07/06/2020
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం.. WORLD FOOD SAFETY DAY సందర్భంగా కొన్ని ఆరోగ్య సూత్రాలు:
"ఆహార సంభవం వస్తుః రోగాః పునరాహార సంభవాః"
"ఆహారం నుండే ఈ శరీరం ఉద్భవించింది. రోగాలు కూడా ఆహారం నుండే సంభవిస్తాయి" .. అని ఆయుర్వేదం చెబుతోంది.
"అన్నార్భవంతి భూతాని, పర్జన్యాదన్న సంభవః" ... అని గీత బోధిస్తుంది.
అటువంటి ఆహారం మనిషి జీవనానికి ఎంతో అవసరం. ఈ కింది సూత్రాలను గమనించగలరు..
* ఆహారం వండిన వెంటనే భుజించాలి.
* నిలువ పెట్టిన ఆహారం మంచిది కాదు.
* Fridge లో చలువబెట్టిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తినడం పనికిరాదు. అది పర్ష్వహితము.. అంటే విషం తో సమానము.
* హితభుక్ - అంటే మనకు హితమైన ఆహారమే తినాలి.
* మితభుక్ - అంటే మితమైన ఆహారమే తినాలి.
* ఋతభుక్ - ఆయా ఋతువులో సేవించదగిన ఆహారం మాత్రమే తీసుకోవాలి.
* కడుపులో సగభాగం వరకే ఆహారాన్ని తీసుకోవాలి.
* భోజనానికి ముందు గాని తరువాత గాని Ice creams తీసుకోరాదు.
* ఉడకబెట్టిన ఆహారం మంచిది.
* Deep fried పదార్థాల వల్ల అజీర్ణం కలుగుతుంది.
* మాంసాహారం తామసగుణాన్ని పెంచుతుంది.
* ఆకుకూరలు, కాయగూరలు వల్ల సాత్విక గుణం కలుగుతుంది.