Indian Phamacy Graduates Association - Andhra Pradesh

  • Home
  • Indian Phamacy Graduates Association - Andhra Pradesh

Indian Phamacy Graduates Association - Andhra Pradesh NATIONAL LEVEL PROFESSIONAL ASSOCIATION Exclusively Serves Graduate Pharmacists. Established in 1973

11/11/2025

ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలలో నోటిఫికేషన్ తప్పులు.. ఓటర్ల లిస్టులో లోపాల గురించి రేపు 12-12-3025 జూమ్ కాల్ ఉంటుంది
There will be a Zoom meeting tomorrow ie. 12-11-2025 about Notification defects & Voters list lapses
*Time of meeting intimated soon*
*All Pharmacists and Leaders are welcome*

*Heartfelt Birthday wishes to our Senior Colleague Dr.D.Dachina Moorthi - Vice President IPGA ANDHRA PRADESH* - IPGA AP ...
01/07/2025

*Heartfelt Birthday wishes to our Senior Colleague Dr.D.Dachina Moorthi - Vice President IPGA ANDHRA PRADESH* - IPGA AP Team

*IPGA is Demanding Probe by a Judicial Agency such as Lokayukta on Dramatic instances happening in Andhra Pradesh Pharma...
11/12/2024

*IPGA is Demanding Probe by a Judicial Agency such as Lokayukta on Dramatic instances happening in Andhra Pradesh Pharmacy Council. Shame on part of such illicit and irresponsible practices of the Team of APPC.*
*AP Pharmacy Council simply cannot rule out their mistakes .. corruption.. with a simple letter on whatsapp. IPGA is demanding APPC to complain to Cyber Crime Agency to find out facts on REGISTRAR'S CIRCULARS*
As promised we continue to issue legal notices for defamation as well for Initiative of appropriate enquiry of forgery of council office correspondence & as well on recently published corruption in APPC office VIJAYAWADA...
*Thanks to every one for the wide spread of IPGA objections among all Pharmacist Groups*
More Comments & Suggestions are welcome on our efforts in filing case against such behaviour of APPC Authorities.
IPGA ANDHRA PRADESH
9052232792
ipga.andhrapradesh@gmail.com

*ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్‌లో జరుగుతున్న నాటకీయ సంఘటనలపై లోకాయుక్త వంటి జ్యుడీషియల్ ఏజెన్సీ ద్వారా విచారణను ఐపిజిఏ ఆ...
11/12/2024

*ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్‌లో జరుగుతున్న నాటకీయ సంఘటనలపై లోకాయుక్త వంటి జ్యుడీషియల్ ఏజెన్సీ ద్వారా విచారణను ఐపిజిఏ ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్‌ బృందం యొక్క ఇటువంటి అక్రమ మరియు బాధ్యతారాహిత్యమైన పద్ధతుల పట్ల ఓ నిబద్ధత గలిగిన ఫార్మాసిస్తూ సంఘం గా మిక్కిలి సిగ్గుపడుతున్నాము.*

*ఏపీ ఫార్మసీ కౌన్సిల్ వారు ఈరోజు వాట్సాప్‌లో విడుదల చేసిన ఒక సాధారణ లేఖతో వారి తప్పులను .. అవినీతిని తోసిపుచ్చలేము. రిజిస్ట్రార్ సర్క్యులర్‌లపై వాస్తవాలను తెలుసుకోవడానికి ఐపిజిఏ ఆంధ్రప్రదేశ్ ...ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్‌ ను ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ ఏజెన్సీకి ఫిర్యాదు చేయాలని కోరుతోంది*
వాగ్దానం చేసినట్లుగా మేము పరువు నష్టం కోసం లీగల్ నోటీసులు జారీ చేస్తూనే ఉన్నాము. అలాగే కౌన్సిల్ ఆఫీస్ కరస్పాండెన్స్ యొక్క ఫోర్జరీ మరియు పత్రికలు సోషల్ మీడియాల్లో వచ్చిన కార్యాలయం విజయవాడలో ఇటీవల ప్రచురించిన ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్‌ అవినీతిపై తగిన విచారణ ప్రారంభించడం కోసం... చర్యలు ప్రారంభం అవ్వాల్సిందే!
*అన్ని ఫార్మసిస్ట్ గ్రూపులలో ఐపిజిఏ ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలను విస్తృతంగా వ్యాపించినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు*
ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్‌ అధికారుల ప్రవర్తనకు వ్యతిరేకంగా కేసు నమోదు చేయడంలో మా ప్రయత్నాలపై మరిన్ని వ్యాఖ్యలు & సూచనలు స్వాగతం.
*ఐపిజిఏ ఆంధ్రప్రదేశ్*
9052232792
ipga.andhrapradesh@gmail.com

10/12/2024

*గౌరవ రిజిస్ట్రార్,*
*ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్*
*విజయవాడ*

*గౌరవ రిజిస్ట్రార్ గారికి,*
*విషయము:* మీ కార్యాలయం సర్క్యులర్ - ఆర్సీ నెం: 01/2024 - తేదీ: 09-12-2024 - మీరు వాడిన భాష - ఫార్మసీ సంఘాలను తప్పుబట్టుట - ఇంకా హెచ్చరికలు జారీ చేయుట - గురించి
***
శుభ సాయంత్రం సార్. పైన పేర్కొన్న మీ ఆఫీసు సర్కులర్ కాపీ వాట్సాప్ గ్రూపులలో ఇప్పుడే చూడటం జరిగింది. సార్ అందులో మీరు సాధారణ పరిభాషలో ఫార్మసీ అసోసియేషన్లు అని ఆరోపణ చేసేటప్పుడు.. అటువంటి పదజాలం ఉపయోగిస్తున్నప్పుడు మీరు నిర్దిష్టంగా వ్యవహరించి ఉండాల్సింది. మీరు ప్రవచించిన అన్ని సంఘాలు అన్నీ చాలావరకు మీ ఆత్మ బంధువులే.

మీ కార్యాలయం, దాని చుట్టూ వున్న అవినీతి, బ్రోకర్లను కట్టడి చేయకుండా, మీ కార్యాలయ అనుసంధానంగా జరుగుతున్న అవినీతిని, రెన్యువల్స్ ని, స్తాంపులు, కవర్ల అమ్మకాన్ని ప్రశ్నించిన ఫార్మసీ నాయకులకు సమాధానం చెప్పలేక... రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలను ఒకే గాటన కట్టి... మీరు హెచ్చరికలు జారీ చేయడం హాస్యాస్పదం. ఐపీజీఏ ఆంధ్రప్రదేశ్ దీన్ని త్రీవ్రంగా ఖండిస్తున్నది.
ఐపీజీఏ ఆంధ్రప్రదేశ్ అటువంటి పద్ధతులలో ఎప్పుడూ జోక్యం చేసుకోదు. మీ కార్యాలయం బేషరతు క్షమాపణలు చెప్పవల్సివుంది.

ఎన్నో సార్లు ప్రస్తావించిన 3600 డబుల్ వర్కింగ్ ఇండివిడ్యుల్స్ పై ఇంతవరకు ఏ చర్య తీసుకొని మీరు, మీ నియమకాన్ని, కొనసాగింపును కోరుతూ అధికారుల మెప్పుకోసం.. మీ తప్పిదాలను ఫార్మసీ సంఘాలపై వేసి.. పైగా హెచ్చరికలూ అంటూ సర్క్యులర్ జారీ చేయడం.. అనైతికం.. హేతుబద్దం కూడా కాదు.

మీ సర్క్యులలో వాడిన .. ఫార్మాసీ సంఘాలు అన్ని, లేదా కోన్ని అన్న పదం.. అభ్యంతరకరం... వెంటనే మీ సర్క్యులర్ ని ఉపసంహరించండి. మీరు ఐపీజీఏ ఆంధ్రప్రదేశ్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. నిబద్ధతతో పనిచేస్తున్న మాబోటి సుదీర్ఘ చరిత్ర ఉన్న సంఘానికి అవమానంగా భావిస్తున్నాం. పైగా ఐపీజీఏ ఆంధ్రప్రదేశ్ లో మీరు కూడా సభ్యులే.

మీరు రిజిస్ట్రార్ అయినాక మీరు వ్యవస్థాపకులుగా ఉన్న కోన్ని ప్రత్యేక సంఘాలను అభివృద్ధి చేసుకోవడానికి .. మీ కార్యాలయ అవినీతిని ప్రశ్నించిన కొన్ని సంఘాల మీద కక్షతో ఇలా చేయడం సబబు కాదు. వ్యవస్తీకృత మైన విషయాల్లో తప్ప.. ఇప్పటి వరకు ఐపీజీఏ ఆంధ్రప్రదేశ్ మీపై ఎటువంటి ఆరోపణ నేరుగా చేయలేదు.

అసలు రిజిస్ట్రేషన్ల రెన్యువల్స్ పేరిట గత సంవత్సర కాలంగా పలు సర్క్యులర్స్ ను మీ కార్యాలయం ఏవిధంగా ఇస్తుంది?ఏ సెక్షన్ లేదా రూల్ ప్రకారం ఇస్తున్నారో చెప్పగలరా? ఐపీజీఏ ఆంధ్రప్రదేశ్ చానా పర్యాయాలు అప్డేట్డ్ రిజిస్టర్ కాపీ (సెక్షన్ 40క్రింద) ఇవ్వమని కోరింది. మీరు ఏరోజు ఇవ్వలేదు. రిజిస్ట్రార్ నియామకాల్లో లెటర్ నెంబర్ 9954 కూడా పలుమార్లు ప్రస్తావించాం. కోర్టు ఆదేశాలతో కొనసాగుతున్న మీరు ఇలాటి ఓంటెద్దు పోకడలు మానుకోండి. ఐదేళ్ల రెన్యూవల్ అంశం, రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్ పేరిట మీ కార్యాలయానికి వచ్చే వారిని బ్రోకర్లకీ రిఫర్ చేయడం, ఏకంగా మారుతి వ్యాన్లను పెట్టి అవినీతి చేస్తున్నదెవరు?. పత్రికల్లో మీపై మీ కార్యాలయ సిబ్బంది తప్పుగా పనిచేసినందుకు వచ్చినఆరోపణలు కప్పిపుచ్చుకోవడానికే మీరు ఈవిధంగా రాష్ట్రంలోని అన్ని సంఘాలను అవినీతి వారుగా ప్రచారం చేస్తున్నారని భావించవొచ్చా?

