27/03/2023
1. నేను రియాలిటీ expect చేశాను...అది ఎక్కడా నాకు దొరకలేదు.
2.ఒక టీచర్ పోయి 10 మంది రౌడీలను కొట్టడం...కలలో కూడా నేను చూడలేదు.
3.ఒకే టీచర్ ఐదు ఆరు సబ్జెక్ట్స్ చెప్పి తరగతి గదిలోని అందరు విద్యార్థులకు అవగాహన కల్పించలేడు. కల్పించినట్లు చూపినా అది చూపుల వరకే.
4.ఒక కాలేజ్ లో ఒక లేడీ టీచర్ ఉంటే ...మిగితా జెంట్స్ అంతా సొల్లు కార్చుకుంటూ ఆమె వెనక తిరుగుతూ ఆమెను ఇంప్రెస్స్ చెయ్యడానికి ట్రై చెయ్యరు.చాలా రెస్పెక్ట్ చేస్తారు... లేడిస్ని.
5.ఒకతను నా ఆస్తి మొత్తం నీకు రాసిస్త..పిల్లలకు ఫ్రీగా చదువు చెప్పు అంటాడు...కానీ రాసివ్వడు( just అంటాడు అంతే.)
6.ఒక సార్ 3 రోజుల్లో వూళ్లోని అందరు పిల్లలని కాలేజ్కి రప్పించడం అదో మ్యాజిక్కు.3 రోజుల్లో ఒక విలేజ్ మొత్తం మారిపోవడం అబద్దం.ఒక సమాజం పోకడ మారడానికి చాలా టైం పడ్తది.
7.టీనేజి పిల్లలు పొద్దు మూకిన తర్వాత అది కూడా సాయంత్రం 6 గంటల తర్వాత రోజూ theatre కి పోవడం పచ్చి అబద్దం.
8.ఒక టియేటర్ ఓనర్ అతని షోలు అన్ని cancel చేసుకుని రోజూ క్లాసులు వినిపించడం అబద్దం.
9.ఒక మేడం అందులోనూ మంచి అమ్మాయి తన తల్లిని వదిలేసి అది కూడా ఆ కాలంలో పెళ్లి కాకుండానే అబ్బాయి ఇంటికి వెళ్ళిపోవటం అబద్దం.
10.ఒక కాలేజ్ లో అందరూ పిల్లలు ఇంటెలిజెంట్ అయ్యే అవకాశమే లేదు.అందరూ పాస్ అవ్వడం అబద్దం.
11.ఒక కాలేజి పిల్లలకు అందరికీ ఒకే కాలేజిలో exam సెంటర్ ఎట్లా పడ్తదో అర్థం కాలేదు.
11.ఒక తరగతిలో రకరకాల IQ కలిగిన పిల్లలు ఉంటారు.ఎంసెట్ లాంటి స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ లో 46 ర్యాంకులు ఒకే కాలేజికి రావడం న భూతో న భవిష్యత్.అది కూడా ఓకే లెక్చరర్ చెప్పే వీడియో క్లాసులు విని....🙏
12.మార్కెట్ లో రకరకాల కూరగాయలు ఉంటాయి.ఆలుగడ్డలు టొమాటోలు కావు...పాలకూర పుండికూర కాదు.పిల్లలూ అంతే.జన్మతః వాడికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి వాడు ఎదుగుతాడు.
13.నేను రాత్రి పగలు నిద్రమని కష్టపడినా below 70 ...IQ ఉన్న స్టూడెంట్ కి 1స్ట్ ర్యాంక్ తెప్పించలేను...నా గొంతు కోసుకున్నా తెప్పించలేను.
14.above 110 ..IQ ఉన్నవాడికి నా అవసరమే ఉండదు...వాడు సొంతంగా చదువుకొని ర్యాంక్ కొట్టుకోగలడు.
15.విద్యార్థి ఒక మొక్క అయితే...టీచర్ పని కేవలం దానికి నీరు పోయడం.అంతే.
విత్తనం టొమాటో ది అయితే..ఫలాలు టమోటోలే అవుతాయి.కాకపోతే కొంచం ఎక్కువ నీరు ఎరువు పోస్తే కొంచం పెద్ద సైజ్ టొమాటోలు అవుతాయి.అంతే కానీ...టొమాటో చెట్టుకి బీరకాయలు కాయవు...కాస్తాయి అనేది పచ్చి అబద్దం.
16.ప్రతీ ఒక్కడు టీచర్ అంటే అది ఇది అని గొప్పలు చెప్తాడే కానీ,వాడి పిల్లలు టీచర్స్ అవ్వాలి అనుకోడు.ఇదే పచ్చి నిజం. డాక్టరో ఇంజనీరో అవ్వాలి అనుకుంటాడు...వాడు మల్ల టీచర్ అంటే అట్లా