02/12/2025
నీరు ఉన్న ప్రతి ప్రాంతం ఆహ్లాదాన్ని ఇస్తుంది. నీటివనరులు ఉన్న ప్రతి ప్రదేశం పరిశుభ్రంగా ఉండాలని, అందరూ చెత్త లాంటివి వేయకుండా ఉంటే, మన దేశంలో చాలా వరకు సుందరమైన ప్రదేశాలు ఏర్పడతాయి. నీరు చాల విలువైంది. నీటి తోనే మనం శుభ్రంగా ఉంటాము. నీటి వనరులు ఉన్న ప్రాంతం అందంగా ఉంటుంది, జీవనం సాగించడానికి అనువైన ప్రదేశాలవుతాయి. బయటికి విహారయాత్రలకి వెళ్ళినప్పుడు వ్యర్థాలు నీళ్ళలో వేయకుండా, ఒక సంచిలో వేసి, దాన్ని దగ్గరలోని డస్ట్బిన్ లో వేయండి. మనం అలవాటు చేసుకునే సంస్కారాన్నే తరువాత తరాలవారు పాటిస్తారు. అలా ఉంది ఇలా ఉంది అనుకోవడం మానేసి, మన వంతుగా ఏం చేయగలమో అది చేస్తూ ఉండాలి. నీళ్ళు ఎంత శుభ్రంగా ఉంటే, అంటు వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. నీటితో మన జీవితం ముడిపడినప్పుడు, ఆ నీటిని కాలుష్య రహితంగా చూసుకుందాము.