ఆరోగ్య వ్యాసాలు Health Articals

ఆరోగ్య వ్యాసాలు  Health Articals Ayurarogyalu

11/10/2025

* అక్టోబరు 10 ప్రపంచ మానసిక దినోత్సవం

• మనసు గతి ఇంతే.. మన సుగతి అదంతే..

చదువు, సంపద, సంతానం.. ఇలా అష్ట ఐశ్వర్యాలూ కోరుకుంటాం. నిజానికి అంతకంటే ముఖ్యమైంది ఆరోగ్యం. అంతేగా మరి.. ఒళ్లు సహకరించకున్నా.. జిహ్వకు నచ్చింది తినలేకపోయినా- కోట్లు గడించి ఏం ప్రయోజనం? ఇక మానసిక ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అది కరువైతే అంతా శూన్యమే!

మన శరీరం- అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ, మనోమయ అనే 5 కోశాలతో ఉంటుందన్నారు యోగశాస్త్ర పండితులు. మనోమయ కోశం మనసు స్థానం. దీని మీద పట్టు, నియంత్రణ ఉంటే మానసిక ఆరోగ్యం సుస్థిరం. లేదంటే అంతా తేడా. ఈ తేడా రాకుండా మనం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.

మనసు చాలా చంచలమైంది. శునకం పనున్నా లేకున్నా.. పరిగెడుతుందే కానీ నిదానంగా నడవదు. మనసూ అంతే. ఆ నిరంతర పరుగు, తపన.. అన్నీ సుఖ సంతోషాల వెతుకులాటే. ఆ చంచలత్వంలో, వెంపర్లాటలో చిత్రవిచిత్ర ఊహలెన్నో! మనసు రంగురంగుల చిత్రాల్లాంటి కల్పనలు చేస్తుంటే, అవి శాశ్వతం, సజీవం అని భ్రమించి.. విఘాతాలు, వినాశనాలకు పాల్పడటం కద్దు. తర్వాత జీవుడు పశ్చాత్తాప్పడినా.. ప్రయోజనం లేదు. ప్రశంసలకు నోచుకునే మంచి పనుల కన్నా నరకసదృశం, పతనావస్థకు దారితీసే పనులు చేయడమే ఎక్కువ. అదే మనసు ఆడుకునే ఓ వింత ఆట. దాని ప్రేరక శక్తి చాలా ఎక్కువ. దానివల్లే ఎండమావుల్లాంటివి రూపొందుతాయి. సీతాకోకచిలుకలను పిల్లలు పట్టుకోవాలని వెంబడించినట్లు.. ఎండమావుల కోసం పరుగు సాగుతుంటుంది. ఆ కల్పనలు, కోరికలు, ఆకాంక్షల వెంట శరీరం సాగించే తెలివి తక్కువ పని ఇది. సుఖసౌఖ్యాల పట్ల ఆశ అందుకు పురికొల్పుతుంది.

మనసు చేసే మాయల్లో ప్రధానమైంది దేన్నెలా దక్కించుకోవాలో పథకం రచించటం ఒకటి. దాని ప్రకారమే- మనోహరమైన రంగురంగుల ప్రణాళిక తయారవుతుంది. ఇక అప్పటి నుంచి మెదడు దాని వెంటపడుతుంది. శరీరం ఆ దిశలోనే పనిచేస్తుంది. అసలు సంగతేమిటంటే- మనసు చంచలమైంది. పథకం ప్రకారం రూపొందించిన ప్రణాళికల మీద నిలవదు. ఎప్పటికప్పుడు కొత్తవి కల్పిస్తూనే ఉంటుంది. నిన్నటిది పూర్తవకుండానే మరోదాంతో ముందుకొస్తుంది. మొదటిదాన్ని వదిలేసి కొత్తదాన్ని పట్టుకుంటుంది. ఇలా అనేక ప్రణాళికలు అసంపూర్ణాలుగా మిగులుతూ, కొత్తవి తయారవుతూ ఉంటాయి.

పై జన్మకు వెంటాడేది అదే..

