Prakruthi Nidhi

Prakruthi Nidhi Living close to nature & stay away from chemicals .

18/02/2018

*ఇలా చేస్తే రెండు రోజుల్లో లివర్ శుభ్రమవుతుంది..*

మన శరీరంలో ప్రతి అవయవం ముఖ్యమైనదే. ఆ అవయవాలు సరిగ్గా పనిచేయాలంటే మనం తినే తిండిపైనే అది ఆధారపడి ఉంటుంది. శరీరంలోని అవయవాల్లో లివర్ కూడా చాలా ముఖ్యమైనది. మద్యం అలవాటు ఉన్న వారికి లివర్ ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అలాగే కొంతమందికి పుట్టుకతోనే లివర్ వ్యాధితో బాధపడుతుంటారు. అలాంటి వారు ఆసుపత్రులకు వెళ్ళి వేల రూపాయలు ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు.

ఎండు ద్రాక్ష లివర్ వ్యాధికి బాగా పనిచేస్తుంది. ప్రతిరోజు కొన్ని ఎండు ద్రాక్షలు తీసుకొని నీటిలో వేసి బాగా కరిగించాలి. ఆ నీటిని ప్రతిరోజు తీసుకోవాలి. ఇలా రెండురోజుల పాటు నాలుగు పూటలు ఎండు ద్రాక్ష తీసుకుంటే చాలా మంచిది. లివర్ శుభ్రం అవ్వడమే కాకుండా వ్యాధులు కూడా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

13/08/2017

*నల్ల తులసే మేలు*

ఆధ్యాత్మికతకు చిరునామాగా చెప్పే తులసి ఇంట్లో ఉంటే ఎన్నో రకాల జబ్బులను నివారించవచ్చు.
ఆరోగ్యంతో పాటు అందానికి కూడా తులసి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే తులసిని సర్వరోగ నివారిణి అంటారు. అయితే లక్ష్మి తులసిలో కన్నా కృష్ణ తులసిలో అధికంగా ఔషధగుణాలున్నాయని ఇటీవల పరిశోధనల్లో స్పష్టమైంది. లక్ష్మి, కృష్ణ తులసి ఏదైనా అందులో ఔషధగుణాలు ఎక్కువే. ప్రతి ఇంట్లో తులసి ఉండాలన్న పెద్దల సూచన వెనుక అర్థం ఇదే.
- అర స్పూన్‌ తులసి ఆకుల పొడిని స్పూన్‌ తేనెతో కలిపి రోజూ ఉదయం తీసుకుంటే సీజనల్‌గా వచ్చే జబ్బులను నివారించవచ్చు.
- ఉదయం టిఫిన్‌ చేయడానికి అరగంట ముందు ఒక స్పూన్‌ తులసి రసాన్ని తాగితే అసిడిటి నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసిరసంలో జీర్ణశక్తిని మెరుగు పరిచే గుణముంది. అసిడిటి సమస్య ఎక్కువగా ఉన్నవారు రోజుకు మూడు సార్లు తులసి రసం తీసుకోవచ్చు.
- మలేరియా జ్వరంతో బాధపడుతున్న వారు కొన్ని తులసి దళాలను, మిరియాల పొడితో తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
- తులసి రసం, అల్లం రసం సమపాళ్లలో కలిపి తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
- నల్ల తులసి దళాలతో చేసిన కాషాయం చెవి నొప్పికి మంచి మందుగా పనిచేస్తుంది.
- నాలుగైదు నల్ల తులసిదళాలు, ఐదు బాదం పప్పులు, నాలుగు లవంగాలను కలిపి తింటే అజీర్తి సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది.
- అరస్పూన్‌ నల్ల తులసి ఆకుల రసంలో కొద్దిగా తేనెను కలిపి కళ్ల చుట్టూ రాస్తే అలసట తగ్గడమే కాకుండా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.
- రెండు స్పూన్ల నల్ల తులసి రసానికి చిటికెడు నల్ల ఉప్పును కలిపి పిల్లలకు నాలుగు రోజులపాటు క్రమంగా ఇస్తే నులిపురుగుల సమస్య తీరుతుంది.
- ఆస్తమా రోగులు ప్రతి రోజూ ఒక స్పూన్‌ నల్లతులసి రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే మంచిది.

13/08/2017

• పసుపు పాలతో ఆరోగ్యానికి మేలు!

రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోల్డెన్‌ మిల్క్‌ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని పరిశోధనల్లో తేలింది.

జలుబు, జ్వరం, చర్మవ్యాధులకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుందని
ఆయుర్వేదంలోనూ వివరించారు.

తయారీ విధానం : ఒకగ్లాసు పాలు (గేదె, సోయా, కొబ్బరి, బాదం పాలలో ఏదో ఒకటి) తీసుకోవాలి. అందులో ఒక చెంచా పసుపు, ఒక చెంచా తేనె, కొద్దిగా నెయ్యి, చిటికెడు మిరియాల పొడి వేసి బాగా కలుపుకుని తాగాలి.

కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వాపు, నొప్పి తగ్గుతాయి.
అజీర్తి, ఛాతీలో మంట వంటివి తగ్గుతాయి. మలబద్ధకం సమస్య తొలగిపోతుంది.

రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
ఇన్సులిన్‌ స్థాయిలు తగినంత ఉండేలా చేస్తుంది.

