Sudhakar Medicals R.S Rangapuram

Sudhakar Medicals    R.S Rangapuram Sudhakar pharmacy(medicals) is meant for the service for people who are in need of medical care. As we are providing both hospital and pharmacy its easier.

All Medicines Available.

25/05/2024
21/04/2020

*‌మే 3 తరువాత లాక్డౌన్ తీసేస్తారు అని చంకలు గుద్దుకోవాల్సిన పనిలేదు...ఎందుకంటే అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఇప్పటిదాకా ఇంట్లోనే ఉండండి బాబులు, అమ్మలూ అంటూ గడ్డం పుచ్చుకుని బ్రతిమిలాడి చాలావరకూ మన ప్రధాని గారు దేశాన్ని కాపాడగలిగారు. కానీ మే 3 తర్వాత మనల్ని మనమే పరిరక్షించుకోవాలి. ఒక్కసారి ఇంటినుండి అడుగు బైట పెడితే ప్రతీదీ సమస్యే. ఎలాగంటారా?*
‌ *ఆటో ఎక్కాలంటే అనుమానం ఎందుకంటే ఆ ఆటోలో ఇంతకుముందు ఎవరెవరో ప్రయాణం చేసి ఉండచ్చు, వారిలో వారికి తెలికుండానే కరోనా పాజిటివ్ ఉండి ఉండచ్చు. కరోనా ఉరికే ఉండదుగా..ఎక్కిన ప్రతివారితో నవ్వుకుంటూ వాళ్ళింటికెళ్లిపోతుంది , అసలే కలుపుగోలుతనం ఎక్కువ మన కరోనాకి..ఇంట్లో అందరినీ పలకరించేస్తుంది. ఇక కరోనా నేనున్నాను మీ ఇంట్లో అని చెప్పేటప్పటికే అది సాధ్యమైనంతమందిని కవర్ చేసేస్తుంది.*

‌ *సరే మాకు కారుంది.. మేము మార్గదర్శి లో చేరాం..కారు కొనుక్కున్నాం అని స్వంత కారులో షికారుకి పోయారా...ఇక్కడా సమస్యే. అదెలా అంటారా...కారెక్కి మార్కెట్ కో, బంధువుల ఇంటికో లేక స్నేహితుల ఇళ్లకో వెళ్తారు. కారు డోర్ డోర్ హ్యాండిల్ అన్ని ప్రమాద సూచికలే. శానిటైజర్ తో ప్రక్షాళన చేశాకే హ్యాండిల్ కానీ, డోర్ కానీ ముట్టుకోగలం. మళ్ళీ కారు డోర్ మూసాక మన చేతులు శానిటైజర్తో మళ్ళీ ప్రక్షాళన చేసుకోవాలి. సరే..ఈ కార్యక్రమం అంతా పూర్తయ్యాక ఇంట్లోకి వెళ్ళగానే ఆప్యాయంగా ఆలింగనం చేసుకోటాలు, షాకేహాండ్లు గట్రా పొరపాటున కూడా చేయకూడదు. మనం వచ్చిన దగ్గరనుండి మనతో వారు ఫ్రీగా ఉండలేరు ఎందుకంటే కరోనా అంతలా భయపెట్టేసిందిమనల్ని. అదేవిధంగా మనం కూడా వారింట్లో తినాలన్న, తాగాలన్నా భయమే. అంతెందుకు వారింట్లో ఒక పుస్తకం లేదా మంచినీళ్లు గ్లాస్ ముట్టుకోవాలన్నా సంకోచమే..ఇవన్నీ అబద్ధాలు కావండి.. మే 3 తర్వాత మనం ఎదుర్కొనబోయే విపరీతాలు.*

‌ *బైట తిండి తినాలంటే భయం.. ఎవడు చేసాడో, వాడికి జలుబే ఉందో, దగ్గే ఉందో.. ఎవడికి తెలుసు?? లాక్డౌన్ లో కాబట్టి మన కాలనీలకే వచ్చి అమ్మారు కూరగాయలు ఇతర వస్తువులు. కానీ లాక్డౌన్ తర్వాత మనమే వెళ్ళాలి సంతకి.. అక్కడ చూడండి ఇక..సర్వం జగన్నాధం. ఎవరు తాకుతారో తెలీదు, ఎవరు ఉమ్మేస్తున్నారో తెలీదు, కరోనా ఎటువైపునుంది వచ్చి మన చంకనెక్కుతుందో తెలీదు. ఇంటికి వచ్చి స్నానం చేసి, కూరగాయల్ని శుభ్రం చేసుకుని ఎన్ని జాగర్తలు పడ్డా కరోనాని ఆపగలం అనిమాత్రం నమ్మకం లేదు.*
‌ *ఇక ఫంక్షన్లు, గాధరింగ్స్, ఫ్రెండ్స్ మీట్స్, పుట్టింటికి, అత్తగారింటికి అంటూ స్టార్ట్ చేయకండి. ఎన్నాళ్ళయిందో అందరం కలిసి అని తెగ ఆవేశపడిపోయి పరుగులు పెట్టకండి. ఇంకా మనం డేంజర్ జోన్ లొనే ఉన్నాము. నిజంగా మనం మనవాళ్ల మేలు కోరుకుంటే వారిని కలవటానికి ఇంకొన్నాళ్లు వేచి ఉండండి. ఎందుకంటే ఇప్పటిదాకా మనము ఎవరి ఇంట్లో వారు ఉంటూ సామాజిక దూరాన్ని పాటించటం అలవాటు చేసుకున్నాము. ఈ లాక్డౌన్ అనేది ఇంకా పొడిగించటం అనేది సాధ్యపడదు కనుక ఇప్పుడు మనం జనం లో ఉన్నా సామాజిక దూరం పాటించటం వల్ల మాత్రమే ఈ విపత్తు ను ఎదుర్కొనగలం.*
‌ *ఇప్పటిదాకా బైటికి వెళ్తే పోలీసులు కొడుతున్నారు అని పోలీసుల మీద జోకులు, ఫైరింగులు వేసింది చాలు, ఎందుకంటే ఇప్పుడిక ఆ జోకులన్నీ మనమీద మనమే వేసుకునే పరిస్థితి. ఇప్పటిదాకా మనల్ని వారు రక్షించారు. ఇప్పుడు మనల్ని, మన కుటుంబాన్ని మనమే రక్షించుకోవాలి అత్యవసరం అయితే తప్ప బైటికి వెళ్లకూడదు. సామాజిక దూరం పాటించటం తప్ప వేరే మార్గమే లేదు.*
*‌దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా లాక్డౌన్ ఎత్తివేసినా మనం మాత్రం మన పరిధిలోనే ఉండాలి.*
*కరోనా బారిన పడి అగ్ర దేశాలు ఈనాడు మట్టికొట్టుకు పోతున్నాయి. మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారి దూరదృష్టి పుణ్యమా అని మనదేశంలో ఈమాత్రమైనా బ్రతకగలుగుతున్నాము. ఇకముందు కూడా ఇదే సహకారం, సంకల్పంతో మన దేశాన్ని, మనల్ని కాపాడుకుందాం. పోలీసులు, డాక్టర్లు, మునిసిపాలిటీ వర్కర్స్ అందరూ మనల్ని తమ రక్షణ కవచాలతో రక్షించారు.వారి ఋణం తీర్చలేనిది. వారి ఋణపడటం మాట అటుంచితే ఇక వారిని కష్ట పెట్టకూడదు. వారు తమ కుటుంబాలకు దూరంగా ఉండి, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంతో సేవ చేసి ఎన్నో ప్రాణాలను రక్షించిన త్యాగధనులు. ఇక వారి బాధ్యత కూడా మనదే. జగమంత కుటుంబం మనది. అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి అనే దృఢ సంకల్పంతో మరికొన్నాళ్లు, ఈ విపత్తును పూర్తి స్థాయిలో రూపుమాపేవరకు అందరం శ్రమిద్దాం. మనల్ని మనమే కాపాడుకుందాం.

మన రంగాపురం లో  డాక్టర్లు ప్రతి శనివారము చిన్న పిల్లల (pediatric)డాక్టర్లు, అలాగే  పంటి (Dentist) సంబంధించి అన్ని వ్యాధు...
18/02/2020

మన రంగాపురం లో డాక్టర్లు

ప్రతి శనివారము చిన్న పిల్లల (pediatric)డాక్టర్లు, అలాగే పంటి (Dentist) సంబంధించి అన్ని వ్యాధులకు డాక్టర్లు అందుబాటులో ఉందురు.
స్టేట్ బ్యాంక్ పక్కన
సుధాకర్ మేడికల్ & జనరల్ స్టోర్. R.S. రంగాపురం.
cell 9440165172
9182248836.
దయచేసి షేర్ చేయండి....

