26/11/2022
తనకెలాంటి సంబందం లేదు ః సర్పంచ్ #పురుమల్ల_శ్రీనివాస్
కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని 724డి భూమికి తనకు ఎలాంటి సంబంధం లేదని, తనకు ఆ భూమిలో సెంటు స్థలం కూడలేదని, తనను అనవసరంగా కేసులో చేర్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని సర్పంచ్ #పురుమల్ల_శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేసారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది వ్యక్తులు ఇదే పనిగా పెట్టుకొని పిడి యాక్టు పెట్టాలని ఒత్తిడి చేయడం ఎంత వరకు సమంజసమని ఆందోళన వ్యక్తం చేసారు. ఈ సర్వే నెంబర్‌లోని భూమిని 20 ఏళ్లకిందట కొంత మంది కొనుగోలు చేసుకొని మోఖాపై ఉన్నారని, మరికొంతమంది పంచాయతీ అనుమతితో నిర్మాణాలు చేపట్టారని, ఒక సామిల్ కూడా నడుస్తోందని చెప్పారు. అయినప్పటికీ ఇద్దరు వ్యక్తులు ఆ భూమిని ఐదేళ్ల కిందట కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లు చూపిస్తూ ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. మోఖాపై ఉన్న వ్యక్తులు, ప్రçత్యర్థి వ్యక్తులిద్దరూ న్యాయస్థానం ఆశ్రయించగా కేసు నడుస్తోందని తెలిపారు. అయినప్పటికీ ఇద్దరు పట్టాదారులు తనపై దుష్ప్రచారం చేస్తూ తనపై పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేయించడం బాధాకరన్నారు. తనకు చట్టంపై ఉన్న గౌరవంతో పోలీసులకు సహకరిస్తూ న్యాయస్థానంను గౌరవిస్తూ చట్ట ప్రకారం ముందుకెళ్తుంటే అనవసరంగా రాద్ధాంతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 724డి సర్వే నెంబర్‌లో గజం భూమి తనకున్నా, ఎలాంటి పొరపాటు చేసిన ఏ శిక్షకైనా సిద్ధమని, తనపై పెట్టిన తప్పుడు కేసును ఎత్తివేయాలని శ్రీనివాస్ విజ్ఞప్తి చేసారు.