అల్జీమర్స్‌ వంటి వ్యాధులు దరిచేరకుండా చూస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

ఈ పాలలో యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ పైరెటిక్‌ గుణాలుంటాయి. ఇవి రోగనిరోధకశక్తిని బలోపేతం చేస్తాయి.
జీవక్రియల పనితీరు పెరుగుతుంది. ఫలితంగా అదనపు బరువు తగ్గుతారు.
కేన్సర్‌ వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి. మి నవీన్ నడిమింటి

13/08/2017

“గోమూత్రం వలన ప్రయోజనాలు సమగ్రంగా చెప్పండి “ అని కొందరు కోరడం వలన....
1. గోమూత్రం అమృతం , మంచి ఆహారం , గుండెకు మంచిది , మానసిక శారీరక ఆరోగ్యదాయని , ఆయుర్దాయని , . పైత్య నివారిణి , కఫాన్నీ , వాయువును తగ్గిస్తుంది . గుండె జబ్బులు తగ్గిస్తుంది . విషాన్ని హరిస్తుంది . ఈ రోజు ఎయిడ్స్ ను కూడా తగ్గిస్తుంది .Today many AIDS patients are taking cow urine therapy. మైగ్రేన్ తో పదిహేను సంవత్సరాలు బాధ పడుతున్నవ్యక్తి గోమూత్రం తో ఆరు నెలల్లో పూర్తిగా తగ్గించుకున్నారు . మానసిక వత్తిడి తగ్గించుకోడానికి , జ్ఞాపక శక్తి పెరగడానికీ గోమూత్రం మంచి ఫలితాన్ని ఇస్తుంది
గత కొన్ని సంవత్సరాలు పాటు పరిశోధన చేసి లక్షా ఏభై వేల మంది కి ట్రీట్మెంట్ ఇచ్చిన Cow Urine Treatment and Research Center, Indore, వారి ట్రీట్మెంట్ లో 85 నుండి 90 శాతం మందికి మలబద్ధకం పూర్తిగా తొలగిపోయింది . మనకు తెలుసు మలబద్ధకం లేకపోతే చాలా వ్యాధులు పూర్తిగా నయం అవుతాయి ( చాలా వ్యాధులకు మూలకారణం మలబద్ధకం ) . ఒక నెలలోనే పూర్తి ఆరోగ్యం పొంది మలబద్ధకం నుండి విముక్తి చెందాను అన్నవారు ఉన్నారు .
2. గోమూత్రం అనేక మైన సూక్ష్మ జీవులను చంపగలదు(amazing germicidal power ) . అందువలన సూక్ష్మ జీవుల వలన కలిగే అన్ని వ్యాధులను గోమూత్రం పోగొడుతుంది
3. ఆయుర్వేదం ప్రకారం గోమూత్రం త్రిదోష హరం . అంటే వాతాన్నీ, కఫాన్నీ , పిత్తాన్నీ కూడా సమపాళ్ళల్లో ఉంచుతుంది . అందువలన అన్ని వ్యాధులనూ పోగోట్టగలదు. గోమూత్రం లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది . అందువలన రక్తం శుద్ది అయ్యి వ్యాధులను ఎదుర్కోగలిగే శక్తి పెరుగుతుంది .
4. మనశరీరం లో కొన్ని సూక్ష్మ పోషకాలు ఉంటాయి . ఇవి మూత్రం ద్వారా పోతూ ఉంటాయి . అందువలన మనలో వృద్ధాప్య లక్షణాలు పెరుగుతూ ఉంటాయి . ఇవే సూక్ష్మ పోషకాలు గోమూత్రం ద్వారా మనకు అందడం వలన మనలో వృద్ధాప్య లక్షణాలు నివారింపబడతాయి . అందుకే గోమూత్రాన్ని అమృతం అంటారు . గోమూత్రం జీవనదాయని
5. గోమూత్రం లో రాగి , బంగారం వంటి ఖనిజ లవణాలు ఉన్నాయి . అవి మన శరీరం లోని ఖనిజలవణాల లోపాన్ని పూడుస్తాయి . వ్యాదిరహితంగా మన శరీరం తయారు అవుతుంది.
6. మానసిక ఒత్తిడి మన నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది . గోమూత్రాన్ని మేధ , హృద్య అంటారు అంటే అది మన మెదడుకూ , గుండెకూ బలాన్ని చేకూరుస్తుంది. అందువలన మానసిక ఒత్తిడి తగ్గడం గుండె పనితీరు మెరుగు పడడం జరిగి గుండె వ్యాధులూ , మానసిక ఒత్తిడీ తగ్గుతాయి
7. మనం అధికంగా వాడే మందులు మన శరీరం లో తిష్ట వేసుకుని శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి ఈ మిగిలిపోయిన మందుల వలన మనకు వ్యాధులు కలుగుతున్నాయి . దీనినే మనం సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నాము . గోమూత్రం ఈ అధిక మోతాదులను శరీరం నుండి బయటకు పోయేలా చేస్తుంది . దానివలన మీరు వ్యాదులనుండి విముక్తి పొందవచ్చు .
8. మన పరిసరాల్లో ఉన్న ప్రాణశక్తిని[ Electric currents (rays) ] గ్రహించడానికి మన శరీరం లో రాగి కూడా అవుసరం. . రాగి శరీరానికి గోమూత్రం ద్వారా అందించగలం . గోమూత్రం లో రాగి , బంగారం కూడా ఉన్నాయి
9. గోమూత్రం త్రాగడం ద్వారా సాధుత్వం పెరుగుతుంది . అందువలన మనం మానసికంగా స్థిర చిట్టులమై ఉంటాము . మానసిక దౌర్బల్యం వలన అనేక రోగాలను కొని తెచ్చుకుంటున్నాము . వాటినుండి విముక్తి పొందవచ్చు .. Cow urine provides mode of goodness. Thus helps us to perform correct activities by mind. Thus protects from diseases.
10. గోమూత్రం లో గంగా మాత ఉంది అని పెద్దలు అంటారు . గత జన్మల దోషాలను కూడా పావన గంగ పోగొట్టగలదు అంటారు అందువలన గోమూత్ర సేవనం వలన ప్రశాంత చిత్తం ఏర్పడుతుంది చిత్తం ప్రశాంతం అయితే శరీరం ఆరోగ్యవంతం అవుతుంది
11.గోమూత్రం విష హరి . అంటే విషాలను హరిస్తుంది . మన శరీరం లో ఉన్న టాక్సిన్స్ ను పోగొట్టడం వలన మనం ఆరోగ్యవంతులం అవుతాము
12..సర్వే రోగాహి మందాగ్నౌ .. అంటారు . అంటే రోగాలకు కారణం మందాగ్ని . అంటే సరిగా జీర్ణం కాకపోవడం . గోమూత్రం ఈ మందాగ్నిని నివారిస్తుంది . జీర్ణ శక్తిని పెంచుతుంది .
గోమూత్రం లో ఏ ఏ రసాయనాలు ఉన్నాయి . ఆ రసాయనాలు మనకు ఎటువంటి మేలును చేస్తాయి అనేది పరిశీలిస్తే గోమూత్రం ఎంత విలువైనదో అర్ధం అవుతుంది.
1. నత్రజని ( N2 ,NH2)
Nitrogen is diuretic. దీని వలన రక్తం లోని దోషాలు తొలగిమ్పబడతాయి . మూత్ర సంబంధ అవయవాలలోని దోషాలను సరి చేస్తుంది . కిడ్నీలను సరిగా పని చేసేలా చేస్తుంది .
2. సల్ఫర్ ( S )
పెద్దపెగులలో కదలికలను మెరుగుపరుస్తుంది . రక్తాన్ని శుద్ది చేస్తుంది
3. అమ్మోనియా ( NH3 )
కఫాన్నీ , వాతాన్నీ సరి చేస్తుంది . రక్తాన్ని తయారు చెయ్యడం లో సహకరిస్తుంది
4. రాగి (c)
అధిక కొవ్వులను కరిగిస్తుంది
5. ఇనుము ( Fe )
ఎర్ర రక్తకణాల అభివృద్ధికీ హిమోగ్లోబిన్ పెరగడానికీ సహకరించి శక్తిని పెంచుతుంది
6. యూరియా ( CO(NH2)2)
మూత్రం తయారవ్వడానికి విసర్జించడానికి ఉపయోగపడుతుంది . క్రిమి నాశని
7. యూరిక్ ఆసిడ్ ( C5H4N4O3)
గుండె పెరుగుదల (Enlargement) ను నివారిస్తుంది . మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది . టాక్సిన్స్ ను బయటకు పోయేలా చేస్తుంది
8. ఫాస్ఫేట్ ( P )
మూత్రాశయం లో రాళ్ళను తొలగించడం లో సహకరిస్తుంది
9. సోడియం (Na )
రక్త శుద్ది చేస్తుంది . ఎసిడిటీ తొలగిస్తుంది
10. పొటాషియం ( K )
వంశపారంపర్య కీళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తుంది . ఆకలిని పెంచుతుంది . కండరాలను పెంచుతుంది . బద్ధకం తోలగిస్తుంది
11. మాంగనీసు (Mn)
Germicidal గాంగ్రీన్ ను నివారిస్తుంది.
12. కార్బోలిక్ ఆసిడ్ ( HCOOH )
Germicidal, గాంగ్రీన్ వలన ఏర్పడిన నష్టాన్ని నివారిస్తుంది
13. కేల్షియం ( Ca)
క్రిమి నాశని , రక్త శుద్ది చేస్తుంది . ఎముకల పటిష్ట పరుస్తుంది
14. ఉప్పు ( NaCl)
క్రిమి నాశని . రక్తం లో ఎసిడిటీ ని కూడా తగ్గ్గిస్తుంది
15. విటమినులు A,B,C,D,E
ముఖ్యమైన విటమినులు ఇవి. విటమిను B శక్తిదాయని . నెర్వస్ నెస్ , దాహం పోగొట్టి ఎముకలను పటిష్టపరచి , పునరుత్పాదక శక్తిని పెంచుతుంది
16. ఇతర ఖనిజ లవణాలు
ఇమ్యూనిటీ పెంచుతాయి
17. లాక్తోజ్ ( C6H12O6 )
ఒత్తిడిని తగ్గించడం , తృప్తిని కలిగించడం , హృదయ దౌర్బల్యం పోగొట్టడం దాహాన్ని పోగొట్టడం చేస్తుంది
18. ఎంజైములు
జీర్ణ వ్యవస్థను సక్రమంగా చేసి ఇమ్యూనిటీ పెంచుతాయి
19. నీరు (H2O)