నియంత్రణ లేని మనసుతో వచ్చే ప్రమాదమే ఇది. ఇదేమీ అంత చిన్న విషయం కాదు. ఈ ప్రమాదమే కర్మఫలమై మరు జన్మలో వెంటాడి, వేటాడుతుంది. అలా కర్మఫలం ఆ జీవుడు అనుభవించేదాకా కరగదు, తరగదు. వెయ్యి ఆవుల నడుమ ఉన్నా లేగదూడ తన తల్లిని గుర్తుపట్టి.. ఎలా దగ్గరికి చేరుతుందో.. అలా కర్మఫలం జీవుణ్ణి మరుజన్మలో పట్టుకుంటుంది. జీవితంలో కోరికలు గుర్రాలై దౌడు తీస్తున్నప్పుడు కళ్లెంతో అదుపు చెయ్యలేని, చేతకాని రౌతులా జీవుడుంటే జరిగేది ఇదే. అయితే ఈ కర్మఫలాన్ని అగ్గిరవ్వ దూదిపింజను దహించినట్టు మాడ్చి మసిచేసే ఉపాయం ఒకటుంది. ఒక శక్తిని సంపాదించుకుంటే.. దీన్నుంచి తప్పించుకోవచ్చు. ధ్యానం, తపస్సు, బీజాక్షర మంత్రజపాలతో ఆ శక్తి వస్తుందని నిరూపించే పురాణ కథల్లో.. సత్యవ్రతుడు, జడభరతుల కథలు ప్రధానమైనవి.

ఒకే ఒక్క బీజాక్షరం

దేవీ భాగవతంలో ఉతధ్యుడి కథ ఉంది. అతడో పండిత పుత్రుడు. కానీ.. గ్రహింపుశక్తి లేని అమాయక జీవి. అతడికి ఏం చెప్పినా అర్థంకాదు. నోట మాట కూడా లేదు. చుట్టుపక్కల వారితో పాటు తలిదండ్రులు కూడా ఆ అమాయకత్వానికి విసిగి చీదరించుకోసాగారు. దైవలీలగా ఆ ఛీత్కారాలు, అవమానాలు అంతటి అమాయకుణ్ణీ ఆలోచనలో పడేశాయి. ఇక తాను ఎవరికీ భారం కాకూడదు అనుకున్నాడు. ఇల్లు విడిచి గంగా తీరానికెళ్లాడు. ఓ ప్రశాంత ప్రదేశంలో ఉంటూ, దొరికింది తింటూ కాలం గడపసాగాడు. ఓ రోజు వేటగాడు- అడవిపందిని వేటాడుతుంటే.. అది పరుగెత్తుకొచ్చి ఉతధ్యుడున్న ఆశ్రమంలోని పొదలో దాక్కుంది. ఆ హడావుడికి అప్రయత్నంగా అతడి నోటి నుంచి ‘ఐ’ అనే అక్షరం వచ్చింది. అది సారస్వత బీజాక్షరం. ఆర్తితో త్రికరణ శుద్ధిగా పదేపదే ఆ అక్షరాన్ని పలకడంతో జగజ్జనని కరుణించింది. సద్బుద్ధితో పాటు వాల్మీకి మహర్షి అంతటి తెలివితేటలు కూడా క్షణాల్లో ప్రాప్తించాయి. ఇంతలో వేటగాడు అక్కడికొచ్చాడు. తాను వేటాడుతున్న మృగం గురించి అడిగాడు. ఉతధ్యుడు సందిగ్ధంలో పడ్డాడు. వాస్తవం చెబితే ఒక జీవిని హింసించిన పాపం వస్తుంది. రాలేదంటే- అసత్య దోషం అంటుకుంటుంది. ఆ సందిగ్ధంలోనే ఓ ఆలోచన తట్టింది. ‘నన్నడిగితే ఏం చెప్పనయ్యా? చూసిన కంటికి నోరు లేదు, అది చెప్పదు. చెప్పే నోటికి కన్ను లేదు, అది చూడలేదు. అందువల్ల విశాల అడవిలో నీక్కావలసిన ఆహారం దొరుకుతుంది.. అటు వెళ్లు’ అన్నాడు. ఆ మాటలు వేటగాడికీ నచ్చి, అక్కణ్ణుంచి వెళ్లిపోయాడు. దాంతో ఊపిరి పీల్చుకున్న ఉతధ్యుడు బీజాక్షర మంత్రాన్ని మరింత సాధన చేశాడు. అపార జ్ఞానం వచ్చింది. ఎప్పుడూ సత్యమే పలుకుతూ ఉండటంతో ఉతధ్యుడికి సత్యవ్రతుడనే పేరొచ్చింది. అలాగే భాగవతం అయిదో స్కంధంలో జడభరతుడి కథ ఉంది. ఎంతో తెలివైన భరతుడనే రాజు- మనసు మాయకు లొంగి సంసార బంధాల్లో చిక్కి జడభరతుడయ్యాడు. ఒకసారి జడత్వం ఆవరించిన భరతుడితో సంభాషించిన రహూగణ రాజు.. జడభరతుడి తెలివిని గ్రహించాడు.

మానసిక ఆరోగ్యం లేకున్నా.. దాని మీద నియంత్రణ లేకున్నా.. ప్రమాదాలు వాటిల్లుతాయి. అశాంతి, ఆందోళన ఆవరిస్తాయి. మానసిక ఆరోగ్యం స్థిరంగా ఉండటానికి, మనసును అదుపులో పెట్టుకోవటానికి ధ్యానం, తపస్సుతో పాటు సిద్ధాసనం, ఆంజనేయాసనం, ఉత్థానాసనం లాంటి యోగాసనాలు కూడా ఉపకరిస్తాయి.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జున రావు, గుంటూరు

#ఆయురారోగ్యాలు #ప్రపంచమానసికఆరోగ్యదినోత్సవం #వరల్డ్‌మెంటల్‌హెల్త్‌డే

       #ఆయురారోగ్యాలు
06/10/2025

#ఆయురారోగ్యాలు

• మునక్కాడలతో ఆందోళన మటుమాయం..!ఏడాది పొడుగునా దొరికే కూరగాయల్లో మునక్కాడలు ఒకటి. వీటితో కూర, పులుసు, పచ్చడి.. ఏదైనా అందర...
05/10/2025

• మునక్కాడలతో ఆందోళన మటుమాయం..!

ఏడాది పొడుగునా దొరికే కూరగాయల్లో మునక్కాడలు ఒకటి. వీటితో కూర, పులుసు, పచ్చడి.. ఏదైనా అందరికీ నచ్చేస్తుంది. దోస, బీర, చిక్కుడు, చిలకడదుంప, వంకాయ, క్యారెట్, క్యాబేజ్, బంగాళదుంప, టొమాటోలు.. ఇలా ఎందులో వేసినా వాటి టేస్టు రెట్టింపవుతుంది. మునక్కాడలు జోడించకపోతే పప్పుచారు చప్పగా ఉంటుంది. ఇవి రుచిగానూ ఉంటాయి, పోషకాలనూ అందిస్తాయి.

మునక్కాడల్లో ప్రొటీన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, భాస్వరం, సోడియం, పొటాషియం ఉన్నాయి.

వీటిని తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అరుగుదల బాగుంటుంది. వేళకు ఆకలి వేస్తుంది.
ఎముకలు దృఢంగా ఉంటాయి. కీళ్లనొప్పులు రావు.
కొలెస్ట్రాల్‌ స్థాయి క్రమబద్ధంగా ఉంటుంది.

రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.
కంటిచూపు మెరుగుపడుతుంది.

జుట్టు రాలే సమస్యను నివారిస్తాయి.

మధుమేహం అదుపులో ఉంటుంది.

థైరాయిడ్‌ను నియంత్రిస్తాయి.

దంతాలకు పటుత్వం వస్తుంది.

చర్మం పొడిబారదు, ముడతలు పడదు.
ముఖం మెరుస్తుంది.

వీటిలో పీచు అధికంగా ఉండటాన ఊబకాయం రాదు. బరువు తగ్గాలనుకునేవారు మునక్కాడలు తరచూ తింటుండాలి.

ఊపిరితిత్తులకు మేలు చేస్తాయి.
శ్వాస ఇబ్బందులు రావు.

మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
ఒత్తిడి, ఆందోళనలను దూరంచేసి
మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.

గర్భిణులు, పాలిచ్చే తల్లులు తరచూ మునక్కాడలు తినడం వల్ల తల్లికి, బిడ్డకు కూడా పోషకాలు అందుతాయి.

ఆయుర్వేదంలో వీటిని ఔషధంగా ఉపయోగిస్తారు.

