Save Heart

Save Heart Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Save Heart, Health/Medical/ Pharmaceuticals, kukatpally, Hyderabad.

ఉపయోగపడే సమాచారాన్ని అందరికి షేర్ చేయండి
09/08/2016

ఉపయోగపడే సమాచారాన్ని అందరికి షేర్ చేయండి

89,764433 Views 67554 shares
Learn how to make a vacuum cleaner using bottle, washing machine pipe and single dc motor, its very simple homemade vacuum cleaner show how the vacuum cleaner works.

Please Followvyshnavi Heart ClinicDr:siva kumar reddykukkatpally ,hyderabad9848904566
19/04/2016

Please Follow

vyshnavi Heart Clinic
Dr:siva kumar reddy
kukkatpally ,hyderabad
9848904566

Go Nuts For Your Heart
19/04/2016

Go Nuts For Your Heart

శరీరంలో కొవ్వు శాతం అధికమైతే అది అనారోగ్యానికి దారి తీస్తుంది. సమాజంలో మంచీ చెడూ ఉన్నట్లే మన శరీరంలో కూడా మంచి కొలెస్ట్ర...
19/04/2016

శరీరంలో కొవ్వు శాతం అధికమైతే అది అనారోగ్యానికి దారి తీస్తుంది. సమాజంలో మంచీ చెడూ ఉన్నట్లే మన శరీరంలో కూడా మంచి కొలెస్ట్రాల్‌, చెడు కొలెస్ట్రాల్‌ ఉంటాయి. వీటివల్ల గుండె జబ్బులేగాక, మూత్రపిండాల వ్యాధి, పక్షవాతం, వచ్చే అవకాశాలున్నాయి. ఈ కొలెస్ట్రాల్‌లో అసమతుల్యత వల్ల వచ్చే సమస్యను డిస్‌లిపిడిమియా అంటారు. దీని గురించి తెలుసుకుందాం.

dyslipidemiaధమనుల్లో కొవ్వు (కొలెస్ట్రాల్‌) పెరిగిపోతే గుండెకు హానికరం అని తెలుసు. కానీ కొవ్వు శరీరంలో ఎక్కడైనా పెరగడంవల్ల మూత్రపిండాలు దెబ్బ తింటాయని, గుండెపోటు, పక్షవాతం వస్తాయని, కాలి దిగువ భాగంలో గ్యాంగ్రీన్‌ ఏర్పడుతుందని మనలో చాలా మందికి తెలియదు. ఇవన్నీ గుండె రక్త నాళాల జబ్బుకు దారి తీస్తాయని వైద్యులు చెబుతు న్నారు. గుండె రక్తనాళాల జబ్బులకు చాలా కారణా లున్నాయి. వీటిలో ముఖ్యమైనవి మధు మేహం, అధిక రక్తపోటు, ధూమపానం, కొవ్వు అసాధారణ స్థాయిలో ఉండటం (డిస్‌లిపిడిమియ) వంటివి.

శరీరంలో ఉండే రకరకాల కొవ్వులను లిపిడ్స్‌ అంటారు. కానీ ప్రధానమైన కొవ్వు రూపాల్లో ఒకటి కొలెస్ట్రాల్‌, రెండోది ట్రై గ్లిజరాయిడ్స్‌. ఇవీ రెండు లైపోప్రోటీన్‌ రూపంలో రక్తంలో ప్రవహిస్తుంటాయి. లైపో ప్రోటీన్లు మూడు రకాలులో డెన్సిటీ లైపో ప్రోటీన్‌ (ఎల్‌డిఎల్‌) మొత్తం కొలెస్ట్రాల్‌లో ఇది 10 నుంచి 15% ఉంటుంది. వీటిలో అసమతుల్యత ఏర్పడినప్పుడు కలిగే పరిస్థితిని డిస్‌లిపిడిమియ అంటారు.

డిస్‌లిపిడిమియ జన్యుపరమైన కారణాలవల్ల రావచ్చు. జీవనశైలి కారణాలు… మధుమేహం, ధూమపానం, కదలికలేని జీవన విధానం (సెడెంటరీ లైఫ్‌ స్టయిల్‌), స్థూలకాయంవల్ల డిస్‌లిపిడిమియ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువున్నాయి. అంతేగాక కొన్ని ప్రత్యేక మందులు (స్టెరాయిడ్లు, హార్మోన్లు), వ్యాధులు (థైరాయిడ్‌ సమస్యలు) కూడా డిస్‌లిపిడిమియాకు కారణం కావచ్చు .

ఎల్‌డిఎల్‌: ఎల్‌డిఎల్‌ను చెడ్డ కొలెస్ట్రాల్‌ అంటారు. శరీరంలో కొవ్వు పెరగడంలో ఎల్‌డిఎల్‌ది ప్రధాన బాధ్యత. ప్రతీ ఒక మిల్లీ గ్రాము/డిఎల్‌ ఎల్‌డిఎల్‌ పెరిగితే పెరిగితే గుండెపోటు పెరిగే ప్రమాదం ఒక శాతం పెరుగుతుంది. అయితే ఎల్‌డిఎల్‌కు ‘సాధారణ స్థాయి’ అంటూ ఏమీ లేదు. ఎల్‌డిఎల్‌ స్థాయి 100 మిల్లీగ్రాము/డిఎల్‌కు పెరిగి నప్పుడు గుండెపోటు ప్రమాదం అధికం అవుతుంది. ఇప్పటికే గుండె జబ్బు ఉన్నవారిలో ఎల్‌డిఎల్‌ స్థాయి 70 మిల్లీ గ్రాము /డిఎల్‌ కంటే తక్కువ ఉండాలని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి.

యుక్త వయసు నుంచే ఎల్‌డిఎల్‌ను తగ్గించుకోవడాన్ని ప్రారంభిం చాలి. ఎల్‌డిఎల్‌ స్థాయిని 10 మిల్లీ గ్రాము/డిఎల్‌కు తగ్గించుకుంటే, 40 ఏళ్ళు వచ్చేసరికి, జీవితకాలంలో వచ్చే గుండెపోటు ప్రమాదం 50 శాతం తగ్గుతుంది. ఇదే స్థాయిని కొనసాగిస్తే, 70 ఏళ్ల వయసులో గుండెపోటు వచ్చే ప్రమాదం 20 శాతం తగ్గుతుంది. ఎల్‌డిఎల్‌ స్థాయి 40 మిల్లీ గ్రాము/డిఎల్‌ ఉంటే సురక్షితమైన స్థితిలో ఉన్నామని అర్థం. కుటుంబంలో ఇంతకు ముందు తాతయ్య, నానమ్మలు, తల్లితండ్రు లకు గుండెజబ్బు ఉన్న చరిత్ర ఉండే వారు తమ ఎల్‌డిఎల్‌ స్థాయిని 40 మిల్లీ గ్రాము/డిఎల్‌ ఉంచు కోవడం ఎంతో సురక్షితం, ఆరోగ్యకరం కూడా.

హెచ్‌డిఎల్‌: దీన్ని మంచి కొలెస్ట్రాల్‌ అని అంటారు. హెచ్‌డిఎల్‌ రక్త నాళాల్లోని కొలెస్ట్రాల్‌ను తొలగించి, కాలేయానికి పంపిస్తుంది. ఇక్కడ కొలెస్ట్రాల్‌ విచ్ఛిన్నం అవుతుంది. అథిరొస్ల్కెరొసిస్‌ అనే సమస్య ఉత్పన్నం గాకుండా హెచ్‌డిఎల్‌ రక్షణగా ఉంటుంది. హెచ్‌డిఎల్‌ స్థాయి తక్కువ ఉందంటే, గుండె రక్త నాళాల వ్యాధి ప్రమాదం పెరుగుతున్నట్లు భావించాలి. గుండెపోటుకు బలమైన కారణం ఎల్‌డిఎల్‌ పెరగడం కన్నా హెచ్‌డిఎల్‌ తగ్గడమే. హెచ్‌డిఎల్‌ పురుషుల్లో 40 ఎంజి/డిఎల్‌, మహిళల్లో 50 ఎంజి/డిఎల్‌ ఉండేలా చూసుకోవాలి.

ట్రైగ్లిజరైడ్స్‌: ఇవి పెరుగుతున్నాయంటే, గుండె రక్తనాళాల వ్యాధి అధికమవుతున్న సంకే తాలు వెలువడతాయి. ట్రైగ్లిజరైడ్‌ స్తాయి పెరిగితే, గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతుందని కొత్త ఆధారాలు వెల్లడించాయి. ట్రైగ్లిజరైడ్‌ స్థాయి 150 ఎంజి/డిఎల్‌ కంటే తక్కువ ఉండాలి.

డిస్‌లిపిడిమియాను సులభంగా నిర్వహిం చొచ్చు. స్తబ్దుగా ఉండకుండా ఏదైనా క్రియాశీల చర్యలు చేపట్టడం అవసరం. ఇష్టమైన వ్యాయామం చేయాలి. ఉదయం పూట కనీసం 30 నుంచి 45 నిమిషాలు నడవాలి. నడకేగాక, జాగింగ్‌, స్విమ్మింగ్‌, సైక్లింగ్‌ చేయవచ్చు.

మనం తీసుకునే ఆహారం సమతుల్యంగా ఉండాలి. ఎత్తు, వయసుకు తగ్గ బరువు ఉండాలి. లావుగా ఉన్నవారు బరువు తగ్గాలి.

ధూమపానం అలవాటు ఉంటే మానుకోవాలి. మధుమేహం ఉంటే, నియంత్రణలో ఉంచుకోవాలి.
For More Details
vyshnavi Heart Clinic
Dr:siva kumar reddy
kukkatpally ,hyderabad
9848904566

గుండె జబ్బులు దగ్గరకు రాకుండా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లను ఒంట బట్టించుకోవాలి. పిల్లలకు చిన్నతనం నుంచే సరైన అలవాట్లు ...
19/04/2016

గుండె జబ్బులు దగ్గరకు రాకుండా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లను ఒంట బట్టించుకోవాలి. పిల్లలకు చిన్నతనం నుంచే సరైన అలవాట్లు నేర్పించాలి. మహిళలు కూడా తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. స్త్రీ చేతుల్లోనే కుటుంబ ఆరోగ్యం మొత్తం ఆధారపడి ఉంటుంది. అటువంటి స్త్రీ తన ఆరోగ్యంపై జాగ్రత్త వహించకపోతే దాని ప్రభావం మొత్తం కుటుంబంపై పడుతుంది. ఇందుకోసం కొన్ని రకాలైన ఆహార నియమాలు విధిగా పాటించాలి.
హెల్తీ డైట్: కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను వీలైంత తక్కువగా తీసుకోవాలి. విటమిన్లు, పోషకాలు ఎక్కువగా లభించే పండ్లు, కూరగాయలు, నట్స్ గుండె జబ్బులు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. ఉప్పు గుండెకు చేటు చేస్తుంది. కాబట్టి ఉప్పు బాగా తగ్గించాలి.
నడకతో ఫిట్: వ్యాయామం లేకుండా ఒకే చోట కూర్చుని గంటల కొద్దీ పని చే సేవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే రోజు అరగంటపాటు తప్పకుండా వ్యాయామం చేయాలి. ముఖ్యంగా వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, జాగింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి.
కోపాన్ని తగ్గించుకోండి: ఒత్తిడి, కోపం హార్ట్ఎటాక్, స్ట్రోక్‌కు కారణమవుతాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రశాంతమైన జీవనం గడిపితే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇందుకు ఉపయోగపడతాయి. జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం, మందులు వాడటం ద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.
బీపీకి చెక్: గుండెపోటుకు కారణాల్లో ఇది ముఖ్యమైనది. అధిక రక్తపోటును నియంత్రించుకోవాలంటే డైట్, ఎక్సర్‌సైజ్, బరువు నియంత్రణలో ఉంచుకోవడం, మందులు వాడటం చేయాలి.
స్మోకింగ్‌కు స్వస్తి: పొగతాగని వారితో పోల్చితే పొగతాగే వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం రెట్టింపు ఉంటుంది. పాసివ్ స్మోకింగ్ కూడా మంచిది కాదు. స్మోకింగ్ అలవాటు ఉంటే వెంటనే మానేయండి. అలవాటు లేకపోతే అట్రాక్ట్ కాకండి.
కొలెస్ట్రాల్: టోటల్ కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే హార్ట్ డిసీజ్ రిస్క్ పెరుగుతుంది. కాబట్టి కొలెస్ట్రాల్ లెవెల్స్ పరిమితిని దాటకుండా చూసుకోండి. ఒకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే డాక్టర్ సూచన మేరకు మందులు వాడండి.
హెల్తీ వెయిట్: అధిక బరువు మూలంగా గుండెపై ఒత్తిడి పడుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం, ట్రైగ్లిజరైడ్స్, డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి సమస్యలన్నీ అధిక బరువు మూలంగానే వస్తాయి. కాబట్టి లైఫ్‌స్టయిల్‌లో మార్పులు చేసుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా బరువును తగ్గించుకోవాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి.
సూచనలకు సంప్రదించండి
vyshnavi Heart Clinic
Dr:siva kumar reddy
kukkatpally ,hyderabad
9848904566

మనదేశంలో ఇప్పటికీ గుండె జబ్బులతో మరణించే వారి సంఖ్య ఇప్పటుకీ ఎక్కువగానే ఉంది. 2020వ సంవత్సరం నాటికి దేశంలోని యాభై శాతం మ...
19/04/2016

మనదేశంలో ఇప్పటికీ గుండె జబ్బులతో మరణించే వారి సంఖ్య ఇప్పటుకీ ఎక్కువగానే ఉంది. 2020వ సంవత్సరం నాటికి దేశంలోని యాభై శాతం మంది గుండె జబ్బులకు ప్రధాన కారణమైన మధుమేహం బారిన పడతారని వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుండె జబ్బులు వచ్చాక చికిత్స చేయించుకోవడం కన్నా, రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మేలంటున్నారు వైద్య నిపుణులు.

మధుమేహం, స్థూలకాయం, అధిక రక్తపోటు, ధూమపానం, వంశపారంరపర్యం, కొరవడిన వ్యాయామం, ఒత్తిడితో కూడిన జీవనం... ఇలా పలుకారణాలతో హృద్రోగాలు వస్తున్నాయి. కారణాలేమైనా గుండె జబ్బులతో బాధపడుతున్న రోగుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా, దీన్ని అమలులో ఉంచాలంటే ముందు జాగ్రత్త మేలు.

గుండె సంబంధ వ్యాధులు రావడానికి ప్రధాన కారణం శరీరంలో అథిరోస్ల్కిరోసిన్ సమస్య పెరగడం, అథిరోస్ల్కిరోసిన్‌లో శరీరంలోని రక్తనాళాల లోపలి పొర మందంగా పెరుగుతుంది. దీని ద్వారానే భవిష్యతులో రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడి గుండె జబ్బులకు దారితీస్తుంది. ఇరవై, ముప్పై సంవత్సరాల వయసులోనే అథిరో స్ల్కిరోసిన్‌ వ్యాధి ఆరంభమవుతుంది. గుండె జబ్బులు రాక ముందు దానికి కారణమైన అథిరోస్ల్కిరోసిన్‌ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే భవిష్యతులో హృద్రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు.

* కెరోటిడ్ మీడియల్ ఇంటీరియల్ థిక్‌నెస్ పరీక్షః ఈ విధానంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా గొంతు వద్ద ఉన్న కెరోటిడ్ రక్తనాళం లోపలిపొర మందం పెరిగిందా? అన్నే అంశాని నిర్థారించ వచ్చు. రక్తనాళం లోపలి పొరథిక్‌నెస్ పెరిగితే, ఆ రోగికి ఆథిరో స్ల్కిరోసిన్ వ్యాధి ఉన్నట్లు. ఈ వ్యాధి ఉన్న రోగికి భవిష్యతులో గుండెజబ్బు వచ్చే అవకాశముంది. కాబట్టి రోగి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా హృద్రోగం రాకుండా చూసుకోవచ్చు.

* యాంకిల్ బ్రెకెల్ ఇండెక్స్ పరీక్షః అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా చేతికి ఉన్న రక్తనాళం లోపలి పొరలో ఉన్న థిక్‌నెస్ కనుక్కోవచ్చు. రక్తనాళం లోపలి పొర మందంగా కనిపిస్తే సదరు రోగికి గుండెజబ్బులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

* కాల్షియం స్కోరింగ్: ఇది గుండెలోని రక్తనాళాల్లో కాల్షియం స్కోరు ఎంత ఉందనే పరీక్ష. రక్తనాళంలో కాల్షియం స్కోరు పెరిగితే భవిష్యత్తులో హృద్రోగం వచ్చే అవకాశమున్నట్లు ముందుగానే గుర్తించి జాగ్తత్తలు తీసుకోవడం మంచిది.

* ముందు జాగ్రత్తలు ముఖ్యం: హృద్రోగాలకు కారణాలను నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్‌గా విభజించవచ్చు. హృద్రోగాలు ఉన్న కుటుంబంలో జన్మించడం, నలభై ఏళ్ల వయసు దాటాకా, మహిళల కంటే పురుషుల్లో గుండె జబ్బులు వస్తున్నాయి. ఈ కారణాలు నివారించలేనివి. గుండె జబ్బులు రాకుండా నివారించదగిన వాటిని మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు.

ధూమపానం, కొవ్వు అధికంగా పేరుకుపోవడానికి కారణమైన మటన్, బీఫ్‌లను తినకుండా ఉండటం వల్ల నివారించవచ్చు. కూర్చుని పనిచేసే వారు మధ్యలో రెండు గంటలకు ఓ సారి లేచి వాకింగ్ చేయడం, ప్రతిరోజు వ్యాయామం చేయడం తప్పనిసరి. మధుమేహం, హై బీపీ, హైకొలెస్ట్రాల్‌లను అదుపులో ఉంచుకోవాలి. విటమిన్ డి లోపం ఉన్న వారిలో ఎక్కువ గుండె వ్యాధులు వస్తున్నాయని తాజా పరిశోధనలో తేలింది.

ప్రత్యేకంగా మధ్య తరగతి మహిళల్లో, పిరియడ్స్ ఆగిపోయి, ఇంటిపట్టున నీడన వారిలో విటమిన్ డి లోపం ప్రధానంగా కనిపిస్తుంది. అందువల్ల మహిళలు ప్రతిరోజు ఉదయాన్నే ఏడు-ఎనిమిది గంటల మధ్య వాకింగ్ చేయడం, సూర్యరశ్మిని శరీరానికి తగిలేలా చూసుకోవడం, విటమిన్ డి టాబ్లెట్లు వాడటం ద్వారా ఈ లోపాన్ని నివారించవచ్చు.

సూచనలకు సంప్రదించండి
vyshnavi Heart Clinic
Dr:siva kumar reddy
kukkatpally ,hyderabad
9848904566

19/04/2016

గుండె జబ్బులు దగ్గరకు రాకుండా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లను ఒంట బట్టించుకోవాలి. పిల్లలకు చిన్నతనం నుంచే సరైన అలవాట్లు నేర్పించాలి. మహిళలు కూడా తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. స్త్రీ చేతుల్లోనే కుటుంబ ఆరోగ్యం మొత్తం ఆధారపడి ఉంటుంది. అటువంటి స్త్రీ తన ఆరోగ్యంపై జాగ్రత్త వహించకపోతే దాని ప్రభావం మొత్తం కుటుంబంపై పడుతుంది. ఇందుకోసం కొన్ని రకాలైన ఆహార నియమాలు విధిగా పాటించాలి.

హెల్తీ డైట్: కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను వీలైంత తక్కువగా తీసుకోవాలి. విటమిన్లు, పోషకాలు ఎక్కువగా లభించే పండ్లు, కూరగాయలు, నట్స్ గుండె జబ్బులు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. ఉప్పు గుండెకు చేటు చేస్తుంది. కాబట్టి ఉప్పు బాగా తగ్గించాలి.

నడకతో ఫిట్: వ్యాయామం లేకుండా ఒకే చోట కూర్చుని గంటల కొద్దీ పని చే సేవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే రోజు అరగంటపాటు తప్పకుండా వ్యాయామం చేయాలి. ముఖ్యంగా వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, జాగింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి.

కోపాన్ని తగ్గించుకోండి: ఒత్తిడి, కోపం హార్ట్ఎటాక్, స్ట్రోక్‌కు కారణమవుతాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రశాంతమైన జీవనం గడిపితే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇందుకు ఉపయోగపడతాయి. జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం, మందులు వాడటం ద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.

బీపీకి చెక్: గుండెపోటుకు కారణాల్లో ఇది ముఖ్యమైనది. అధిక రక్తపోటును నియంత్రించుకోవాలంటే డైట్, ఎక్సర్‌సైజ్, బరువు నియంత్రణలో ఉంచుకోవడం, మందులు వాడటం చేయాలి.

స్మోకింగ్‌కు స్వస్తి: పొగతాగని వారితో పోల్చితే పొగతాగే వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం రెట్టింపు ఉంటుంది. పాసివ్ స్మోకింగ్ కూడా మంచిది కాదు. స్మోకింగ్ అలవాటు ఉంటే వెంటనే మానేయండి. అలవాటు లేకపోతే అట్రాక్ట్ కాకండి.

కొలెస్ట్రాల్: టోటల్ కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే హార్ట్ డిసీజ్ రిస్క్ పెరుగుతుంది. కాబట్టి కొలెస్ట్రాల్ లెవెల్స్ పరిమితిని దాటకుండా చూసుకోండి. ఒకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే డాక్టర్ సూచన మేరకు మందులు వాడండి.

హెల్తీ వెయిట్: అధిక బరువు మూలంగా గుండెపై ఒత్తిడి పడుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం, ట్రైగ్లిజరైడ్స్, డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి సమస్యలన్నీ అధిక బరువు మూలంగానే వస్తాయి. కాబట్టి లైఫ్‌స్టయిల్‌లో మార్పులు చేసుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా బరువును తగ్గించుకోవాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి.
సూచనలకు సంప్రదించండి
vyshnavi Heart Clinic
Dr:siva kumar reddy
kukkatpally ,hyderabad
9848904566

Address

Kukatpally
Hyderabad
500072

Telephone

9848904566

Website

Alerts

Be the first to know and let us send you an email when Save Heart posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram