27/02/2022
రుమటాయిడ్ ఆర్థరైటిస్ ,హోమియోపతి చికిత్స --
దీన్నే పరిభాషలో కీళ్ళవాతం గా చెప్తుంటారు.ఈ వ్యాధికి గురైనవారిలో ముఖ్యంగా చిన్న కీళ్లు ప్రభావానికి గురవుతాయి.దీన్ని ముఖ్యంగా కీళ్ళవాతం గా పరిగణించినప్పటికి కీళ్లతో పాటుగా స్వయంనియంత్రిత కండరాలు, ఎముకలు,ధాతువు లు ,లిగ్మెంట్లపై ఉన్న పొరలు ,కీళ్లకు నూనెను అందిచే సినోవియల్ గ్రందులు,నాడీ వ్యవస్థ తో సహా గుండె మరియు రక్త ప్రసరణ వ్యవస్థ ప్రభావానికి గురి అవుతాయి.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎన్ని రకాలు?
ఈ కీళ్ళవాతాన్ని అక్యూట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ గాను ,దీర్ఘకాలిక రుమటాయిడ్ ఆర్థరైటిస్ గాను చెప్తారు.అక్యూట్ కీళ్ళవాతానికి సరైన చికిత్స పొందనప్పుడు అది దీర్ఘకాలిక రుమటాయిడ్ ఆర్థరైటిస్ గా మారుతుంది.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పబడే కీళ్ళవాతనికి కారణాలు ఏమిటి?
ఇతమిద్ధంగా ఇప్పటివరకు స్పష్టమైన కారణాలు తెలియరాలేదు.కొన్ని జన్యు పరమైన కారణాలు ఉండవచ్చని కొన్ని పరిశోధనలో వెల్లడించడం జరిగింది.మానసిక పరమైన కారణాలు ప్రధానమైన కారణంగా అనుమానించ బడుతున్నాయి.
ఈ వ్యాధికి గురైనవ్యక్తులు ఎటువంటి లక్షణాలు వ్యక్తపరుస్తారు?
వీరిలో ఉదయపు వేళలో,నిద్రలేచే సమయానికి కీళ్లు బిగుతుగా మారి నడవటానికి ,కదలటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది.ఇటువంటి బిగుతు చేతి వేళ్ళ కీళ్ళలో ఎక్కవగా ఉంటుంది. రెండుచేతులులో చిన్న కీళ్ళన్ని ఈ వ్యాధికి గురిఅవుతాయి. దీర్ఘకాలికంగా బాధపడేవారిలో సైనావిల్ గ్రందులు వాపు,కీళ్ల దగ్గర కణుతుల రూపంలో వస్తాయి.కీళ్ల దగ్గర ఎముకల అరుగుదల ఎక్కువగా ఉండటం వలన కీళ్లు తమ ఆకారాన్ని కోల్పోయి వంకరగా మారుతాయి.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధిని ఎలా నిర్ధారిస్తారు?
వ్యాధి లక్షణాల పూర్వ గతిని అనుసరించి వ్యాధి నిర్ధారణ ఉంటుంది.వ్యాధి నిర్ధారణ లో రక్త పరీక్షలు మాత్రమే ప్రధాన పాత్ర పోషించవు. రోగి వ్యక్త పరిచే లక్షణాలు మరియు రక్త పరీక్షలు రెండింటిని సమన్వయం చేసుకుని మాత్రమే వ్యాధి నిర్ధారణకు రావాలి.
రక్త పరీక్ష ల్లో ముఖ్యంగా సి-రియాక్టివ్ ప్రోటీన్ ,ఇ. ఎస్. ఆర్ ,రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫాక్టర్ , యాంటీ న్యూక్లియర్ యాంటిబొడిస్ ను ప్రామాణికంగా తీసుకుని వ్యాధి నిర్ధారణ చేస్తారు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ ను ఎలా నియత్రించవచ్చు?
వ్యాధికి చికిత్స ఎంత అవసరమో ,శారీరక విశ్రాంతి కూడా అంతే ముఖ్యమని భావించాలి.కీళ్లు బిగుతుగా మారటం అనేది వ్యాధి లక్షణం కాబట్టి పరిమితమైన వ్యాయామాలు చేయవలసి ఉంటుంది.అవసరమైన మానసిక విశ్రాంతి తీసుకోవటం ఈ వ్యాధి ని నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
హోమియోపతి వైద్య విధానంలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కు చికిత్స ఎలా ఉంటుంది?
ఇతర వైద్య విధానాల్లో ఈ వ్యాధికి సరైన చికిత్సలు లేవు.కానీ హోమియోపతి సూత్రాలననుసరించి ఈ వ్యాధిని నయం చేయవచ్చు.కొన్ని సందర్భాల్లో వ్యాధి తీవ్రత ను సమర్ధవంతగా నిలువరించవచ్చు.మనిషి యొక్క శారీరక తత్వం ,మానసిక స్థితి,వ్యాధి రావడానికి కారణమైన పరిస్థితి లను సమగ్రంగా విశ్లేషించి మాత్రమే హోమియోపతి మందులను సూచించడం జరుగుతుంది. ఈ క్రింది మందులు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ను తగ్గించడంలో ఉపయోగపడతాయి.
1.రస్ టాక్స్-
ఈ మందు చల్లటి,తేమ ప్రదేశంలో నివసించేవారి లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చినట్లైతే వాడవచ్చు.వీరికి ఒకేచోట కదలకుండా కూర్చుంటే వీరి కీళ్ల బాధలు ఎక్కువ అవుతాయి.అందుకే వీరు ఎప్పుడూ కదులుతూ, నడుస్తూ ఉంటారు.విశ్రాంతి స్థితి నుండి కదిలేవారిలో బాధలు పెరిగి ,కాసేపటికి ఆ బాధలు సర్దుకుంటాయి.
2.బ్రయోనియా-
కీళ్లు వాపుతో ఎరుపు రంగులోకి మారి,కదలనివ్వ కుండా బిగుతుగా మారివుంటాయి.వీరిలో నొప్పులు సూదితో కుడుతున్నట్టుగా ఉంటాయి.చిన్నపాటి కదలిక వీరిలో నొప్పిని ఎక్కువ చేస్తుంది.వీరి నోరు పొడిబారి ఉండటం వలన,వీరికి దాహం ఎక్కువగా వేస్తుంది. ఒకేసారి ఎక్కువ మోతాదులో నీరు త్రాగుతారు.నాలుక మీద తెల్లటి పూత కనిపిస్తుంది.వీరు ఒంటరిగా ఉండటానికి ప్రయతఁ చేస్తారు.
3.కెమిమిల్ల-
వీరిలో కీళ్లు నొప్పులు రాత్రి పూట ఎక్కువగా వస్తుంటాయి.నొప్పులు చాలా భయంకరంగా ఉంటాయి.ఆ నొప్పులను తాళలేక వారు కదులుతూ నే ఉంటారు.నొప్పుల వలన నిద్ర పట్టదు.వీరు శారీరకంగా, మానసికంగా చాలా సున్నితంగా వుంటారు. విపరీతమైన చిరాకుగా ,విసుగ్గా ఉంటారు.
ఇలా హోమియోపతి వైద్యంలో అనేకమైన మందులు లెడం పాల్, యాక్టియా రజిమోస,పల్సటిళ్ల ల్లాంటి అనేక మందులు హోమియోపతి వైద్యులని సంప్రదించి తీసుకోవచ్చు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ కు ఉపయోగ పడే ఆహారం ఏమిటి?
ప్రతి రోజు ఉదయం కీరదోస రసం 1 గ్లాసు,అలాగే బూడిద గుమ్మడి జ్యూస్ ,మధ్యాహ్నం రెండు రకాల ఆకు కూరలు దానితో కేరేట్ జ్యూస్ తీసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి.
డా.వెంకట్ చౌదరి ఎం.డి
డా. చౌదరి హోమియోపతి స్పెషలిటీక్లినిక్
కోలాచాలం కాంపౌండ్ ,దానమ్మ హాస్పిటల్ ఎదురు.
బళ్లారి
ఆన్లైన్ కన్సల్టేషన్ ఫోన్ -9740680019