నీరు జీవన దాయని , రక్తం పలుచగా ఉండేట్టు చేయడం , శరీర ఉష్ణోగ్రత క్రమ పరచడం చేస్తుంది
20. హైప్యూరిక్ ఆసిడ్ ( CgNgNox )
మూత్రం ద్వారా టాక్సిన్స్ బయటకు పోయేట్టు చేస్తుంది
21. క్రియాటినిన్ ( C4HgN2O2 )
క్రిమి నాశని
22. ఆరం హైడ్రాక్సైడ్ ( AuOH)
క్రిమి నాశని , ఇమ్యూనిటీ పెంచుతుంది . అంటీ బయాటిక్ , అంటి టాక్సిక్
(Source : Goshala)
ఆయుర్వేద గ్రంధాలలో గోమూత్ర సేవనం వలన కలిగే లాభాలు ఇలా చెప్పారు
• Mukha roga (నోటికి సంబంధించిన వ్యాధులు పోగొడుతుంది )
• Netra roga (కంటికి సంబంధించిన వ్యాధులు )
• Swasa (ఆస్తమా )
• Vata roga (వాత రోగాలు )
• Paandu (ఎనీమియా – రక్త హీనత )
• Pleeha (స్ప్లీన్ వాపు )
• Shotha (ఎడేమా)
• Varchograha (మలబద్ధకం ) •
గోమూత్రం లోని లేఖన గుణం వలన స్థౌల్యాన్ని తగ్గిస్తుంది . అంటే బరువును తగ్గిస్తుంది .
మీ జీర్ణ శక్తిని పెంచుతుంది .
ఆర్థరైటిస్ ని తగ్గిస్తుంది
హై బ్లడ్ ప్రషర్ ని తగ్గిస్తుంది
రక్త హీనతను నివారిస్తుంది.
గోమూత్రం , చర్మ వ్యాదులలో మంచి ఫలితాలను ఇస్తుంది . బొ ల్లిని తగ్గించడానికి వాడే మందుగా గోమూత్రం పై పూతగా వాడుతారు .
దగ్గును తగ్గించడానికి ఉపయోగపడుతుంది
గోమూత్రం యొక్క ఉపయోగాలను దాని యొక్క ఈ క్రింది లక్షణాలను బట్టి ఏ ఏ వ్యాధులకు ఉపయోగ పడుతుందో మీరే నిర్ణయించండి .
1. Anti aging
2. Anti allergic
3. Anti anxiety
4. Anti arrhythemic
5. Anti arthiritic
6. Anti asthmatic
7. Anti bacterial
8. Antibiotic Whole
9. Anti cancer
10. Anti fungal
11. Anti hypertensive
12. Anti inflammatory
13. Anti microbial
14. Ati oxidant
15. Anti spasmodic
16. Anti sress
17. Bronchial Relaxant
18. Cardio Tonic
19. Depressant
20. Detoxicant
21. Diuretic
22. Hypocholestrolemic
23. Hypolipedimic
24. Immunity booster
25. Memory enhancer
26. Musle Relaxant
27. Rejuvenative
పూర్తిగా చదివిన వారికి అనేక కృతజ్ఞతలు.
గోధన్ అర్క్ బరువు తగ్గడానికి ఉపయోగ పడుతుంది అని చెప్పారు కదా... దానిమీద ఎలా వాడాలో చెప్పలేదు. దయచేసి కొంచెం వీలున్నపుడు వివరించ గలరు.” అని ఒక మిత్రుడు అడిగారు
గోధన్ అర్క్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది
ఉదయం లేవగానే మీరు దంత ధావనం చేసి ఖాళీ కడుపు తో ఉన్నపుడు కొద్దిగా నీరు వేడి చేసి అందులో మొదటి రోజు రెండు మూతలు ( పది ఎం ఎల్ ) గోధన్ అర్క్ వెయ్యండి . దానిని త్రాగండి . త్రాగేటపుడు మీకు విషం తాగుతున్నాను అనే ఫీలింగ్ తో తాగితే ముఖం చిరాకుగా పెడతారు . నేను అమృతం తాగుతున్నాను అని అనుకుంటూ మీ ముఖం లో విజయగర్వం , , లక్ష్యం సాదిస్తున్నాను అనే భావం కనిపించేలా తాగండి .
ఆ తర్వాత మీకు సోడా తాగినపుడు ముక్కు లో నుండి గ్యాస్ వస్తుంది కదా ! అలా అనిపించ వచ్చు అది మీ మానసిక పరిస్థితి వలన మొదట్లో గోధన్ అర్క్ త్రాగడం వలన వచ్చే చిన్న చిన్న మార్పుల వలన అలా అనిపిస్తుంది . ఇది ఒక్కటి లేదా రెండు రోజులు మాత్రమె ఉంటుంది .
రెండో రోజుల తర్వాత మోతాదు పెంచండి . మీరు మూడు నాలుగు రోజులకు అలవాటు పడిపోతారు . అపుడు మీకు ఎటువంటి ఇబ్బంది అనిపించదు . అపుడు మీరు ఉదయం ఇరవై , ముప్పై మిల్లీ లీటర్లు ( ఎం ఎల్ ) సాయంత్రం కూడా ఖాళీ కడుపుతో ఉన్నపుడు ఇంకో ఇరవై ఎం ఎల్ త్రాగండి . వేడి నీటిలో త్రాగడం వలన ఫలితం ఎక్కువ .
కుదరని సమయాల్లో చన్నీటితో త్రాగండి .
ఎప్పుడు త్రాగినా గోరువెచ్చని నీటిని త్రాగడం వలన తొందరగా బరువు తగ్గుతారు
విజయీభవ !

25/05/2017

గుండె పోటు.
దయచేసి మీరు మీ రెండు నిమిషాల సమయం వెచ్చించి దీన్ని చదవండి.
1అది రాత్రి7.25 గం.లనుకొందాం. ఆ రోజున ఎన్నడు లేనంతగా విపరీతంగా పనిలో శ్రమించి ఇంటికి మరలా లనుకొందాం(కాకపోతే ఒంటరిగా).
2మీరు నిజంగానే బాగా అలసి, విసిగి వేసారి ఉన్నారు.
3 ఉన్నట్టుండి మీకు ఛాతీ లో తీవ్రమైన నెప్పనిపిస్తూవుంది
ఆ నెప్పి మీ దవడ లోపలి నుండి మీ చేయి వరకూ గుంజేస్తూ వుంటుంది.
మీ ఇంటి నుండి ఏదేనీ దగ్గరగా వుండే ఆసుపత్రికి మధ్య దూరం 5 కి.మీ. అనుకొందాం.
4దురదృష్టవశాత్తు, అంతవరకూ మీరు చేరుకోగలరో లేదో మీకు తెలియదనుకొందాం.
5 మీరు CPR లో శిక్షణ పొందిన వారైయుండొచ్చును గానీ ఆ శిక్షణనిచ్చినతను అది మీకు మీరే ఎలా చేసుకోవాలో నేర్పలేదనుకొందాం.
6 మీరు ఎవరూ పక్కన లేని ఒంటరి సమయంలో వచ్చే గుండె పోటుని తట్టుకొని తేరుకుని బతికేదెలా?
చాలా మంది గుండె పోటు ఎదురైనప్పుడు సాయం చేయటానికి పక్కన ఎవరు లేక ఒంటరిగా వుంటారు.
వారి గుండె అస్తవ్యస్తంగా కొట్టుకొంటూవుంటుంది.బాగా నీరసం అనిపిస్తుంది. ఇక స్పృహ కోల్పోవటానికి కేవలం పదే పది క్షణాలు మిగిలి వుండొచ్చు.
7అయినా సరే ఈ భాధితులు పదేపదే బాగా గట్టిగా దగ్గేయడం ద్వారా తమకు తామే సాయంచేసుకొని రక్షించుకోవచ్చు.
దగ్గే ప్రతీసారి బాగా వూపిరి తీసుకోవాలి.ఆ దగ్గు కూడా బాగా గొంతు లోపలనుండి వచ్చేలా కాస్తంత ఎక్కువ సేపు దగ్గాలి.అదీనూ ఛాతీ లోలోపల నుంచి కళ్ళె బయటకు కక్కేలా/ఊసేలా.
ఏదేనీ సాయం అందేవరకీ,లేదా గుండె మరల మామూలు గానే పనిచేస్తుంది అని మీకు అనిపించేంత వరకూ ఎడతెరిపి లేకుండా ప్రతీ రెండు సెకన్లకొకసారి మార్చి ,మార్చి ఊపిరి తీసుకొంటూ గట్టిగా దగ్గుతూ వుండాలి.
8 గట్టిగా తీసుకొనే ఊపిరి ఆక్సిజన్ ని ఊపిరి తిత్తులకు చేరవేస్తుంది.గట్టిగా దగ్గే దగ్గు కదలికల వల్ల గుండెని నొక్కినట్టై రక్తప్రసరణ కొనసాగుతుంది.
బాగా నొక్కపెట్టినట్టు అనిపించే ఒత్తిడి కూడా గుండె తిరిగి యథాస్థితిలో పని చేయటానికి దోహదం చేస్తుంది.
ఇలాగా గుండె పోటు భాధితులు ఏదేనీ ఓ ఆసుపత్రికి చేరేలోపున ప్రమాదాన్ని దూరంగా పెట్టొచ్చు.
9ఈ విషయాన్ని వీలైనంత ఎక్కువగా ఇతరులకు చెప్పండి. అది వారి ప్రాణాలు కాపాడవచ్చు.
10ఓ హృద్రోగ నిపుణులు ఏమంటారంటే ఈ సందేశం అందుకొన్న ఎవరైనా దయతో మరో పది మందికి పంపుదురు అని .ఇలా చేసి కనీసం ఒక్క ప్రాణాన్ని అయినా కాపాడలేమా అని మీరు సవాలుగా తీసుకోవాలని.
11జోకులు గట్రా పంపటం లాంటివి కన్నా దయచేసి ఓ వ్యక్తి ప్రాణం నిలిపే ఈ సందేశాన్ని పదిమందికి
తెలియజేయండి.
12 ఇదే సందేశం పంపిన మీకే మరలా పదే పదే వస్తుంటే దయచేసి చికాకు పడకండి.
మీరంటే శ్రద్దతో ,ప్రేమతో ఈ గుండె పోటుని ఎలా ఎదుర్కోవాలో తెలియచేసే మిత్రులు ఇందరున్నారా అని మీరు సంతోషపడే విషయం సుమా ఇది
మీ కోసం ఈ సందేశం పంపిన వారు.
శివ... సాక్షి జర్నలిస్ట్

09/05/2017

ఖర్జూరం పండ్లలో ఆరోగ్యంగా ఇలా!

* శరీరానికి తక్షణ శక్తినిచ్చే 'ఖర్జూరం'!

* పొటాషియం ఎక్కువగా లభించే ఖర్జూరాలు తినడం వల్ల గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు అదుపులో ఉంటాయి. అలాగే ఇవి గుండెకు సంబంధించిన అనేక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి.

* ఖర్జూరం పండ్లలో శరీరానికి కావాల్సిన మినరల్స్, విటమిన్స్, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాల ఎదుగుదలకు చాలా అవసరం.

* ఖర్జూరాల్లో కొలెస్ట్రాల్, క్యాలరీలు తక్కువగా.. ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి తింటే బరువు పెరుగుతామన్న భయం ఉండదు.

* ఖర్జూరం పండ్లలో యాంటీఆక్సిడెంట్ల రూపంలో ఉండే విటమిన్ 'ఎ' కంటికి చాలా మంచిది. ఈ పండు వల్ల రేచీకటి వంటి కంటి సమస్యలు కూడా దూరమవుతాయి.

* క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్.. వంటి మినరల్స్ ఈ పండులో అధికంగా లభిస్తాయి. క్యాల్షియం ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచడానికి.. కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి.. మాంగనీస్ ఎముకల పెరుగుదలకు ఉపయోగపడతాయి.

* ఖర్జూరాలు కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. బాగా సన్నగా ఉండి ఆరోగ్యకరంగా బరువు పెరగాలనుకునే వారికి కూడా మంచి ఫలితాన్నిస్తాయి.

* ఖర్జూరం పండు శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. అందుకే రంజాన్ ఉపవాస దీక్షల సమయంలో ముస్లింలు ఈ పండుని ఆహారంగా తీసుకుంటారు. అలాగే ఇది త్వరగా జీర్ణమవుతుంది కూడా!

* మలబద్ధకంతో బాధపడే వారు కొన్ని ఖర్జూరాల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున వాటిని తిని, ఆ నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

* ఖర్జూరంలో బి-కాంప్లెక్స్‌తో పాటు విటమిన్ 'కె' కూడా ఉంటుంది. ఇందులోని నియాసిన్, రైబోఫ్లేవిన్, పాంటోథెనికామ్లం, పైరిడాక్సిన్.. మొదలైన విటమిన్లు శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తాయి.

* ఖర్జూరాలు తింటే రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయని చాలామంది వాటిని తినడానికి భయపడుతుంటారు. వీటిలో ఉండే సహజసిద్ధమైన చక్కెరల వల్ల రక్తంలో చక్కెర స్థాయులు మరీ గణనీయంగా పెరగవని ఓ పరిశోధనలో వెల్లడైంది. కానీ డయాబెటిస్‌తో బాధపడే వారు మాత్రం డాక్టర్ సలహా మేరకే వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.

* ఖర్జూరాల్లో ఉండే విటమిన్ బి6 వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
* శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఖర్జూరాలు తమవంతు పాత్ర పోషిస్తాయి.

* మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లు కరగాలంటే ఖర్జూరాల్ని తరచూ తినాలి. అలాగే కొంతమందికి మూత్రం సరిగ్గా రాకపోవడం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు.. తదితర సమస్యలుంటాయి. ఇవన్నీ ఖర్జూరం తినడం వల్ల తగ్గే అవకాశం ఉంది.

09/05/2017

*గుండె పదిలంగా ఉండాలంటే దాల్చినచెక్క వాడండి..!*

మంచి సువాసనతో కాస్తంత వగరుగా, తియ్యగా ఘాటుగా ఉండే దాల్చిన చెక్క మషాలా దినుసులలో అతి ముఖ్యమైనది. ధనియాలు, చెక్క, లవంగం ఇవన్నీ సుగంధ ద్రవ్యాలుగా పూర్వం నుంచి వంటింట్లో వాడబడుతున్నాయి. దాల్చిన చెక్క వేడిచేసే స్వభావం కలిగి ఉంది.
వాత వ్యాధులలో దాల్చిన చెక్క చాలా బాగా పనిచేస్తుంది. దీనిని వాడడం వల్ల కడుపుతో వాతం తగ్గుతుంది. అజీర్తిని తగ్గించే గుణం దాల్చిన చెక్కకు ఉంది. అజార్తిని పోగొట్టడం, జీర్ణశక్తిని పెంచడంలో దాల్చిన చెక్క పనిచేస్తుంది. కేవలం దాల్చిన చెక్కను ఆహారంలో వేసుకోవడమేగాక బాగా మెత్తగా దంచి ఆ పొడిని నీటిలో కలుపుకుని త్రాగడం వల్ల కూడా ఫలితాన్ని పొందవచ్చు.
వాత వ్యాధులలో కలిగే నొప్పిని ఇది వెంటనే నివారిస్తుంది. కల్తీ తినుబండారాలు తినడం వల్ల కలిగే విష దోషాలు కలిగించే పదార్థాల్ని పొరపాటుగా తింటే లేక ఎలర్జీ కలుగు పదార్థాల్ని తిన్నా దాని తీవ్రతను తగ్గించి, విషాలకు విరుగుడుగా దాల్చిన చెక్కను పొడిగా చేసిగాని, దాల్చిన చెక్క రసాన్ని గాని తీసుకోవాలి. శరీరానికి నీరు పట్టినప్పుడు దాల్చిన చెక్కను ప్రతిరోజూ క్రమం తప్పకుండా వాడితే వంటికి పట్టిన నీరు తగ్గుతుంది.
హృద్రోగాలలో దాల్చిన చెక్క తన వంతు సాయం చేసి గుండెను బలంగా ఉంచుతుంది. మైగ్రేన్‌ తలనొప్పి, అంటే పార్స్వ నొప్పిని కూడా దాల్చిన చెక్కను రోజూ తింటే తగ్గించుకోవచ్చు. కనీసం నొప్పి తీవ్రతను అయినా ముందు తగ్గుతుంది. గొంతులో గురగురను పోగొట్టి గొంతును శ్రావ్యంగా ఉంచుతుంది. స్వరం బొంగురుగా వచ్చి స్వరపేటిక వాపు ఉన్నప్పుడు దాల్చిన చెక్కను బుగ్గనపెట్టుకుని అప్పుడప్పుడు వచ్చిన ఊటను మింగుతూ ఉండాలి.
దాల్చిన చెక్క బుతుదోషాల్ని కూడా నివారిస్తుంది. స్త్రీలకు ఇది అద్భుతమైన ఔషధం. బుతుశాల అనేది ఎంతోమందికి నరక ప్రాయం.దీనిని దాల్చిన చెక్క వాడడం ద్వారా తగ్గించవచ్చు. అంతేకాకుండా బుతువు సక్రమంగా అయ్యేలాగా చూస్తుంది కూడా. బుతు రక్తము అధికమైనా దీనిని వాడవచ్చు. దాల్చిన చెక్క స్త్రీల బుతు సమస్యలనే కాకుండా గర్భాశయ దోషాల్ని కూడా అరికడుతుంది. గర్భిణీ స్త్రీ దాన్ని వాడితే సుఖ ప్రసవం అవుతుంది.
కంటి రోగాలతో బాధపడేవారు దాల్చిన చెక్కను వాడితే కళ్ళు కాంతి వంతమవుతుంది. గ్యాస్ ట్రబుల్‌ ఉన్న వ్యక్తులకు దాల్చిన చెక్క చాలా మేలు చేస్తుంది. కడుపులోనూ, గుండెలలోనూ మంట ఉన్నా, ఎక్కిళ్లు వస్తున్నా దీనిని వాడితే మంచిది. జిగట విరేచనాలు, అమీబియాసిస్‌ వంటి వ్యాధుల్లో దాల్చిన చెక్కను బాగా మెత్తగా దంచి దానిలో కాసిని నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ అయ్యేట్లు ఉడకబెట్టి గట్టిపడ్డాక దానిలో కాస్త నెయ్యి, పటిక బెల్లం వేసి కలిపి కుంకుడుకాయంత మాత్రలు చేసుకుని మూడు పూటలా తింటూ ఉండే వ్యాధి తగ్గుతుంది.
అంతే కాదు నీళ్ళ విరేచనాలు, అజీర్తి విరేచనాలు కూడా తగ్గుతాయి. విరేచనాలతో పాటుగా వాంతులు ఉన్నప్పటికీ దాల్చిన చెక్క తగ్గిస్తుంది. పావుసేరు గుమ్మపాలలో రెండు చెంచాల దాల్చిన చెక్క పొడిని కలిపి రోజూ త్రాగితే వీర్యవృద్థి కలుగుతుంది.
----గమనిక :-ధాసినా చెక్క వెడి చెసె గుణo ఉన్నా వస్తూవు తక్కువ మెతాధూలో వాడoడి

09/05/2017

*ఐరన్ లోపిస్తే బరువు తగ్గుతారట... ఉడికించిన గుడ్డు.. డ్రై ఫ్రూట్స్ తీసుకోండి*

ఐరన్ లోపం వల్ల లావు తగ్గడంతో.. తరచూ తలనొప్పి.. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి కాబట్టి ఐరన్‌ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉడికించిన గుడ్డు చేపలు, బీన్స్‌, ఆకుకూరలు, పచ్చని కూరలు, డ్రైఫ్రూట్స్‌, సోయా, మాంసం, రాగులు వంటివి తీసుకోవాలి. ఐరన్‌ పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది.

శరీరానికి ఆక్సిజన్‌ అందించే ఎర్ర రక్తకణాల సంఖ్య పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్లను దరిచేరనివ్వదు. శరీరానికి తగిన ఐరన్‌ను ఆహారం ద్వారా అందించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రక్తహీనతతో బాధపడేవారు ఐరన్‌ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుంది. ఇంకా బరువును పెరగరు. బరువు నియంత్రించుకోవాలంటే ఐరన్‌ను తగిన మోతాదులో తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

09/05/2017

*వృద్ధాప్య ఛాయలు తొంగిచూస్తున్నాయా? రోజూ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి..*

30 ఏళ్ల వయస్సులో వృద్ధాప్య ఛాయలు తొంగిచూస్తున్నాయా? అయితే పౌష్టికాహారంపై దృష్టి పెట్టండి. వయసు మీద పడకుండా ఉండాలంటే? చిన్నతనంలోనే వయసు పెద్దగా కనిపించకుండా ఉండాలంటే.. ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ వారి డైట్‌లో డ్రైఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఎండబెట్టిన ఆప్రికాట్లు, ఖర్జూరం, ఎండబెట్టిన రేగుపళ్లు ఈస్ట్రోజన్‌ హార్మోన్లను పెంచుతాయి. మిగిలిన డ్రైఫ్య్రూట్స్‌లో కూడా ఫైటోఈస్ట్రోజన్‌ ఉంటుంది.

అలాగే ఈస్ట్రోజన్‌ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాల్లో సోయా కూడా ఒకటి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్‌ అసలు ఉండదు. ప్రోటీన్లూ ఎక్కువే. ఇవి రెగ్యులర్‌గా ఆహారంలో తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్‌ కూడా దరిచేరదు. అలాగే వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. అలాగే మొలకెత్తిన పెసలు, శెనగలు తీసుకోవడం ద్వారా హార్మోన్లను బ్యాలెన్స్‌ చేయడానికి వాడే మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు రాకుండా ఇవి నిరోధిస్తాయి.



ఇకపోతే.. పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. వీటిలో అధికంగా ఉండే ఈస్ట్రోజన్‌ హార్మోన్లు.. చిన్నతనంలో వచ్చే మెనోపాజ్‌ను దరిచేరకుండా చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

09/05/2017

*చింతాకులతో కీళ్ల నొప్పులకు చెక్.. ఎలా..?*

కీళ్ళనొప్పులున్న వారు తరచూ మందులు మాత్రలు ఉపయోగిస్తుంటారు. కాని కొన్ని ఉపాయాలు పాటిస్తే కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

* సహజంగా కీళ్ళ నొప్పులు ప్రతి ఒక్కరినూ ఉంటాయి. ఇవి ఎక్కువగా, ఉదయం, సాయింత్రం వేళల్లో కనిపిస్తుంటాయి. దీనికి ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు నొప్పి ఉన్నచోట నొప్పి నివారణ మందు పూయండి.

* కాస్త ఉప్పు కలిపిన నీటిలో చింతాకులు ఉడికించి నొప్పులున్నచోట ఆనీటిని పోయండి నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు. విటమిన్ సి కి సంబంధించిన పండ్లు అధికంగా తీసుకోవాలి.

* నొప్పులున్నచోట యూకలిప్టస్ ఆయిల్ పూసి వేడినీళ్ళతో తాపడం పెట్టాలి. లేకుంటే మెత్తటి తువ్వాలు వేడినీళ్ళల్లో ముంచి బాగా పిండిన తర్వాత ఆ వేడి తువ్వాలును నొప్పులున్న చోట పెట్టండి. దీంతో నొప్పులంనుంచి ఉపశమనం కలుగుతుంది.

* వారానికి ఒకసారి ఉపవాసం ఉండటం మంచిది. క్యారెట్‌జ్యూస్, క్యాబేజ్‌సూప్ తీసుకుంటే నొప్పులు తగ్గుతాయి. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గేమార్గం ఆలోచించాలి. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్, పాలు, ఉర్లగడ్డలు వాడకూడదు.

09/05/2017

*పచ్చి ముల్లంగి ఆకుల రసాన్ని రోజూ సేవిస్తే...*

మనం ఇంట్లో వుండే ఆకు కూరలు, కూరగాయలను పెద్దగా పట్టించుకోము కానీ వాటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఉదాహరణకు ముల్లంగినే తీసుకోండి...

ముల్లంగి రసాన్ని రోజూ తాగుతూ వుంటే కాలేయానికి సంబంధించిన చాలా వ్యాధులను అడ్డుకోవచ్చు.



ముల్లంగి ఆకులను, దుంపలను ఎండబెట్టి మెత్తగా దంచి ఆ పొడిని తేనెతో కలిపి రోజూ ఒక చెంచా చొప్పున తీసుకుంటే వాపు, నొప్పి ఏ అవయవంలో వున్నప్పటికీ క్రమేణా తగ్గిపోతాయి.



ఆగకుండా వెక్కిళ్లు వస్తున్నప్పుడు కొంచెం ముల్లంగి రసాన్ని తాగితే వెంటనే తగ్గిపోతాయి.



ముల్లంగి గింజలను బాగా ఎండబెట్టి మెత్తగా దంచి ఆ పొడిని రోజూ అన్నంలో కలుపుకుని తింటూ వుంటే స్త్రీలలో రుతుస్రావ సమస్యలు తొలగిపోతాయి.



పచ్చి ముల్లంగి ఆకుల రసాన్ని రోజూ సేవిస్తే సాఫీగా విరేచనాలు అవుతాయి. జీర్ణశక్తి బాగా అభివృద్ధి చెందుతుంది.



విపరీతమైన దగ్గు, జలుబు ఆయాసంతో బాధపడేవారు ముల్లంగి రసాన్ని తాగితే సత్వరమే నివారణ అవుతుంది

09/05/2017

*జుట్టు పెరగాలంటే.. పిడికెడు తెల్లటి నువ్వు విత్తనాలు తినండి..*

రోజు ఉదయాన, ఒక పిడికెడు తెల్లటి నువ్వు విత్తనాలను తినండి. పిడికెడు నువ్వు విత్తనాలలో సూమారు 1,200 గ్రాముల కాల్షియం, మెగ్నీషియం అందడం ద్వారా జుట్టు పెరుగుతుంది. అలాగే కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా జుట్టు పెరుగుదలకు కావలసిన క్యాల్షియం అందుతుంది.
రోజు అర కప్పు కొబ్బరి నీరు తాగొచ్చు. లేదా కొబ్బరి పాలు తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అయితే కొబ్బరి పాలు ఎక్కువ తీసుకోకూడదు. కారణం-కొబ్బరిలో ఎక్కువ సాచురేటేడ్ ఫాట్‌లు ఉంటాయి, ఇవి శరీర రక్తంలో కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతాయి.

ఇక మీ జుట్టును దువ్వెటపుడు, వెంట్రుకలకు వ్యతిరేకంగా దువ్వడం మంచిది కాదు. దువ్వెనతో గట్టిగా దువ్వడం వెంట్రుకల ఆరోగ్యానికి మంచిది కాదు. యోగా చేయటం వలన మెడ, తలకు సంబంధించిన భాగాలలో కలిగే ఒత్తిడి శక్తివంతంగా తగ్గించబడుతుంది, అంతేకాకుండా రక్త ప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది. యోగాల వలన కేశాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Address

Hyderabad
569765

Opening Hours

Monday 8am - 9pm
Tuesday 8am - 9pm
Wednesday 8am - 9pm
Thursday 8am - 9pm
Friday 8am - 9pm
Saturday 8am - 9pm
Sunday 8am - 9pm

Telephone

+918765432876

Alerts

Be the first to know and let us send you an email when Prakruthi Nidhi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram