08/12/2021
పాదాలు & చేతులు వాపుకు గల కారణలు, నివారణ మరియు తీసుకోవాలిసిన జాగ్రత్తలు.
అవగాహనకోసం #డా_విష్ణు_వర్ధన్_రాజు సలహాలు,
Edema in the body awareness
శరీరములో అక్కడక్కడ నీరి చేరి(fluid accumulation in body tissues) , లోపల ఉన్న నీరు బయటికి వెళ్ళకుండా శరీరము లో ఉండిపోవడం ఎక్కువ బాధ పెట్టె పెద్ద సమస్య కాకపోయినా ఇది శరీరము కొన్ని ముఖ్యమైన అవయవాల క్రియాశక్తి లోపాలకు సూచన . ఒక్కోసారి మనిషి దీనివల్ల చనిపోయే అవకాశము ఉండవచ్చును . కొందరిలో ఇది కాళ్ళలోనూ , ముఖం లోనూ , పొట్టలోనూ లేదా ఏదో ఒక అవయానికే పరిమితం అవవచ్చును.
శరీరములో నీరు చేరడం 3 రకాలు ---
ఏదైనా ఒక బాగానికి నీరు చేరి వాపు రావడం --Lacal edema .. అంటారు .
శరీరమంతా ఏకరీతిగా నీరు చేరడం -- generalized edema ... ఆంటారు .
శరీరము లో ఉన్న క్యావిటీలలో (body cavities) నీరు చేరడం . ఉదా: జలోదరము , ఫ్లూరల్ ఎఫ్యూషన్ మున్నగునవి .వివరాలు కు లింక్స్ చూడాలి
ఇందులో వేలి తో నొక్కితే చొట్ట పడేది , చొట్ట పడనిది అని రెండు విధాలు గా ఉంటుంది . చొట్టపడని ఎడీమా లింఫాటిక్ మండలము (Lymphatic system) వ్యాదిగ్రస్తమవడం వల్ల ఏర్పడుతుంది ... దీనిని Lymphedema అంటాము . చొట్టపడని ఎడీమా కి ఇంకో కారణము థైరాడ్ వ్యాదులలో ఒకటైన మిక్షెడిమా(due to Hypo-thyroidism)
చొట్టపడే ఎడీమ చాలా సాదారణము కనిపించే ఈరకం నీరుచేరడం . ఇది రక్త నాళాలలో ఉన్న ద్రవము లీకు అవడం వలన కణాల మధ్యలోనికి వచ్చి వాపుగా యేర్పడుతుంది . నాళాలళొ pressure ఎక్కువ అయినపుడు ఇది జరుగుతూ ఉంటుంది .
కారణాలు / వ్యాధులు :
గుండె జబ్బులు (heart failure, CCF),
మూత్రపిండాల వ్యాధులు (nephrotic syndrome),
కాలేయ సంబంధిత వ్యాధులు (liver failure-cirrhosis),
varicose veins ,
Thromboplebitis,
Dermatitis ,
Skin allerty ,
filaria edema ,
Lipo edema ,
myxedema .
ఎక్కువ సేపు నిలబడడం మూలం గా వచ్చే వాపులు .(hypostatic postural edema),
ఎక్కువ ఉప్పు పదార్ధములు తినడం మూలాన వచ్చే వాపులు ,
స్త్రీలలో భహిస్టలు ముందు జరిగే హార్మోనుల అసమతుల్యము వలన వచ్చే వాపులు ,
కొంతమంది గర్భిణీ లలో ఎక్కువ నీరు నిలవా అవడం మూలాన వచ్చే వాపులు ,
కొన్నిరకాల మందులు వాపులకు కారణము కావచ్చును : అవి ->
వ్యాసోడైలేటర్స్ (vasodilators)-- ఈ మందులు రక్తనాళము లోపల పరిమాణము పెరిగేందుకు , చిన్న చిన్న రక్తనాళాలు తెరుచుకునేందుకు వాడుతారు . ఇవి రక్తపోటును తగ్గిస్తాయి.
కాల్సియం చేనల్ బ్లోకర్స్ (calcium channel blockers) : వీటిని క్యాల్చియం యాంటాగొనిస్ట్స్ అంటాము . ఇవి కూడా రక్తపోటును నియంత్రిస్తాయి.
NSAIDs -- నాన్ స్టిరాయిడల్ యాంటి ఇంఫ్లమేటరీ డ్రగ్స్ అని వ్యవరిస్తారు . నొప్పులు తగ్గడానికి వాడుతారు . ఎక్కువకాలము వాడినవారిలో శరీరం వాపులు వస్తాయి.
