజాలింగం #మహాకాళేశ్వర లింగం. ఈ రాశికి శుక్రుడు అధిపతి. మహాకాళేశ్వర దర్శనం, శుక్రవారపు సూర్యోదయ సమయంలో ఆవన్తికాయం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం, అకాల మ్రుత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం అనే శ్లోకాన్ని పఠించడం వల్ల అన్ని గ్రహదోషాల నుండి, బాధల నుండి విముక్తి పొందవచ్చు.

వృశ్చికరాశి వారికి #వైద్యనాథేశ్వర లింగం పూజాలింగం. ఈ రాశికి కుజుడు అధిపతి, వృశ్చికం వైద్య వృత్తికి, శస్త్రచికిత్సలకి కారణభూతమైన రాశి. వైద్యనాథేశ్వరుని దర్శించడం, పూజించడం, మంగళవారం పూర్వోత్తరె ప్రజ్వాలికానిధానే, సాదావసంతం గిరిజాసమేతం, నురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్యనాదం తమహం నమామి అనే శ్లోకాన్ని పఠించడం శ్రేయస్కరం.

విశ్వేశ్వరలింగం #ధనూరాశివారి పూజాలింగం. ఈ రాశి వారికి గురుడు అధిపతి, సానందవనే వసంతం. ఆనందకందం హతపాపబృందం వారణాసీనాథ మనాథనాథం, శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని పారాయణ చేయడం, కాశీ క్షేత్ర దర్శనం, గురువారం రోజున, శనగల దానం ద్వారా శని, గురూ గ్రహదోషాల నుండి విముక్తి పొందవచ్చు.

భీమశంకర లింగం మకరం వారి పూజాలింగం. ఈ రాశి అధిపతి శని. ఇది గురునికి నీచ, కుజునికి ఉచ్ఛ, తెలిసో, తెలియకో చేసిన దోషాల నుంచి విముక్తికిగాను భీమశంకర దర్శనం, యం ఢాకినీ శాకినికాసమాజైః నిషేమ్యమాణం పిశితశనైశ్చ, సదైవ భీమాదిపద ప్రసిద్ధం, తం శంకరం భూతహితం నమామి అనే శ్లోకాన్ని పారాయణ చేయడం, శనివారం నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం ఈవాడం, అవిటివారికి ముసలివారికి వస్త్ర దానం చేయడం మంచిది.

కుంభరాశి వారికి #కేదారేశ్వర లింగం శేయోలింగం. ఈ రాశికి శని అధిపతి. గ్రహపీడలు, శత్రుబాధలు, ఇతర దోషాల విముక్తికిగాను ఈ రాశివారు కేదారేశ్వర దర్శనం. నిత్యం మహాద్రి పార్శ్వేచ మునీంద్రైః సురాసురై ర్యక్ష మహోరగాద్యైః కేదారమీశం శివమేక మీడే అనే శ్లోకాన్ని పారాయణం చేయాలి.శనివారం రుద్రాభిషేకం చేస్తే మంచిది.

త్ర్యంబకేశ్వర లింగం #మీనరాశి వారి జ్యోతిర్లింగం. ఈ రాశి అధిపతి గురుడు. త్ర్యంబకేశరుడు ఎప్పుడూ నీటి మద్యలో ఉంటాడు. త్ర్యంబకేశ్వర దర్శనం, స్వామి చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచుకోవడం, నిత్యం సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్ర దేశే, యద్దర్శనాత్ పాతకమాశునాశం, ప్రయాతి తం త్ర్యంబక మీశ మీడే అనే శ్లోకాన్ని పారాయణం చేయటం సకల శుభాలను కలిగిస్తుంది.

ఓం నమః శివాయ నమః
🙏🙏🙏🙏🙏🙏🙏

12/11/2022

తాంత్రిక విషయంలో కొన్ని ముఖ్యమైన అంశాలు :-

వీటికి కొన్ని పరిమితులు ఉంటాయి .. గురుముఖతః తెలుసుకుని ఆచరించి సత్ఫలితాలు పొందగలరు .

👉 దుష్టగ్రహ , దుష్టశక్తులు తొలగాలంటే ..

ప్రతీ నిత్యం మహాంకాళీమాతను ఉపాసించండి . దంత మాలను ధరించవచ్చు .. దంతమాలతో జపం చేయాలి .

👉 ప్రయోగభాధలు , చేతబడి , చిల్లంగి మొదలైన క్షుద్ర ప్రయోగాలు తొలగాలంటే

తారాదేవిని ఉపదేశం తీసుకుని సాధన చేయాలి . ఎముకల మాలను మెడలో ధరించండి .

👉 రోగభాధలు , విషపీడలు నుండి బయటపడాలంటే
చిన్నమస్తా దేవిని గురుముఖతః తీసుకుని సాధన చేయాలి .

👉 అధికారం , రాజ్యం గ్రహం అనుకూలతలకు .. త్రిపుర సుందరి దేవిని ఆరాధించండి . రక్తచంధన మాలను మెడలో ధరించండి. రక్త చందనమాలతో జపం చేయాలి.

👉 దుష్టపీడల నుంచి బయటకు రావాలంటే .. భైరవి దేవిని ఆరాధించాలి . గులకరాళ్ళను మాలన చేసి మెడలో ధరించండి జపం చేయాలి.

👉 ఋతుబాధలు , కుటుంబ క్లేశాలు , దైవశాపాలు తొలగాలంటే.. మాతంగి దేవిని ఆరాధించండి .. గురువింద గింజలను ధరించండి .. జపం చేయాలి ..

👉 కోర్టు వ్యవహారాలు, వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటే .. భగళాముఖిని ఆరాధించండి .. హరిద్రమాలను మెడలో ధరించండి.. అదే విధంగా జపం చేయాలి ..

👉 అధిక సంపన్నులు కావాలంటే .. కమలాత్మికా దేవిని గురుముఖతః తెలుసుకుని సాధన చేయాలి .. తామరగింజల మాలతో జపం చేయాలి ..

👉 రాజకీయ వ్యవహారాల విషయం లో , ఐశ్వర్య అంతస్తులు పెరగాలంటే .. భువనేశ్వరి దేవి ఉపాసన గురుముఖతః తీసుకుని సాధన చేయాలి .. స్పటిక మాలతో జపం చేయాలి ..

👉 శతృభాధలు అధికంగా ఉన్నా .. నిరంతరం గొడవలు కోట్లాటలు ఉంటే .. శరభశాలవను తాంత్రిక పద్ధతిలో గురుముఖతః తీసుకుని సాధన చేయాలి .. భద్రాక్ష మాలతో జపం చేయాలి ..

👉 ప్రతీ విషయం లో విఘాతం, విఘ్నాలు , ఏ పని ముందుకు సాగకపోతే .. గణపతిని ఉపాసన మొదలుపెట్టండి .. ఏనుగు దంత మాలను ఉపయోగించి జపం చేయాలి ..

👉 దాంపత్య సుఖం కోసం , ప్రేమ ఫలించాలంటే .. శ్రీ కృష్ణుడిని ఆరాధించండి .. ప్రావళమాలను మెడలో ధరించండి .. అదే విధంగా జపం చేయాలి ..

👉 వశీకరణ ప్రయోగాలు సిద్ధించాలంటే .. పగడ మాలను ధరించండి.. జపం చేయాలి..

Address

Abudabi
Al Ain

Opening Hours

09:00 - 21:00

Website

Alerts

Be the first to know and let us send you an email when Astro Vidya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Astro Vidya:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram