Sri Anantha Padmanabha Jyothishalayam

Sri Anantha Padmanabha Jyothishalayam This is a result oriented organization from last 25 years onwards services providing to all clients

Diwali day things
06/11/2023

Diwali day things

12/10/2023

Sri Anatha Padmanabha Jyothishalayam is providing all Astrological solutions from 25 years. For Consultations : 9959463336,7989462013

Consult me for ur happy life
29/03/2023

Consult me for ur happy life

21/03/2023

🙏 *శివారాధన*🙏
🍁🍁🍁🍁🍁🍁🍁

శివ శబ్దానికి ఎన్నో అర్థాలు, కలగబోయే శ్రేయస్సు, అరిష్టనాశం, సుఖాన్ని కలిగించేది, శుభాలను అందించేది, ధన్యతను ప్రసాదించేది, కోరికలను తీర్చేది, పుట్టుకకు కారణమైంది, కుత్సితాలను పోగొట్టేది, అశుభాలను తరిమికొట్టేది, మంచితనంతో కూడి ఉండేది... ఇలా ఎన్నో ఈ పేరులో ఇమిడి ఉన్నాయి. ఇన్ని శివగుణాలు కలవాడు శివుడు. ఆయనను ఆరాధిస్తే ఆరాధకుడికి ఆ గుణాలే అలవడతాయి.

రుద్రుడు అంటే రోదనాన్ని పోగొట్టేవాడు. రోదనం అంటే దుఃఖమే. దుఃఖం మనిషికి పుట్టుకతోనే వస్తుంది. ఇది పుడమి గర్భంలో మనిషి కలిసిపోయేదాకా ఉంటుంది. దుఃఖం లేని మనిషి అలలులేని సాగరం ఉండనే ఉండవు. సముద్రజలాలను అలలు ఎలా కల్లోలం చేస్తుంటాయో జీవన సాగరంలోనూ దుఃఖాల కెరటాలు మనిషిని పడదోస్తుంటాయి. దుఃఖించే మనిషికి ఓదార్పు కావాలి. చేయూత కావాలి.
ఇలాంటి నేపథ్యంలో మనిషికిగల ఏకైకగమ్యం శివారాధన, శివుడు ఇలాంటి ఒడుదొడుకులేవీ లేనివాడు. నిశ్చలుడు. అందుకే అతడికి స్థాణువు అనే పేరుంది. స్థాణువు అంటే రాయి కాదు. మానసిక స్థైర్యం. అది పరమేశ్వరుడి సహజగుణం. ఎంతటి ప్రళయంలోనైనా చెక్కుచెదరని స్థిరత్వం. ప్రపంచాన్నే భస్మం చేయగల హాలాహల విషాన్ని కంఠంలో దిగమింగే ధీరత్వం. అది మనిషికి కావాలి. ఎలాంటి దుర్భర పరిస్థితిలోనైనా నిలబడే ఆత్మశక్తి రావాలి. జీవితమంతా విజయసోపానం కావాలి. అందుకు శివారాధనే శరణ్యం.

శివుడికి ఏ కోరికలూ లేవు. వాటికోసం పరుగులు తీయాలనే తలపు లేదు. ఆయన కోరిక అంతా విశ్వశ్రేయస్సే. అందరూ బాగుండాలనే అభిమతమే! శివుడి స్థిరత్వాన్ని భంగం చేయడానికి మన్మథుడు ప్రయత్నించాడు. నిశ్చలచిత్తుడైన పరమేశ్వరుడి పైనే పూలబాణాలు కురిపించబోయాడు. శివుడి మనసును కోరికలతో మలినం చేయాలని భావించాడు. సంయమి అయిన శివుడి ముందు అతడి ఆటలు సాగలేదు. తన నిశ్చలత్వాన్ని నాశనం చేయజూసిన మన్మధుడిపై మూడోకన్ను తెరచి, భస్మం చేశాడు. అతడ్ని అనంగుడిగా (శరీరం లేనివాడిగా) మార్చివేశాడు. మనిషి కూడా శివుడిలా ఉండాలి. ప్రపంచంలో తన చుట్టూ ఎన్నో ప్రలోభాలు ఉసిగొల్పుతున్నా సంయమనాన్ని కోల్పోరాదు. ఎందరు ఎన్ని ఆశలు పెట్టినా మోసపోరాదు. అన్నింటిలోనూ యుక్తాయుక్త విచక్షణ కలిగి ఉండాలి. ఏది చేస్తే మంచి జరుగుతుందో అదే చేయాలి. తాత్కాలిక లాభాలకోసం బంగారు భవిష్యత్తును పణంగా పెట్టరాదు. శివుడిలా వీరుడిలా, ధీరుడిలా నిలవాలి. ఇదే శివారాధనలోని
ఈ ప్రపంచంలో అంతా శివభావనామయం. పంచభూతాల్లో శివుడున్నాడు. సూర్యచంద్ర నక్షత్రరాశుల్లో శివుడున్నాడు. శివుడు లేనిదెక్కడ? అణువణువూ శివుడే. అడుగడుగునా శివుడే సకల బ్రహ్మాండ భాండమే శివమయం అని రుద్రాధ్యాయం చెబుతోంది. మనిషి ఎల్లవేళలా శివభావనలో లీనం కావాలి. తన జీవితాన్ని శివానందపూరితంగా మార్చుకోవాలి!🙏🪷

12/03/2023

🚩🕉️ అపూర్వ శాస్త్రాలు 🕉️🚩

నేడు అమలులోలేని మనకు తెలియని మన పూర్వీకులు మనకందించిన అపూర్వగ్రంథ శాస్త్ర రాజములు:

🌼 1.అక్షరలక్ష:
ఈ గ్రంథం ఒక ఎన్సైక్లోపీడియా గ్రంథము.రచయిత వాల్మీకి
మహర్షి.రేఖాగణితం,బీజగణితం,త్రికోణమితి,భౌతిక గణితశాస్త్రం మొదలైన 325 రకాల గణితప్రక్రియలు, ఖనిజశాస్త్రం,భూగర్భశాస్త్రం,జలయంత్ర శాస్త్రం, గాలి,విద్యుత్,ఉష్ణం లను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.

🌼 2.శబ్దశాస్త్రం:
రచయిత ఖండిక ఋషి. సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను,ప్రతిధ్వనులను ఇది చర్చించింది.ఇందులోని ఐదు అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం,వాటి పిచ్(స్థాయి),వేగాలను కొలవడం వివరించారు.

🌼 3.శిల్పశాస్త్రం:
రచయిత కశ్యపముని. ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి.307 రకాల శిల్పాల గురించి,101
రకాల విగ్రహాలతో కలిపి సంపూర్ణంగా చర్చించారు. గుళ్ళు,రాజభవనాలు,చావడులు మొదలైన
నిర్మాణవిషయాలు 1000కి పైబడి ఉన్నాయి. ఇదే శాస్త్రం పై విశ్వామిత్రుడు,మయుడు, మారుతి మొదలగు ఋషులు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి.

🌼 4.సూపశాస్త్రం:
రచయిత సుకేశుడు.ఇది పాకశాస్త్రం.ఊరగాయలు, పిండివంటలు తీపిపదార్థాలు,108 రకాల వ్యంజనాలు మొదలగు అనేకరకాల వంటకాల గురించి, ప్రపంచవ్యాప్తంగా ఆ కాలం లో వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది.

🌼 5.మాలినీ శాస్త్రం:
రచయిత ఋష్యశృంగ ముని.పూలమాలలను తయారుచేయడం,పూలగుత్తులు,పూలతో రకరకాల
శిరోఅలంకరణలు,రహస్యభాషలో పూవులరేకుల పైన ప్రేమసందేశాలు పంపడం లాంటి అనేక
విషయాలు 16 అధ్యాయాలలో వివరింపబడ్డాయి.

🌼 6.ధాతుశాస్త్రం:
రచయిత అశ్వినీకుమార. సహజ,కృత్రిమ లోహాలను గురించి 7 అధ్యాయాలలో కూలంకుషంగా వివరించారు.
మిశ్రమలోహాలు,లోహాలను మార్చడం,రాగిని బంగారంగా మార్చడం మొదలగునవి వివరించారు.

🌼 7.విషశాస్త్రం:
రచయిత అశ్వినీకుమార.
32 రకాల విషాలు,వాటి గుణాలు,ప్రభావాలు,
విరుగుడులు మొదలైన విషయాలు చెప్పారు.

🌼 8.చిత్రకర్మశాస్త్రం(చిత్రలేఖనశాస్త్రం):
రచయిత భీముడు.ఇందులో 12 అధ్యాయాలు
ఉన్నాయి. సుమారు 200 రకాల చిత్రలేఖన ప్రక్రియల గురించి చెప్పారు. ఒక వ్యక్తి తలవెంట్రుకలను గాని,గోటిని కాని,ఎముకను కాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే
ప్రక్రియ చెప్పబడింది.

🌼 9.మల్లశాస్త్రం:
రచయిత మల్లుడు. వ్యాయామాలు,ఆటలు, వట్టిచేతులతో చేసే 24 రకాల విద్యలు
చెప్పబడ్డాయి.

🌼 10.రత్నపరీక్ష:
రచయిత వాత్సాయన ఋషి.రత్నాలు కల్గిఉన్న 24 లక్షణాలు చెప్పబడ్డాయి.వీటిశుద్దతను
పరీక్షించడానికి 32 పద్దతులు చెప్పబడ్డాయి.రూపం, బరువు మొదలగు తరగతులుగా
విభజించి తర్కించారు.

🌼 11.మహేంద్రజాల శాస్త్రం:
సుబ్రహ్మణ్యస్వామి స్వామి శిష్యుడైన వీరబాహువు రచయిత. నీటిపై నడవడం,గాలిలో
తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది.

🌼 12.అర్థశాస్త్రం:
రచయిత వ్యాసుడు.ఇందులో భాగాలు 3.ధర్మబద్ధమైన 82 ధనసంపాదనా విధానాలు ఇందులో
వివరించారు.

🌼 13.శక్తితంత్రం:
రచయిత అగస్త్యముని. ప్రకృతి,సూర్యుడు,చంద్రుడు,గాలి,అగ్ని మొదలైన 64 రకాల బాహ్యశక్తులు,వాటి ప్రత్యేక వినియోగాలు చెప్పబడ్డాయి. అణువిచ్చేదనం ఇందులోని భాగమే.

