30/07/2024
నిన్న ఉదయం 15 సంవత్సరాల అమ్మాయి బ్లడ్ రిపోర్ట్స్ నాకు వాళ్ళ తల్లిదండ్రులు పంపించి ఉన్నారు.
ఈ రిపోర్ట్ లో అమ్మాయికి విటమిన్ 'డి 7.3' , ఐరన్ తక్కువగా ఉండడం గమనించాను - '17'.
ఐరన్ 17 స్థాయి తక్కువ అంటే హిమోగ్లోబిన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది- '8.7' .
ఇంకా థైరాయిడ్ TSH '31.3' కూడా అమ్మాయికి చాలా ఎక్కువగానే ఉంది.
మధుమేహం HbA1c '6.2' కూడా ఇప్పుడిప్పుడే మొదలవుతుంది.
👇👇👇👇👇👇
ఇక్కడ ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏమిటంటే.... పిల్లలు బాగా తింటున్నారా అనే దానికంటే పిల్లలకు పోషకాలు ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు మనం ఇస్తున్నామా అనేది మీరు ఒకసారి గమనించుకోవాలి.
ముందుగా తల్లిదండ్రులు మీరు పోషకాలు ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు మీరు అలవాటు చేసుకుంటే, మంచి ఆహార పద్ధతులు మీరు అలవాటు చేసుకుంటే..... మీ పిల్లలకు కూడా అవే అలవాటు అవుతాయి.
దానివలన మీరు ఆరోగ్యంగా ఉంటారు మీ పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు.
కాబట్టి తల్లిదండ్రులు ముందుగా మీరు ఆహార పద్ధతులను మార్చుకోండి, మీ పిల్లలకు కూడా మంచి ఆహార పద్ధతులను అలవాటు చేయండి, వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని అందించండి... 🙏🙏🙏🙏
TQ ☺️👍🙏