స్త్రీల సంభందిత హార్మోన్ అయిన సంతాననిరోదక మాత్రలు (Estrogens)ఎక్కువకాలము వాడినా ,
మధుమేహ బాదితులు ఇన్సులిన్ సెన్‌సిటైజర్స్ ... ఉదా : thiazolidinidiones group drugs ఎక్కువకాలము వాడినా ఈ వాపులు కనిపిస్తాయి.
Mechanism --ఎలా ఏర్పడుతుంది .: శరీరములో చిన్న రక్తనాళాలైన క్యాపిల్లరీస్ (capillaries) నుండి ద్రవము (సీరం) లీకు అవడం వలన ఎడీమా ఏర్పడుతుంది . ఈ లీకేకీ ఆయా రక్తనాళాలకు దెబ్బతగలడమో(damage)లేదా వాటిలో పీడనము(increased pressure) ఎక్కువ అవడము మూలానో జరుగుతుంది . ఈ ద్రవము లీకేజీ సాంకేతికాలు మూత్రపిండలకు చేరి ఎక్కువ సోడియం నిలవాకి దోహదం పడి ఆ లీకైన ద్రవాన్ని బర్తీచేయడానికి ప్రయత్నం చేసే ప్రక్రియ వలనే మరింత ద్రవము కణాలచుట్టూ చేరి వాపులకు దారితీస్తుంది .
increased hydrostatic pressure --రక్తపోటు ఉన్నవారిలోను, మిగతా రక్తనాళాల వ్యాదులలో , సిరలు లో కవాటాలు నీరసత్వము ,
reduced Oncotic pressure with in blood vessels, -- రక్తములో ప్రోటీన్లు శాతము తగ్గినపుడు .
increased tissue oncotic pressure , -- సోడియం శాతము ఎక్కువైనపుడు ,
increased blood vessel wall permiability -- inflamation , -- కొన్ని రక్తనాళాల వ్యాధులలో,
obstruction of fluid clearance via lymphatic system ,-- ఫైలేరీయా వంటి వ్యాధులలో ,
Sodium retention conditions .,--- మూత్రపిండాల వ్యాదులలో ,
వాపులకు లోనయ్యే కొన్ని అవయవాలు ... ఉదాహరణ:
మెదడు పొరలు , కణాలు వాపు --Cerebral edema .
ఊపిరితిత్తుల లో వాపు --- pulmonary edema ,
కళ్లలో వాపు --- corneal edema , conjunctivitis , keratitis ,
కళ్ళ చుట్తూ , ముఖం లో వాపు ---- puppiness of face in Kidney diseases ,
జల ఉదరము -- cirrhosis liver ,
మిక్షెడిమా --- hypothyroid diseases ,
రక్తపోటు ఉన్నవారిలో -- legs in hypertension ,
కాళ్ళ వాపులు -- Heart diseases , ccf ,
ఎలా గుర్తించడం : Symptoms ->
ముఖం ఉబ్బరించినపుడు , కాళ్ళు , పాదాలు , మోచేతులు , కాళ్ళు గుత్తులు వాచినట్లుండడం ,
పొట్ట క్రమము గా ఉబ్బినట్లవడం నీటి కుండలా ఉండడం ,
శ్వాస చిన్నగా అవడం .. చాతిలో నొప్పి రావడం ఆయాశము గా ఉండడం ,
ముఖం ఉబ్బడం , కళ్ళచుట్టూ వాపులు గా ఉండడం ,
చర్మము సాగి పల్చబడి మెరిసే టట్లు కనిపించడం ,
వీటిలో ఏది ఉన్నా డా్క్టర్ ని సంప్రదించాలి . తగిన చికిత్స తీసుకోవాలి .
చేయవల్సిన పరీక్షలు :
యూనిన్ టెస్ట్ లు (urine analysis),
బ్లడ్ తనికీలు (Blood analysis) ),
బి.పి , సుగరు తనికీలు (B.P, diabetes tests),
చాతి ఎక్షురే (chest X-ray),
నివావరణ మార్గాలు :
శరీరము లో నీరు ఉండిపోవడానికి కారణం తెలుసుకొని మందు తీసుకోవాలి . తాత్కాలికం గా డయూరిటిక్స్ వాడవచ్చును . బార్లీ నీరు తాగితే ఫలితం ఉంటుంది.
దీనివల్ల వాపులు తగ్గినా సరియైన చికిత్సకోసం పరీక్షలు చేయించుకోవాలి అందుకొరకు వైద్యనిఫుణులను సంప్రదించాలి
ధన్యవాదములు🙏
మీ || డాక్టర విష్ణు వర్ధన్ రాజు,
*విష్ణు ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్*
R.s. road, రాజంపేట...