03/12/2025
ఎముకల డాక్టర్ తో యమధర్మ రాజు!
నిర్లక్ష్యం చాప కింద నీరులా
ఆణువణువూ పాకినప్పుడు..
నిరీక్షించడం కాక,
దిగి నిలబడడం,
నిల్చొని బాధ్యత తెలపడం
ఎంతో అవసరం!
ఎన్నో వందల accidentలకి రుజువులు చూస్తూ,
నిస్సహాయతతో నొప్పిని పరీక్షించే నా OP లో,
రోడ్డు మీద జరిగే ఎన్నో అజాగ్రత్తలు, నిర్లక్ష్యాలు
నన్ను తలపిస్తుంటాయి!
కనీస జాగ్రత్తలు పాటిస్తూ,
క్రమశిక్షణను అనుసరిస్తే,
నా లాంటి ఎంతో మంది డాక్టర్ల OP రూంలు ఖాళీగా.
ఎంతో మంది కుటుంబాల హాల్లలో చిరు నవ్వులు నిండుగా ఉంటాయి!
అందుకే, నా లాంటి OP లల్లో తాకిడి తగ్గాలని,
నేను తీసుకున్న భీష్మ ప్రతిజ్ఞే ఈ 'Saferabad' యజ్ఞం!
సర్వేజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో,
మా శక్తులన్నీ వాడుతూ,
రోడ్ accidents ని నివారించడానికి మేము చేసే ఎన్నో వినూత్న కార్యక్రమాలలో..
ఒక వినూత్న ప్రయత్నం,
యమ లోకం నుంచి యముడిని రప్పించగలగడం!
ఇక్కడ జరిగే నిర్లక్ష్యాలని నిలదీయడానికి,
ఇక్కడ మరిచే బాధ్యతలకు భయాన్ని పులమడానికి,
యమ ధర్మ రాజే, యమ లోకానికి సెలవలు పెట్టి,
మన బాగు కోసం, మన మధ్య తీరుతుంటాడు!
హైదరాబాద్ లోని అన్ని ట్రాఫిక్ జుంక్షన్స్ లల్లో,
క్రమశిక్షణ తప్పే అందరికి,
భయంతో బెదిరించి,
ప్రేమతో బుజ్జగించి,
మనందరికీ రోడ్డు మీద క్రమశిక్షణ నేర్పించబోతున్నాడు!
ఈ బృహత్కర కార్యక్రమంలో అందరు చేతులు కలుపుతారని ఆశిస్తూ,
మన హైదరాబాద్ రోడ్లని సురక్షితంగా మారుస్తారని కోరుకుంటూ,
ఆ పైన యముడి జాడలో పడకుండా ఉండటానికి,
ఈ యముడి మాటనైనా వింటారని ఆశతో ఇదో చిన్న ప్రయత్నం!
మీలో ఎవరికైనా ఏ signal దేగ్గరైన మా యముడు కనిపిస్తే,
ఒక ఫోటో దిగి, రోడ్ accidents పట్ల అవగాహన పెరిగేలా,
మంచి caption తో నన్ను కానీ, సర్వేజనా ఫౌండేషన్ ని tag చేస్తూ
సోషల్ మీడియా లో ఆ ఫోటోని పంచుకోగలరు!
ఈ మహా యజ్ఞంలో, మీరూ సమిధలు అవుతూ
ఈ అవగాహనా కాంతి నలువైపులా వ్యాపించేలా చెయ్యాలని కోరుకుంటూ.. గురవా రెడ్డి!