19/03/2026
పాడి రైతులు, పాల ఉత్పత్తిదారులు, సంగం డెయిరీ ఉద్యోగుల ఆరోగ్యభద్రతకు శ్రీకారం చుట్టి అంచెలంచెలుగా 8 వసంతాల వైద్య సేవల ప్రస్థానంలో వేలాది గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ వైద్యసేవలు అందించి ఈ ప్రాంత ప్రజల మన్ననలు పొందడం మాకు సంతృప్తినిచ్చింది
స్వర్గీయ శ్రీ ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి ఆశయాల సాధనలో మాతో కలసి మా లక్ష్యాల వైపు నడిచిన వైద్య బృందం, వైద్య సహాయకులు, ఉద్యోగులు, శ్రేయోభిలాషులు అందరికి హృదయ పూర్వక ధన్యవాదములు
మా మీద ఈ ప్రాంత ప్రజలించిన విశ్వాసాన్ని మరింత బలపరిచేలా భవిష్యత,సేవలుకొనసాగుతాయని,
తెలుగు నూతన సంవత్సరంలో కొత్త అవకాశాలు అందిపుచ్చుకుని మరిన్ని సదుపాయాలు, సేవలు విస్తరించేందుకు కృషి చేస్తామని తెలియజేస్తున్నాము.
శ్రీ పరాభవనామ సంవత్సరంలో పాడి, పంటలు, వృత్తి ,వ్యాపారాలు విద్య, ఉపాధి, ఉద్యోగ మరియు అన్ని రంగాల ప్రజలు అభివృద్ధి చెందాలని భగవంతుని ఆశీస్సులతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు.
_ మీ జ్యోతిర్మయి ధూళిపాళ్ళ, ఎండీ, డివిసి హాస్పిటల్& రీసెర్చ్ సెంటర్