19/03/2021
ప్రియమైన బోయ వాల్మీకి పెద్దలకు, సోదర సోదరీమణులకు నా వందనాలు. నేను గత నాలుగు యేండ్ల నుంచి కేవలం బోయ వాల్మీకుల వివాహా సంబంధాలు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది నేను నా జాతి మీద అభిమానంతో నీతి, నిజాయితీగా నామ మాత్రం ఫీజు తీసుకుంటూ నడిపిస్తున్నాను. దీంతో నాకు డబ్బుల కట్టలు ఏమీ రాలడం లేదు. కేవలం ధర్మ బద్దంగా నడిపిస్తున్నాను. నేను వాల్మీకి వివాహ పరిచయ వేదిక పెట్టిన ప్రతిసారీ నాకు 10 నుంచి 30 వేల దాకా నా సొంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి. అది అందరికి తెలియదు. వేరే వర్గాల వాళ్లు పరిచయ వేదికలు నిర్వహిస్తున్నారు మన జాతి తక్కువా? అని ధైర్యము చేసి పట్టుదలతో నడిపిస్తున్నాను. బోయ వాల్మీకి సింగిల్స్ అని ఒక వెబ్ సైట్ నడిపుస్తూ దాని ఖర్జులు కూడా భరిస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాను.
ఇది తెలియక కొంతమంది మన జాతి వాళ్లే 3 వేలు తీసుకునే వాడు 30 వేలు తీసుకునే వాళ్లు ఒక్కటే అనుకుంటే పొరపాటే...! ఎందుకంటే నేను లాభాల కోసము పరిచయ వేదికలు, పెళ్లి సంబంధాలు చూడటం లేదు. జాతి అభివృద్ది కోసమే అని నేను అనుకుంటున్నాను. మా ఇంటి వాళ్లు ఎందుకు నీకి తిప్పలు జాతి జాతి అని నీకు బాగలేనప్పుడు ఎవరు చూడరు అని అన్నా నేను వినకుండా నడిపిస్తున్నాను. కాబట్టి. మీరిచ్చే ఈ ఫీజు మన వేదికకు చందాలు అనుకొండి. సంబంధము చూడలేదు డబ్బులు తిరిగి ఇవ్వాళి అని ఎవరు అడగలేదు నా గురించి తెలియని ఒకరు తప్ప. మేము కూడా చూస్తున్నాము కద అంటారేమో కాని నేను నిర్వహించిన పరిచయ వేదిక గురించి గాని, అలాగే చూసిన పెల్లి సంబంధము గురించిగాని ఇంతవరకు తప్పుగా ఎవరు మాట్లాడలేదు. పరిచయ వేదికకు ఫంక్షన్ హాల్, భోజనాలు, బూక్ లెట్ ప్రింటిగ్ , ప్రకటనలకే రిజిస్ట్రేషన్ల తో వచ్చిన డబ్బు ఖర్చు అవుతోంది. నాకు నయ పైసా మిగలడం లేదు. మరి ఎందుకు నిర్వహిస్తున్నావ్ అని మీరు అడగవచ్చు? నాకు జాతి పై గల అపార ప్రేమాభిమానాలేనని చెప్పగలను. కొందరు ఫోటోలు , అమ్మాయి , లేద అబ్బాయి బయడేట పెడతారు కాని డబ్బులు ఇవ్వరు. పాపం వాళ్లు కూడా నా లాగ పేద వాళ్లే అనుకునేటట్టు చేస్తారు. జాతి సేవే మహర్షి వాల్మీకి సేవ. కావున దయ ఉంచి పెల్లి సంబంధాలు ఉచితంగా చూడలని ఎవరైనా అంటే? అది ఎవరు లేని, నిరుపేద జాతి బిడ్డలకు మాత్రమే..!
ఈ ఏడాది కూడా బోయ వాల్మీకి వివాహ పరిచయ వేదిక ఎప్రిల్ లేద మే నెలలో నిర్వహించాలని అనుకుంటున్నాను. కబట్టి మీరు లేద మీకు తెలిసిన వాళ్లకి ఈ వేదిక గురించి తెలియజేయ గలరని మనవి.