🌼 14.సౌధామినీకళ:
రచయిత మతంగ ఋషి.నీడల ద్వారా,ఆలోచనల ద్వారా అన్ని కంటికి కనపడే విషయాలను ఆకర్షించే విధానం చెప్పభదింది.భూమి మరియు పర్వతాల లోపలిభాగాల ఛాయాచిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది.

🌼 15.మేఘశాస్త్రం:
రచయిత అత్రిముని.12 రకాల మేఘాలు,12 రకాల వర్షాలు,64 రకాల మెరుపులు,33 రకాల
పిడుగులు వాటి లక్షణాల గురించి చెప్పబడింది.

🌼 16.స్థాపత్యవిద్య:
అదర్వణవేదం లోనిది. ఇంజనీరింగ్,ఆర్కిటెక్చర్,కట్టడాలు,నగరప్రణాలిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి.

ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం,
సాముద్రిక శాస్త్రం, అగ్నివర్మ విరచిత అశ్వశాస్త్రం,
కుమారస్వామి రచించిన గజశాస్త్రం,
భరద్వాజ ఋషి రచించిన యంత్రశాస్త్రం మొదలగునవి ,
ఆయుర్వేదం,ధనుర్వేదం,గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి.

నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద?

వీటిలో చాలా వరకు నేడు అందుబాటులో లేవు​.

🌼 ఓం నమః శివాయ

17/02/2023

సరైన ఒక చిన్న అలోచన అధ్బుతమైన సంకల్పంగా మారి అపూర్వమైన ఫలితాలు పొందడమే అది కూడా సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం అనే సత్యాన్ని తెలుసుకొని మాయా ప్రచారాలు, మనసు మాయ నుండి బయట పడి నీ దగ్గర ఉన్న సరైన సాధన అనే బ్రహ్మాస్త్రం ద్వారా బ్రహ్మాండమైన జీవితం అనుభవిస్తూ ఉండండి...
మూసీ వేసిన పాత్రలో ఏ నీటిలో ముంచినా కూడా ఒక్క చుక్క నీటి చుక్క కూడా లోనికి పోదు.
అలాగే నమ్మకం,విశ్వాసం లేని ఇది ఎలా అది ఎలా సాధ్యం అనే రకరకాల ప్రశ్నలు శరీరం అనే పాత్రకు బిరడా లాంటివి. ముందుగా బిరడా తీసివేసి సాధన అనే నీటిలో ముంచితే నీరు అనే విశ్వశక్తి పాత్ర అనే శరీరంలో నిండి పోయి మాంస పిండం మంత్ర పిండంగా మారుతుంది.
అనుమానం పెనుభూతంగా కాకుండా అనుభవమే జ్ఞానంగ సరైన సాధన ద్వారా ఆత్మ శక్తిని పొందడమే... అజ్ఞానులు విజ్ఞానులుగా మారడమే.
అర్దం పర్ధం లేని ప్రచారాలకు దూరంగా ఉండండి, ఎవరిని వారే ఉద్దరించుకోవలనే పెద్దలు, గురువులు చెప్పిన ఆద్యాత్మిక సత్యాన్నీ తెలుసుకొని సరైన సాధన ఎలా చేయ్యాలి అని తెలుసుకొని సాధన చేయడం మాత్రమే చెయ్యాలి. దుఖాలతో దుర్బర పరిస్ధితుల నుండి బయట పడడానికి ఆనందకర జీవితాన్ని అనుభవిస్తూ ఉండడానికి సరైన సాధన మాత్రమే శరణ్యం..

09/02/2023

_*🚩రేపు సంకటహర చతుర్థి ‬పూజ , వ్రత విధానం మరియు సమగ్ర వివరణ🚩*_

🕉🕉🕉🕉🕉🕉🕉

గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. మొదటిది వరదచతుర్థి , రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతం ను వరదచతుర్థి అని , పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి , సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరద చతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు.

ఒకవేళ సంకష్ట హర చతుర్థి *మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి* అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి (Angarika Chaturthi) నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా , చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి.

ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3 , 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు(సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి.

*☘సంకటహర చతుర్థి ‬ వ్రత పూజా విధానం☘*

సంకటహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి.
ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి.
వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే శిరస్సున స్నానం చేసి , తరువాత గణపతిని పూజించాలి.
అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవిక గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని
పసుపు , కుంకుమలతో అలంకరణను చేయాలి.
మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు , రెండు వక్కలు , దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.
సంకటనాశన గణేశ స్తోత్రం , సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను.

ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి.
తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి.
శక్త్యానుసారము గరిక పూజను కాని , గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును.
సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కదపరాదు.
సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి.
నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి.

*☘సంకట హర చతుర్ధి వ్రత కథ:☘*

ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా ఘర్‌సేన్‌ అనే రాజు రాజ్యం దాటే సమయంలో , అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం పై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించ సాగాడు.

అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు… ఓ రాజా ! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా ! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా !

అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి , నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో , వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా ? అని !! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.

అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత , *‘నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది’* అని చెప్పాడు.

అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేషుని దూతని అపుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని , అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు.

ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత , ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.

*గణపతి ప్రార్ధన*

*శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !*
*ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే !!*

*☘గణనాయకాష్టకం☘*

ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్

మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతమ్
బాలేందుశకలం మౌళీ , వందేహం గణ నాయకమ్

చిత్రరత్నవిచిత్రాంగం , చిత్రమాలా విభూషితమ్
కామరూపధరం దేవం , వందేహం గణనాయకమ్

గజవక్త్రం సురశ్రేష్ఠం , కర్ణచామర భూషితమ్
పాశాంకుశధరం దేవం వందేహం గణ నాయకమ్

మూషికోత్తమ మారుహ్య దేవాసురమహాహవే
యోద్ధుకామం మహావీరం వందేహం గణ నాయకమ్

యక్షకిన్నెర గంధర్వ , సిద్ధ విద్యాధరైస్సదా
స్తూయమానం మహాబాహుం వందేహం గణ నాయకమ్

అంబికాహృదయానందం , మాతృభి: పరివేష్టితమ్
భక్తిప్రియం మదోన్మత్తం , వందేహం గణ నాయకమ్

సర్వవిఘ్నహరం దేవం , సర్వవిఘ్నవివర్జితమ్
సర్వసిద్ధి ప్రదాతారం , వందేహం గణ నాయకమ్

గణాష్టకమిదం పుణ్యం , యః పఠేత్ సతతం నరః
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్

*ఇతి శ్రీ గణనాయకాష్టకం*

*☘సంకటహర గణపతి స్తోత్రం☘*

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యమాయు: కామార్ధ సిద్ధయే
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం
లంబోదరం పంచమం చ షష్టం వికటమేవచ
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తధాష్టకం
నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం
ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్
ద్వాదశైతావి నామాని త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం
నచవిఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో
విద్యార్దీ లభతే విద్యాం ధనార్దీ లభతే ధనం
పుత్రార్దీ లభతే పుత్రాన్ మోక్షార్ధీ లభతే గతిమ్
జపేత్ గణపతిస్తోత్రం చతుర్మాసై: ఫలం లభత్
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః

_*☘విఘ్నేశ్వర నమస్కార స్తోత్రం☘*_

జయ విఘ్నేశ్వర ! నమో నమో , జగద్రక్షకా ! నమో నమో
జయకర ! శుభకర ! సర్వపరాత్పర ! జగదుద్ధారా ! నమో నమో

మూషిక వాహన ! నమోనమో , మునిజనవందిత ! నమో నమో
మాయా రాక్షస మదాపహరణా ! మన్మధారిసుత ! నమో నమో

విద్యాదాయక ! నమో నమో , విఘ్నవిదారక , నమో నమో
విశ్వసృష్టి లయ కారణ శంభో ! విమల చరిత్రా ! నమో నమో !

గౌరీప్రియ సుత నమో నమో గంగానందన నమో నమో
అధర్వాద్భుతగానవినోదా ! గణపతిదేవా ! నమోనమో !

నిత్యానంద ! నమో నమో , నిజఫలదాయక ! నమో నమో
నిర్మలపురవర ! నిత్యమహోత్సవ ! రామనాథ సుత నమో నమో

🙏🙏🌸🙏🙏🌸🙏🙏🌸🙏🙏

05/02/2023

గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః

ఈ శ్లోకం అందరికీ తెలుసు కానీ ఈ శ్లోకం ఎలా పుట్టింది. మొదట ఎవరు పలికారు. ఎందుకు పలికారు.. దాని వెనుక ఉన్న కథ.

పూర్వం కౌత్సుడు అనే పేద పిల్లవాన్ని విద్యాధరుడు అనే గురువు గారు తన ఆశ్రమానికి పిలుచుకు వచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పాడు. ఒకసారి గురువు గారు పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్ళాడు. గురువు గారు తిరిగి వచ్చేవరకు కౌత్సుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు.

గురువు గారు తిరిగివచ్చిన కొన్ని రోజులకు కౌత్సుడి చదువు పూర్తయింది. కౌత్సుణ్ణి తీసుకెళ్లాడానికి తల్లిదండ్రులు వచ్చారు. కానీ కౌత్సుడు తాను గురువు గారి దగ్గరే ఉంటానని ఇంటికి రానని ఖరాఖండిగా చెప్పి తల్లిదండ్రులను వెనక్కి పంపాడు.

వాళ్ళు వెళ్లిన తరువాత గురువు కారణం అడిగాడు.అప్పుడు కౌత్సుడు ఇలా చెప్పాడు "గురువు గారూ మీరు కొన్ని రోజుల క్రితం బయటకు వెళ్ళినపుడు మీ జాతకం చూసాను.మీరు సమీప భవిష్యత్తులో భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్లలేను." అని చెప్పాడు.

కొన్ని రోజులకు గురువు గారికి క్షయ రోగం వచ్చింది.ఆ కాలంలో క్షయకు చికిత్స లేకపోవడంతో కాశీకి వెళ్లి దాన ధర్మాలు, పుణ్య కార్యాలు చేయాలని గురుశిష్యులు కాశీకి వెళ్లారు. గురువుగారి రోగం చూసి కాశీ ప్రజలు వీళ్ళను అసహ్యించుకున్నారు. కానీ కౌత్సుడు గురువు గారికి సేవలు చేస్తూనే ఉన్నాడు. ఎంతోమంది గురువు గారిని వదిలి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ కౌత్సుడు మాత్రం గురువు గారిని వదలలేదు.