మీరు చేసిన ఈ ధౌర్భాగ్యానికి చాలా చింతిస్తున్నాము. మీ సర్క్యులర్ ద్వారా... ఐపీజీఏ ఆంధ్రప్రదేశ్ లేదా మరే ఇతర ఫార్మసిస్ట్ అసోసియేషన్‌ల పరువు నష్టం కలిగించినందుకు గౌరవ రిజిస్ట్రార్, ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్, విజయవాడ లీగల్ నోటీసు పంపడానికి మేము వెనుకాడబోము..

అదే సమయంలో మీ పేరును లేదా ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ కు అప్రతిష్ట, అవమానపరచిన.. ఏదైనా వ్యక్తి లేదా సంఘంపై మీరు నిర్దిష్ట ఆరోపణ ఫిర్యాదు చేస్తే... ఐపీజీఏ ఆంధ్రప్రదేశ్ మీకు మద్దతునిస్తుంది అని భరోసా ఇస్తున్నాం.

మీరు సర్క్యులర్ ను వెంటనే ఉపసంహరించకపోతే మీపై తీసుకునే చట్టపరమైన చర్యలకు భాద్యులు అవుతారు.
*గమనిక:* ఆంధ్రప్రదేశ్ లోని ఫార్మసీ సంఘాలు అన్ని.. ఐపిజిఏ మాదిరి భావించినట్లయితే.. మేము అందరిని కలుపుకొని పోరాటం చేస్తాం. మా భావనలతో ఏకీభవించివారు.. ఐపీజీఏ ఆంధ్రప్రదేశ్ వాట్సాఅప్ 9052232792 కు మెసేజ్ పంపండి. మేము సంప్రదిస్తాం.

ఒకవ్వేళ లీగల్ నోటీసుకు కౌన్సిల్ స్పందించకపోతే ఐపీజీఏ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పరువునష్టం దావా వేస్తుంది. లేకపోతే ఫార్మాసిస్టుల బాగోగులు చూసే సంఘాల పట్ల ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రార్ తీరు నిజమని తోటి ఫార్మాసిస్టులు భావించే ప్రమాదం ఉంది. నిత్యం ఫార్మాసిస్టులను వేధించే ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ తీరు త్రీవ్రంగా ఖండిస్తూ.. పై సర్క్యులర్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఐపీజీఏ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రార్ ను కోరుతుంది.

అదే సమయంలో ఆయనకు లేదా కౌన్సిల్ కు డేమేజ్ చెందిన వ్యక్తులు లేదా సంఘాల పేర్లను భహిర్గతం చేయాలని ఐపీజీఏ ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తోంది.

రిజిస్ట్రార్ ఒంటెద్దుపోకడలను నిరసిస్తూ సాగే మాపోరాటంలో అందరి చట్టబద్ధమైన మద్దత్తు మాత్రమే కోరుతున్నాం. ఇటీవలి అవకతవకల ఆరోపణల విషయంలో ఓ ప్రకటన కూడా రిజిష్ట్రార్ చేయాలని ఐపీజీఏ ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తోంది

మీ వివరణ తక్షణమే ఇవ్వాలని గౌరవ రిజిస్ట్రార్, ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ వారిన్ని... ఐపీజీఏ ఆంధ్రప్రదేశ్ ఇందుమూలముగా కోరుతుంది..
ధన్యవాదాలు
*ఐపీజీఏ ఆంధ్రప్రదేశ్ తరపున - సాయిప్రియ కొల్లిపర*
9052232792 వాట్సప్
IPGA.Andhrapradesh@GMAIL.COM

03/11/2024

Address

DOOR NO: MIG-120, Housing Board Colony

522005

Opening Hours

Monday 08:00 - 16:00
Tuesday 08:00 - 16:00
Wednesday 08:00 - 16:00
Thursday 08:00 - 16:00
Friday 08:00 - 14:00
Saturday 08:00 - 17:00
Sunday 10:00 - 13:00

Telephone

+917382385678

Website

http://www.ipgaap.in/

Alerts

Be the first to know and let us send you an email when Indian Phamacy Graduates Association - Andhra Pradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Indian Phamacy Graduates Association - Andhra Pradesh:

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram