28/09/2025
భయమెరుగని భారతీయుడు భగత్ సింగ్..
ఆ.. యోధుడి పేరు వింటేనే రోమాలు నిక్కబొడుస్తాయి. బ్రిటీష్ అధికారులు సైతం తమకు తెలియకుండానే శాల్యూట్ చేస్తారు.పన్నెండేళ్లకే ఆ వీరుడు భరతజాతి విముక్తి కోసం కంకణం కట్టాడు.పద్నాలుగేళ్లకే భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అడుగుపెట్టాడు. ఇరవైమూడేళ్లకే బలిదానం చేసి యువతరంలో జ్వాలను రగిల్చాడు. దటీజ్ భగత్‌సింగ్.
భగత్ సింగ్... ధైర్యానికి ప్రతీక
భగత్ సింగ్... ధైర్యానికి ప్రతీక.దేశభక్తికి ప్రతిరూపం. భగత్ సింగ్...
ధీరత్వానికి మారుపేరు. నవతరానికి ఒక స్ఫూర్తి. భయమెరుగని భారతీయుడు భగత్‌సింగ్. అంతులేని ధైర్యానికి కొలమానం. ఉరితాడుతో ఉయ్యాలలూగిన భారత తేజం. ఆ విప్లవవీరుడి పేరు లేకుండా భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రే లేదు.
ఎన్ని దశాబ్దాలు దాటినా మీ త్యాగం మరువం🙏 ఇన్క్విళబ్ జిందాబాద్
నేడు భగత్ సింగ్ గారి జయంతి Ksk Saadhu I