కౌత్సుడి గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలనుకున్నారు. మొదట బ్రహ్మ మారువేషంలో వెళ్లి గురువుని వదిలేయమని సలహా ఇచ్చాడు. కౌత్సుడు బ్రహ్మ చెప్పిన మాటలు వినలేదు. మరలా విష్ణువు మారు వేషంలో వచ్చి సలహా ఇచ్చినా కూడా కౌత్సుడు వినలేదు. చివరికి పరమేశ్వరుడు వచ్చినా వినలేదు. మెచ్చిన పరమేశ్వరుడు ఏదయినా సహాయం కావాలా అని అడిగాడు. మరెవరూ గురువును వదిలేయమనే సలహా ఇవ్వడానికి రాకుండా కాపలా కాయమన్నాడు.

అతని గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. కౌత్సుడికి మోక్షం ఇస్తాం అన్నారు. అప్పుడు కౌత్సుడు వారితో నాకు మీ గురించి చెప్పి ఈ రోజు మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ, నా గురువే నాకు విష్ణువు, నా గురువే నాకు మహేశ్వరుడు. మీరు సాక్షాత్కారం అవడానికి కారణమైన నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా ఇలా శ్లోకం చెప్పాడు.

గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః

తన గురువు గారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు. గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువుగారికి మోక్షం ప్రసాదించారు. ఆనందంతో కౌత్సుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు.

ఇదీ ఈ శ్లోకం వెనుక ఉన్న కథ...

కొన్ని ముఖ్య శ్లోకల విలువలు, అర్ధాలు అందరము తెలుసుకోవాలి, మనము అందరం మన తరువాత వాళ్ళకి కూడా తెలియజేయాలి

🙏🙏🙏

30/01/2023

నా మనసులో మాట!!!

నందమూరి తారక రత్న మహా ఉంటే వయసు ఉంటుంది 40+ ఒకటో రెండో మూడో,
ఒక్క రోజు కొద్ది సేపు బయట నడిస్తేనే కళ్ళు తిరిగి పడిపోవడం, మళ్లీ పరిస్థితి సీరియస్ విషమం అంటూ వార్తలు, ప్రాణాలకు ఆపాయం లేదు అంటూ బ్రేకింగ్ న్యూస్
ఏంటి ఈ తరం ??
ఏం జరుగుతుంది అసలు???
అంత డబ్బు, మంచి తిండి, పోషణ ఉంటున్నా కూడా ప్రముఖులు లేదా సామాన్యులు ఎవరన్నా 40 యేళ్లు దాటితే చాలు చాలా సెన్సిటివ్ గా ఉంటున్నారు, చిన్న వయసులోనే కొందరి ప్రాణాలు క్షణాల్లోనే పోతున్నాయి !!
కారణం ఏమై ఉంటుంది ????
కన్నడ రాజ్ కుమార్ మరణం కూడా చాలా షాకింగ్ !!!

నాకు తెలిసి 1980 తర్వాత తరం చాలా ప్రమాదపు అంచుల్లో ఉంది
తినే ఆహారం కలుషితం,
తాగే నీరు కలుషితం,
పీల్చే గాలి పూర్తి విష తుల్యం.

అంతటా కల్తీ ఆహార పదార్థాలు రాజ్యం ఏలుతున్నాయి.
క్యాన్సర్ కారక సింథటిక్ ఫుడ్ రంగులు, ఆహార పదార్థాల్లో వేసే వెనిగర్, టేస్టింగ్ సాల్ట్, సాస్ లు, ఒకటికి పదిసార్లు కాచి ఫిల్టర్ చేసి అమ్మే కల్తీ నూనెలు, పాడైపోతున్న కుళ్ళిన వారాల పాటు డీప్ ఫ్రీజర్స్ లో నిల్వ చేసిన చికెన్, మటన్, చేపలు వంటి మాంసాహారం,
యూరియా సర్ఫ్ వేసి చేస్తున్న పాలు పాల ఉత్పత్తులు
భయంకరంగా చచ్చిన మూగ జీవాల శవాలు పేగులు వేసి చెరువుల్లో పెంచుతున్న రొయ్యలు చేపలు
ఇంజెక్షన్లు స్టెరాయిడ్స్ ఇచ్చి గుడ్లు పెట్టిస్తు
కిలోలు కిలోలు నెలరోజుల్లో బరువుపెరిగే కోళ్లు
అన్నీ మానవ శరీరానికి నూటికి నూరుశాతం హని కలిగించేవే
అవన్నీ ఇప్పుడు యదేచ్ఛగా
మార్కెట్లో పునుగుల బండి నుండి 5స్టార్ హోటల్ వరకు వాడుతున్నారు.
ఆరోగ్య శాఖ పర్యవేక్షణ సక్రమంగా లేదు.

అసలు పండే పంటలోనే దమ్ము లేదు.
అంతా హైబ్రిడ్ వంగడాలు
అన్నీ క్రాస్ బ్రీడ్ పంటలు
ఎరువులు, పురుగుమందులు
ఒకప్పుడు పచ్చిమిర్చి బజ్జీ ఇరవై తినేవాడిని తొక్క కూడా అరిగిపోయేది.
ఇప్పుడు మిర్చి తొక్క ప్లాస్టిక్ పేపర్ లా ఉంటుంది తొక్కైనా అరిగే అవకాశం లేదు
ఒకప్పుడు దోసకాయ తొక్క తీయకుండా వండేవారు
చక్కగా కరిగిపోయేది కూరలో తింటే....అలాగే వంకాయ, టొమోటో, ఆపిల్ తొక్కలు కూడా ప్లాస్టిక్ పొరల్లా అయ్యాయి ఇప్పుడు తింటే అరిగే పరిస్థితి లేదు కారణం ???

ప్రభుత్వాలు ప్రజారోగ్యం మీద భవిష్యత్ తరాల కోసం అన్నా దృష్టి పెట్టాలి.
బయట దొరికే ఆహారం
మరియు మన దేశంలో పంటలు విషయంలో దృష్టి పెట్టాలి.
రైతుల్ని ప్రోత్సహించి
సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేపించాలి
దేశీయ పంటల్ని, విత్తనాల్ని అభివృద్ధి చేసి వాడుకలో తీసుకురావాలి.
నకిలీ విత్తనాలు ఎరువులు పురుగుమందులు అమ్మే సంస్థలు, తయారీదారుల పట్ల ఉక్కు పాదం మోపాలి.

మాకోసం కాకున్నా
అయ్యా రాజకీయ నాయకులారా!
మీ పిల్లలు, మీ వంశం నిలబడాలి అన్నా మీరు ఈ విషయం గురించి చిత్తశుద్ధితో ఆలోచన చేయాలి.

30/01/2023

*గత జన్మ పాపాలు…*
* …నేటి ఖర్మలు!*
➖➖➖

*ఈ లోకంలో ఏదీ కారణం లేనిదే జరుగదు. ప్రతిదానికీ ఓ కారణం ఉంటుంది. మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు, ఖర్మకు పూర్వకర్మయే కారణం. ఎందుకంటే ఈ లోకమున ప్రతి జీవి జన్మించడానికి కారణం.. ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే!*

*చెడు కర్మకి ఫలితం పాపం, పాపానికి దుఃఖం, మంచి కర్మకి ఫలితం పుణ్యం. పుణ్యానికి సుఖం అనుభవించాలి.*

*వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. ఇది హిందూ సనాతన ధర్మము చెప్పే కర్మ సిద్దాంతము. ఈ సిద్ధంతమే హిందూ మతానికి పునాది కూడా.*

*కర్మ సిద్దాంతము ప్రకారం.. జన్మించడానికి పూర్వం ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు, ఆ కర్మఫలం వల్ల ఆ జీవి ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తుంది. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మ లాగే మరో జన్మని కూడా తీసుకోవచ్చు. గత జన్మ లాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు.*

*మొత్తానికి పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం. పూర్వ జన్మలో మనం చేసిన పాపం ఏదైనా వ్యాధి రూపంలో అనుభవములోనికి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.*

*గత జన్మలో మనం చేసిన పాప పుణ్యములను బట్టియే మన జన్మ ఆధారపడి ఉంటుంది. మన జాతక చక్రం అందుకు అనుగుణంగా తయారవుతుంది. మన కర్మే గ్రహాల రూపంలో వచ్చి మనల్ని బాధ పెట్టడమో లేదా సుఖ పెట్టడమో జరుగుతుంది. ఆ గ్రహాలు కూడా ఏదో మనిషి రూపములోనో లేదా వ్యాధుల రూపంలోనో వచ్చి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి.*

*మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణాలు ఏంటీ..? వాటిని ఎలా నివారించుకోవాలి అనే విషయాలను వివరించగలగడం జ్యోతిర్విజ్ఞానంలోని అద్భుతాలలో ఒకటి.*

*గతజన్మ పాపాలు వాటి ప్రభావాలను గురించి అంపశయ్యమీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు అనేక ఉదాహరణలతో వివరిస్తాడు.*

*ఈ వివరాలు భారతంలో మనం చూడవచ్చు. కనుక కర్మతో పాటు దాని ఫలితం అనుభవించడమూ ఉన్నదని స్పష్టమవుతోంది.*

*సాధారణ జ్యోతిష్యంవల్ల కూడా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. నాడీగ్రంధాల నుంచి కూడా తెలుసుకోవచ్చు. కాని నాడీ గ్రంధాలు ఈ విషయాలలో స్పెషలైజుడ్ రీసెర్చి చేసినవి గనుక వాటి నుంచి ఈ వివరాలు బాగా తెలుస్తాయి.*

*పూర్వ జన్మలో మానవులు చేసే పాపాలు, ప్రస్తుత జన్మలో వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో కొన్నింటిని పరిశీలిద్దాం.*

*గత జన్మలో ఓ వ్యక్తి తల్లిదండ్రులను పట్టించుకోకుండా గాలికొదిలేశాడు. ఫలితంగా ఈ జన్మలో అతడు కొడుకుల తిరస్కారంతో వృద్ధాశ్రమంలో చేర్చబడి, పూర్వజన్మలో తన తల్లిదండ్రులను తాను పెట్టిన బాధను ప్రస్తుతం అనుభవిస్తున్నాడు.*

*గత జన్మలో ఓ వ్యక్తి ఒక కన్యను గర్భవతిని చేసి ముఖం చాటేశాడు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఈ జన్మలో ఇతనికి సంతానం లేదు. ఇప్పటికి రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇద్దరు భార్యలూ విషాద పరిస్థితుల్లో మరణించారు. వయసు అయిపోతోంది. చేతిలో డబ్బులేదు. ముసలి వయసులో ఫుట్ పాత్ మీద అడుక్కుంటూ దిక్కులేని చావు గతి అయ్యేటట్లు ఉంది.*

*గత జన్మలో ఒక అమ్మాయి అసూయతో తన తోటి అమ్మాయిల పెళ్ళి సంబంధాలు చెడగొట్టేది. ఈ విషయం ఆ అమ్మాయి జాతకంలో క్లియర్ గా కనిపిస్తున్నది. ఈ జన్మలో ఆ అమ్మాయికి ఎన్ని పెళ్ళిసంబంధాలు వచ్చినా ఒక్కటీ కుదరటం లేదు. గట్టిరెమెడీలు చేస్తే గాని ఈ దోషం తొలగదు.*

*ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జన్మలో పూర్వ జన్మ ప్రభావం ఎదుర్కొంటున్నవారు కనిపిస్తారు. వీరందరూ సరియైన రెమెడీలు పాటిస్తే ఈ సమస్యలు ఆగిపోతాయి. అయితే, సరియైన సమయంలోనే ఆ రెమెడీలు పాటించాల్సి ఉంటుంది.*

*గత జన్మ పాపాలకు ప్రస్తుతం పూజలెందుకు?*

*పూర్వ జన్మలో చేసిన పాప ప్రక్షాళనకు ఈ జన్మలో ఆ సర్వేశ్వరునికి త్రికరణశుద్ధితో పూజలు చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు మాత్రం పూర్వ జన్మలో చేసిన పాపాలకు ఇప్పుడు పూజలు చేయటమేమిటని అనుకుంటారు. అయితే, పాప ప్రక్షాళనకు భగవంతునికి చేసే పూజలు, వ్రతాలు వంటివన్నీ వ్యాధి వస్తే మాత్ర వేసుకోవటం వంటివి. తలనొప్పి దాని పని అది చేస్తూ ఉంటే మాత్ర దానికి సమాంతరంగా తన పని అది చేసుకుంటూ పోతుంది. చివరికి ఒక దశలో దాని ప్రభావం ఎక్కువై తలనొప్పి తగ్గిపోతుంది.*

*అదే మాదిరిగా గత జన్మలో చేసిన పాపాల ప్రభావం, వాటికి విరుగుడుగా చేసే పూజలు, వ్రతాలు శాంతులు సమాంతరంగా సాగుతుంటాయి. ఎప్పుడైతే ఆ భగవంతుని ప్రభావం ఎక్కువవుతుందో గత జన్మలో చేసిన పాపాలు పటాపంచలవుతాయి. దోషాలు పోతాయి... *

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

28/01/2023

*నేను ఎవరు ?*
➖➖➖

*కా తే కాంతా కస్తే పుత్రః* *సంసారోఽయమతీవ విచిత్రః*
*కస్య త్వం కః కుత ఆయాతః*
*తత్త్వం చింతయ తదిహ భ్రాతః||*

*--- ఆదిశంకరుల భజగోవిందం నుండి...*

*నీ భార్య ఎవరు? నీ పుత్రుడు ఎవరు? ఈ సంసారము చాలా విచిత్రమైనది. నీవెవడివాడవు? ఎవడవు? ఎక్కడినుండి వచ్చావు? ఓ సోదరుడా! తత్త్వమునాలోచింపుము.*

*1) కాతేకాంతః...*

*నీ భార్య ఎవరు..? ఇప్పుడు నీ భార్య అనబడే స్త్రీ వివాహానికి ముందు ఒకరి కుమార్తె. ఆమె పుట్టుకలోగాని, పెరగటంలోగాని నీకు ఏ ప్రమేయమూ లేదు. ఆమె ఎక్కడో పుట్టింది. నీవు ఎక్కడో పుట్టావు. అయినా పెళ్ళితో మీ ఇద్దరకూ ముడిపెట్టటం జరిగింది. పోనీ ఇప్పుడు ఇద్దరూ కలిసి ప్రయాణిస్తారు గదా.. చివరిదాకా ఇలా కలిసే ప్రయాణిస్తారా..? అదేం లేదు. ఈ ప్రయాణంలో ఎవరో ఒకరు ముందుగా దిగిపోతారు. ఆ రెండవ వారు ఒంటరి ప్రయాణం సాగించాలి. అంటే జన్మించటం ఒక్కసారి జరగలేదు. వెళ్ళిపోవటం కూడా ఒక్కసారిగా జరగటం లేదు. ఈ మధ్యలో మాత్రం కొంతకాలం విడిగాను, కొంతకాలం కలసి మెలసి జీవిస్తారు అంతే.*

*ఇదంతా రైలు ప్రయాణం లాంటిది. ఒక ప్రయాణీకుడు మద్రాసులో రైలెక్కాడు. కొంతదూరం ప్రయాణించి నెల్లూరు రాగానే మరొక ప్రయాణీకుడు ఆ కంపార్ట్ మెంట్ లోకి ఎక్కాడు. ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు.* *లోకాభిరామాయణంతో ప్రారంభమై రాజకీయాలు, సినిమాలు, వేదాంతం అన్నీ మాట్లాడుకున్నారు. ఎంతో ఆత్మీయులయ్యారు. మొదటి ప్రయాణీకుడు చీరాల రాగానే దిగిపోయాడు. రెండవ ప్రయాణీకుడు మొదటివాణ్ణి విడిచి ఒంటరిగా, దీనంగా ప్రయాణించి విజయవాడలో దిగిపోయాడు. ఇంతే వారి మధ్య సంబంధం.*

