03/11/2025
బద్వేలు నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలోని 26 వార్డుభావన నగర్ పరిధిలోని నేడు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ గార్లు
ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గార్లుమాట్లాడుతూ వైఎస్ జగన్ హయాంలో కోవిడ్ తర్వాత ఏడు కళాశాలలు పూర్తి చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఐదు మెడికల్ కళాశాలలను అందుబాటులోకి తెచ్చాం. నిర్మాణాలు పూర్తయినా ఎన్నికల కోడ్‌తో రెండు కళాశాలలు అందుబాటులోకి రాలేదు.
కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇది పేదలకు వైద్య విద్యను దూరం చేయడమే.. లక్షల కోట్ల ఆదాయం వచ్చేలా చంద్రబాబు తన బంధువులు, పార్టీ వాళ్లకు కళాశాలలను హస్తగతం చేయడానికి కుట్ర చేస్తున్నారు. కూటమి నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు పేదలకు వైద్య విద్య దూరం అవుతుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాల్సిన కళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తే ప్రజలకు వైద్యం కూడా దూరం అవుతుంది.
చంద్రబాబు తీరు, కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలిసి అందజేస్తాం.. సీఎం చంద్రబాబు కుట్రలకు అడ్డుకట్ట వేసే బాధ్యతను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఈ ప్రజా ఉద్యమంలో మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, యువత, రాజకీయాలకు అతీతంగా పార్టీలు పాల్గొనాలని కోరుతున్నాను..అందరూ కలిసికట్టుగా ప్రభుత్వం మెడలు వంచుదామని పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో మాజీ పంచాయతీరాజ్ ప్రభుత్వ సలహాదారులు మరియు మున్సిపాలిటీ అబ్జర్వర్లునాగార్జున రెడ్డి,లయన్ భాస్కర్ రెడ్డి అంబవరం వైఎస్ఆర్ సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ, నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరు రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సాయి కృష్ణ, గోపాలస్వామి, మున్సిపాలిటీ పార్టీ కన్వీనర్ సుందర్ రామిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు పార్టీ సీనియర్ నాయకులు శ్రీరాములు, కౌన్సిలర్లు, రాష్ట్ర మరియు జిల్లా మరియు నియోజకవర్గ అనుబంధ విభాగాల నాయకులు, మాజీ డైరెక్టర్లు, పార్టీ మహిళా నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు