24/12/2025
*మంకీ ట్రాప్: మనందరిలో ఉన్న కనిపించని మానసిక రుగ్మత*
*వదలలేకపోవడం కూడా ఒక మానసిక వ్యాధేనా?* - డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి, రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ | సెక్స్ ఎడ్యుకేటర్ | క్లినికల్ న్యూట్రిషనిస్ట్ & డైటీషియన్ | స్పెషల్ ఎడ్యుకేటర్ | ఫ్యామిలీ కౌన్సెలర్, #9703935321
సమాజాన్ని ఒక్కోసారి పెద్ద సంచలనాలు కాదు, చిన్న వార్తలే లోతుగా కుదిపేస్తాయి. ఇటీవల భాగ్యనగరంలో చోటు చేసుకున్న ఒక మరణం అలాంటిదే. వార్తా పత్రికలలో రెండు లైన్లలో ముగిసిన ఈ సంఘటన బయటకు పెద్దగా కలకలం రేపలేదు. కానీ లోతుగా ఆలోచిస్తే, ఇది మన సమాజపు మానసిక స్థితిని అద్దంలో చూపించిన ఘటనగా కనిపిస్తుంది. ఒక బిచ్చగాడు ఆకలితో మృతి చెందాడు. పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం అతడు పద్నాలుగు రోజులుగా భోజనం చేయలేదు. అంటే ఇది సాధారణ మరణం కాదు ఇది ఒక ఆకలి మరణం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతని సంచిలో మరియు జేబుల్లో లభించిన నగదు మొత్తం రూ.1,34,000 అక్షరాల లక్షా ముప్పై నాలుగువేలు. ఈ రెండు నిజాలను కలిపి చూసినప్పుడు ఒక ప్రశ్న సహజంగానే ఎదురవుతుంది అంత డబ్బు అతని దగ్గర ఉండి కూడా ఒక మనిషి ఆకలితో ఎందుకు చనిపోయాడు? ఆ మనిషి తన ప్రాణాన్ని ఎందుకు కాపాడుకోలేకపోయాడు? ఈ ప్రశ్నకు సమాధానం డబ్బులో లేదు. అది మనిషి మనస్తత్వంలో ఉంది. మానసిక శాస్త్రంలో దీనిని “మంకీ ట్రాప్”గా పిలుస్తారు.
మానసిక శాస్త్రం చెప్పే *మంకీ ట్రాప్*
మానసిక శాస్త్రంలో ప్రసిద్ధమైన ఒక ఉదాహరణ ఉంది మంకీ ట్రాప్. ఆఫ్రికాలోని కొన్ని తెగలు కోతులను పట్టుకునేందుకు ఉపయోగించే ఈ పద్ధతి చాలా సులభమైనది, కానీ లోతైన విశ్లేషణ సందేశాన్ని కలిగి ఉంటుంది. కోతి చేయి లోపలికి వెళ్లేంత పెద్ద రంధ్రం చేసి, పిడికిలితో బయటకు రానంత చిన్నదిగా ఉంచుతారు. అందులో ఆహారం వేస్తారు. కోతి చేయి లోపల పెట్టి తినుబండారాన్ని పట్టుకుంటుంది. ప్రమాదం దగ్గరికి వచ్చినా, వేటగాళ్లు వస్తున్నా, కోతి చేయి తెరవదు. పట్టుకున్నదాన్ని వదలలేక చివరికి చిక్కుకుంటుంది. ఇక్కడ కోతిని చంపేది వేటగాడు కాదు. చేతిలో పట్టుకుని ఉన్న వదలలేని మనస్తత్వమే అసలు కారణం.
*మనిషి కూడా అదే ఉచ్చులో*
మనిషి తనను తాను అత్యంత తెలివైన జీవిగా భావిస్తాడు. కానీ వాస్తవానికి మనిషి కూడా ఇదే మానసిక రుగ్మతలో చిక్కుకుంటున్నాడు. అవును… మనుషులు కూడా ఇదే ట్రాప్‌లో ఉంటారు. ప్రమాదమని తెలిసినా… నష్టమని అర్థమైనా… కొన్ని విషయాలను వదలలేకపోతాం. డబ్బు, అహంకారం, పేరు, పంతం, అలవాటు. డబ్బే మనల్ని బంధిస్తుందా? కాదు… మన ఆలోచనా విధానమే మనల్ని బంధిస్తుంది. తేడా ఏమిటంటే మనిషి ట్రాప్ కనిపించదు. అది చెట్టు తొర్రలో కాదు, మనసులో ఉంటుంది. డబ్బు, బంధాలు, అహంకారం, పేరు, ప్రతిష్ఠ, పంతం, అలవాట్లు మొదట