*భార్యాభర్తల సంబంధం కూడా ఇలాంటిదే. అందుకే తత్త్వ విచారణ చేసి ఈ బంధం ఎట్టిదో సరియైన అవగాహన చేసుకోవాలి. అప్పుడే నీవు ఎలా ప్రవర్తించాలో సరిగ్గా తెలుస్తుంది.*

*2) కస్తే పుత్రః...*

*అలాగే నీ కుమారుడెవరు..? అని కూడా విచారించు. పుట్టిన దగ్గర నుండి అతడు నీకెంతో ప్రేమాస్పదుడైన కుమారుడు. మరి.. అంతకుముందు..? అతడు నీ భార్య గర్భంలో పిండం. అంతకు ముందో..! అతడు నీలో బీజరూపం..! ఆ బీజం ఎలా వచ్చింది..? నీవు తిన్న ఆహారం ద్వారా నీలో తయారైంది..! మరి ఆ ఆహారం ఎక్కడి నుండి వచ్చింది..? భూమిలో నుండి వచ్చింది. అంటే మట్టి అనేక మార్పులు చెంది, ఆహారంగా మారి, ఆ ఆహారం నీలో బీజంగా మారి, ఆ బీజం నీ భార్య గర్భంలో ప్రవేశించి పిండంగా మారి, అది వృద్ధి చెంది శిశువుగా వ్యక్తమైంది.*

*అంటే మట్టి యొక్క చివరి రూపమే నీ కుమారుడు అన్నమాట. మరి నీవు ఎవరు..? నీవూ అంతే.. కాకపోతే ఆ బిడ్డకన్నా కాలంలో నీవు ముందున్నావు. నీవు కూడా మట్టి యొక్క ఆఖరి రూపమే. ఈ లెక్కన చూస్తే కదులుతున్న ఒక పెద్ద మట్టి ముద్ద మరొక చిన్న మట్టి ముద్దను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది, ప్రేమను పెంచుకుంటుంది. విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు విల విలలాడి పోతుంటుంది. దూరంగా ఉండి ఈ రెండు మట్టి ముద్దల నాటకాన్ని మనం తమాషాగా చూస్తున్నాం అనుకోండి. నవ్వకుండా ఉండలేం. కాని అదే నాటకంలో మనం పాత్రధారులమై ఎంతో సీరియస్ గా ఆ మట్టి ముద్దల పాత్రలను పోషిస్తున్నాం. ఇదే భ్రమ, ఇదే మాయ, ఇదే అజ్ఞానం.*

*ఉన్నది ఉన్నట్లుగ చూడలేక… 'నాది - నాది' అని భ్రమలో పడి కొట్టుకుపోతుంటాం. ఎంత చిత్రం.. అందుకే ఈ సంసారం అతి విచిత్రం, తమాషా అయినట్టిది. ఇంతకీ ఈ సంసార బంధంలో చిక్కుకు పోయిన నీవు ఎవరు..? ఎవరి వాడవు..? ఎక్కడి నుండి వచ్చావు..? ఈ విచారణ ముఖ్యమైనది. వేదాంతంలో నేనెవరు..? అని విచారణ చేయటమే మానవ జీవిత సార్థక్యానికి ఏకైక ఉపాయం.*

*సమస్త దుఃఖాలకు అజ్ఞానానికి అంతమే ఈ "నేనెవరు..?" అనే విచారణయేనని భగవాన్ రమణ మహర్షుల వారి ఉపదేశం.*

*నేనెవరు..? నేను ఈ శరీరమా..? కాదు... ఇదొక గృహం లాంటిది. జడమైనది. ఇందులో కూర్చుని నేను నా పనులను నిర్వర్తించు కుంటున్నాను. మరి నేను మనోబుద్ధులా..? కాదు... అవి నేను పనిచేయటానికి ఉపయోగించుకొనే పనిముట్లు మాత్రమే. అవీ జడమే. వాటిని నేను ఉపయోగించు కుంటున్నాను.*

*మరైతే నేనెవరు..? దేహంలో కూర్చొని, మనోబుద్ధులను ఉపయోగించుకొని పనిచేసే జీవుడను. అయితే జీవుడనైన నేను ఎవరికి చెందిన వాడను..? ఎక్కణ్ణించి వచ్చాను..? నేను నిజంగా అంతటా వ్యాపించియున్న పరమాత్మకు చెందినవాడను. నేను వచ్చింది అక్కణ్ణించే. *

*మరి ఎక్కడకు వెళ్ళాలి..? ఆ పరమాత్మ వద్దకే...! పరమాత్మ నుండి వచ్చిన జీవుడు కొంతకాలం ఈ జీవన నాటకరంగంలో సుఖదుఃఖాలు అనుభవించి చివరకు ఆ పరమాత్మలో చేరిపోవాలి. అప్పుడే పరమశాంతి, శాశ్వతానందం...!

08/11/2022

🌈>

Address

Chintalmet, Telangana
Hyderabad
500030

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

9959463336

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Anantha Padmanabha Jyothishalayam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sri Anantha Padmanabha Jyothishalayam:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram