19/09/2022
ఈరోజు ఉదయం 10.30 గంటలకు వెంకటాపురం మండలం, ఆలుబాక గ్రామంలోని రైతువేదిక భవనంలో *మీకోసం మేమున్నాం సహాయక కమిటీ ఆధ్వర్యంలో, అఖిల హాస్పిటల్ - చర్ల వారిచే* ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరాన్ని ఆలుబాక సర్పంచ్ ఆదిలక్ష్మి, చర్ల రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి ఆంజనేయులు, TRS మండల అధ్యక్షులు గంపా రాంబాబు లచే ప్రారంభించి, Dr చంద్ర కిరణ్, Dr స్రవంతి, ఎదిర పిహెచ్ సి డాక్టర్ అల్లం నరేష్ లచే సుమారు 200 మందికి వైద్య సేవలు అందించి, రక్త పరీక్షలు నిర్వహించి, సంబందిత మెడిసిన్స్ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది...వీరందరికీ కూడా (సుమారు 250) ఉచిత శీతల పానీయాలను కొత్తపల్లి ఆంజనేయులు గారు స్పోన్సర్ చేయడం ఎంతో ఆనందదాయకం. చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో మహిళలు వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది... ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సమ్మక్క , MPTC భిక్షావతి ,గొట్టిపాటి శ్రీనివాసరావు మేమున్నాం అద్యక్షులు నీలి ప్రకాష్, స్థానికులు చెరుకూరి సుబ్రహ్మణ్యం, చంటి, సుంకర మురళి, శ్రీకర్, అశోక్ రాజు, కొప్పుల కిరణ్, భాను, కృష్ణవేణి, ప్రభావతి, రాజేశ్వరి, కళ్యాణి.రాజా..అశోక్. చిలకమ్మ తదితరులు పాల్గొన్నారు...