#మునక్కాడలు #ఆయుర్వేదం #మధుమేహం #రోగనిరోధకశక్తి #ఒత్తిడి #ఆందోళన #ఔషధం
#మానసికప్రశాంతత #ఆయురారోగ్యాలు #ఆరోగ్యం #మునక్కాయ

* Steve Jobs 10 Minute Rule• స్టీవ్‌ జాబ్స్‌ 10 నిమిషాల రూల్‌.. లాభాలేంటి?ఎక్కువసేపు కూర్చొని ఆలోచిస్తే సమస్యకు పరిష్కార...
02/10/2025

* Steve Jobs 10 Minute Rule

• స్టీవ్‌ జాబ్స్‌ 10 నిమిషాల రూల్‌.. లాభాలేంటి?

ఎక్కువసేపు కూర్చొని ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరకదని యాపిల్‌ సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ నమ్ముతారు. ఆయన పాటించిన పది నిమిషాల నియమం ఇప్పుడు న్యూరో సైన్స్‌ అంగీకారం కూడా పొందింది. ఒక సమస్యకు 10 నిమిషాల్లో పరిష్కారం దొరక్కపోతే డెస్క్‌ వదిలి లేచి నడవాలన్నది ఈ నియమం సారాంశం. నడవడం వల్ల మొదడు కొత్త ఆలోచనల వైపు వెళ్తుతుందని, సృజనాత్మకత పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చార్లెస్‌ డార్విన్‌ నుంచి మార్క్‌ జుకర్‌బర్గ్‌ వరకు ఎంతోమంది నడక వల్ల తమ ఆలోచనలకు పదును పెట్టుకున్నామని చెప్పుకోవడం విశేషం.

ఈ కారణంగానే కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో శిక్షణ పొందిన న్యూరో సైంటిస్ట్‌ ‘మిథు స్టోరోని’ 10 నిమిషాల రూల్‌ను సిఫారసు చేస్తున్నారు. ఒక సమస్యను పరిష్కరించడానికి 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడితే వెంటనే డెస్క్ నుంచి బయటికి వచ్చి నడక ప్రారంభించాలంటున్నారు. శారీరకంగా కష్టపడితే శరీరానికి మంచిది కానీ.. మెదడు పనితీరును మెరుగుపరచడానికి కాదనీ, అయితే, ఒక కొత్త ఆలోచనతో ముందుకు రావాల్సినప్పుడు, సమస్యను పరిష్కరించుకోవాల్సినపుడు మాత్రం లేచి నడవడం తప్పనిసరి అని చెబుతున్నారు.

ఎందుకీ 10 నిమిషాల నడక..

10 నిమిషాలుగా సమస్య పరిష్కరించలేకపోతే లేచి నడక మొదలుపెట్టండి. ఎందుకంటే శరీరాన్ని కదిలిస్తే ఆలోచన విధానం కూడా మారుతుంది. నడుస్తున్నప్పుడు మీ దృష్టి పూర్తిగా ఒకే సమస్య మీద కూరుకుపోదు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించాల్సి ఉంటుంది. దాంతో మీ మెదడు ఒకే ఆలోచనలో ఉండిపోకుండా విభిన్న దారులు వెతుకుతుంది. “నడుస్తూ ఉంటే మీరు రూమినేట్‌ (ఒకే ఆలోచనలో మునిగిపోవడం) చేయలేరు. ఎందుకంటే దృష్టి మారిపోతూ ఉంటుంది. అదే సమయంలో లోపల మీ మెదడు సమస్యను వేరే కోణాల్లో అన్వేషిస్తుంది” అని స్టోరోని చెబుతున్నారు. అందుకే ఒక క్లిష్టమైన సమస్యను 10 నిమిషాల్లో పరిష్కరించలేకపోతే డెస్క్‌ దగ్గర కూర్చుని తలపట్టుకోవడం మానేసి లేచి నడక మొదలుపెట్టండి.. పరిష్కారం సులభంగా దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు.


#ఆయురారోగ్యాలు

       #ఆయురారోగ్యాలు  #ఆరోగ్యం
01/10/2025

#ఆయురారోగ్యాలు #ఆరోగ్యం

       #ఆయురారోగ్యాలు  #మంచిఆరోగ్యం  #ఆరోగ్యం
29/09/2025

#ఆయురారోగ్యాలు
#మంచిఆరోగ్యం #ఆరోగ్యం

Address

Hyderabad
500090

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+919866555598

Alerts

Be the first to know and let us send you an email when ఆరోగ్య వ్యాసాలు Health Articals posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram