03/12/2025
*స్వామియే శరణం అయ్యప్ప*
*గిద్దలూరు పట్టణం, గణేష్ నగర్ కు చెందిన తిమ్మరాజు వంశీ కృష్ణ స్వామి అక్టోబర్ 24 వ తేదీన గిద్దలూరు నుండి పాదయాత్రగా బయలుదేరి, 1200 కిలోమీటర్లు నవంబర్ 29వ తేదీ నాటికీ శబరిమలై శ్రీ అయ్యప్ప స్వామి వారి సన్నిధానం వరకు పాదయాత్ర పూర్తి చేసి అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు. పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని గిద్దలూరుకు వచ్చిన సందర్బంగా గిద్దలూరు పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో, అయ్యప్ప స్వాముల సమక్షంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సంస్థ సభ్యుల ఆధ్వర్యంలో పూలమాల శాలువా వేసి ఘనంగా సన్మానించటమైనది..*
🙏*స్వామియే శరణం అయ్యప్ప* 🙏
🙏 *శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సంస్థ గిద్దలూరు*