22/08/2019

*యూరిన్ కు వెళ్లి నప్పుడు నొప్పి మంట కు కల కారణం ఏమిటి నివారణ నవీన్ సలహాలు అవగాహనా కోసం*
*Urinal infections

ఈ నాటి రోజుల్లో చాలా మంది urinal infectionsతో బాధ పడుతూ వున్నారు. అస్తమానం జ్వరంవచ్చి పోతుంటే ,ఒళ్ళు వెచ్చబడి తగ్గుతూ వుంటేఅది urinary infection కి ఒక సంకేతం . .మూత్రంకి వెళ్ళినప్పుడు మంట గా ను ,దురద గా ను అనిపిస్తూ వుంటుంది . బొట్లు ,బొట్లు గా వస్తూవుంటుంది .కొంతమందికి లోపల urinary track,లోను ,కొంతమందికి bowl అంటేమూత్రాశయం లోను అలా రక రకా లు గా వస్తూవుంటుంది .కొంతమందికి ఇవి ఎమీ కనిపించకుండామూత్రములో నురుగు కొంచం కనిపిస్తూ వుంటుంది.ఇంకా కొంతమందికి urine చాలా smell గావుంటుంది . ఇంకా కొంతమందికి రహస్యాంగంములో దురద కూడా వుంటుంది . ఆడవారికితెల్లబట్ట రూపములో ఈ infection లక్షణాలుకనిపిస్తూఉంటాయి .ఏదిఏమైనా ఈ infectionఎక్కువ కాలం వుంటే అవయవాలు దెబ్బ తింటాయి .కాబట్టి infection ఏదైనా త్వరగావదిలించుకోవడం ఉత్తమం

. కొన్ని సార్లు షుగర్ పేషెంట్ లక్షణాలకు దగ్గరలోఉంటాయి ,అంత మాత్రం చేత షుగర్ అనిభయపడగూడదు . ముందుగా పురుషులలోచూద్దాం .మనం పైన చెప్పుకున్న లక్షణాలలో కొన్నివుండి జననాంగం దురద వుండటం ఒకరకం ,పైలక్షణాలు ఏమి లేకుండా ఒక్క సమస్య అంగందురద గా ఉంటూ వుంటుంది .అప్పుడు
*కొబ్బరినూనె ను అంగం పైన ,లోపల ముందు భాగములోబాగా పూత గా పూర్వ కాలములో పెద్దవాళ్ళురాయుంచే వారు. అలా రెండు లేక మూడు రోజులురాసుకోంటే చాలు* .ఆ చిన్న చిట్కా తో నయం అయుపోతుంది . ఇది అంగం శుభ్రత లోపించడం వల్ల, urine పాస్ చేసిన తరువాత నీటి తో శుభ్రపరచుకోవాలి . సోప్ తో చేతులు కడుక్కోవాలి,కనీసం స్నానం చేసేటప్పుడు అయునా చేసుకోవాలి.

కొంతమందికి మగ లేక ఆడ వారిలో యురిన్ పాస్చేసి రాగానే అంగం మంట గా వుండటం ,లోపలకొంచం నొప్పిగ అన్పించడం జరుగుతూ వుంటుంది .ఇది బాగా ఒ౦ ట్లో వేడి ఎక్కువగా చేయటం వల్లవస్తూవు౦టూ౦ ది .(overheat) .అయుతే *
*నీరుబాగా త్రాగాలి .కాస్తంత పంచదార నీటిలో వేసుకొనిత్రాగాలి లేక నిమ్మకాయ షర్బత్ తీసుకొంటే కూడాతగ్గిపోతుంది .లేక పెరుగు లో కాస్త౦ త పంచదారవేసుకొని తినాలి* .అయుతే .షుగర్ పేషెంట్లకు ఇదిపడదు కదా అందుకే పడుకొని బొడ్డులో ముగ్గుపోసుకొని నీటి తో తడపాలి బాగా పలుచగా,బురదలా చేసుకొని కొద్ది సేపు వుంచుకోవాలి,ముగ్గు దొరక్కపోతే ఓ గుడ్డ (cloth ) తీసుకొని,బాగా తడిపి కొద్దిగా మడతపెట్టి ,మందముగాబొడ్డు పైన వేసుకోవాలి .అలా ఆ ప్రదేశం అంతాచల్లగా అయు కూడా సమస్య తగ్గిపోతుంది ,లేదాకొన్ని మంచు ముక్కలు తీసుకొని ice bag లో వేసిబొడ్డు పైనా ,లివర్ వుండే ప్రదేశములో కాపడంపెట్టుకోవాలి ,లేక భోజనం ప్రారంభములో తొలిముద్ద లో కాస్తంత నెయ్యి,కొంచం పంచదార వేసితినాలి .షుగర్ వున్న వాళ్ళు కొద్దిగా పంచదారవేసుకోవాలి .ఇవి పెద్దలు పూర్వ కాలములో వాడేచిట్కాలు ,వీటి వాల్ల sideeffects రావు .

ఇక infection లో పల వున్న వాళ్ళు ,పైనచెప్పుకున్నట్లు గా లక్షణాలు కనిపిస్తే ఆయుర్వేదంలో
*చంద్రప్రభావటి(chandraprabhavati) అనేటాబ్లెట్ వాడతారు* .అది ఒక డబ్బా వాడాలి .రోజూ– 1 సమస్య ఎక్కువగా వుంటే ఉదయం -1, రాత్రి-1 వేసుకోవాల్సి వుంటుంది ,ఇది safedrug . ఇకవిదేశాలలో అయుతే ఈ infection వస్తే వాళ్ళుఅస్సలు ఏ మందు వాడరు మీకు తెలుస్సా ?అక్కడ natural గా సమస్యను తగ్గిస్తారు .ఎలాఅంటే బాగుగా నీరు త్రాగమంటారు .ఎక్కువగా నీరుత్రాగి ఎక్కువసార్లు baathroom కి వెళ్ళమంటారు.అలా చేయడం వల్ల natural గా urinal infectionపోతుంది .

ఇక గృహ వైద్యములో అయుతే ఇలా చేయండి .శరీరములో ఎక్కడ infecti on వచ్చినా సరే ఒకపని చేయవచ్చు ,అది ఏమిటంటే
*దానిమ్మ చెట్టుబెరడు అంటే పచ్చి చెక్క కొద్దిగా ,మరియు దానిలోదానిమ్మ కాయ పండు లేదా పచ్చిది పైన వుండేపొట్టు అదే డిప్పలు ఈ మొత్తం కాస్తంత ఎక్కువతీసుకొని ,కొంచం ఎక్కువ నీరు పోసి బాగా ఇగరపెట్టాలి అది ఇగిరి ఓ గ్లాసెడు చిక్క్గగా అయునతరువాత వడ కట్టుకోవాలి . పర కడుపునా అంటేEMPTYSTOMACH లో కొద్ది కొద్ది గా తీసుకోవాలిఓ కొద్ది సార్లు అలా చేయాలి ,అది దాచుకొని రాత్రికూడా చేసుకోవచ్చు ,అలానే మరుసటిరోజుఉదయం అలానే అలా మీకు వున్న INFECTIONవున్న తీవ్రత పట్టి కొన్ని రోజులు చేసుకోవాలి .ఈకషాయం వల్ల sideeffects ఎమీ వుండవు .కొద్దికొద్ది గ రోజూ తయారు చేసుకొంటే మంచిది* .ఇక శరీరములో ఎక్కడ infection వున్నా సరేచచ్చిపోతుంది .లోపల లివర్,ప్రేవులు కిడ్నిస్ఎక్కడైనా సరే .ఇక లోపల వచ్చే infecti onఒక్కొకసారి , మనం ఆచరించే శుభ్రత తో సంభంధంలేదు ,లోపల జరిగే జీవక్రియల వాల్ల ,కొన్నిసార్లువిషాలు ,అదే టాక్సిన్స్ రిలీజ్ అవటం వల్ల కూడాలోలోపల infection లు వస్తూ ఉంటాయి . ఇకఇంకా ఈ కషాయం వలన పిల్లలకు కానీ పెద్దలకుకానీ కడుపులో వున్న అన్ని రకాల పురుగులు,ఏలికపాములు,వార్మ్స్ అన్నీ చస్తాయు .

అయుతే పిల్లలకు కషాయం డోస్ తగ్గించి ఇవ్వాలి.వాళ్లకు రోజూ
*ఉదయం 2 లేక 3 spoon లుత్రాగించవచ్చు.మరీ చిన్నపిల్లలు అయుతే డ్రాప్స్నోట్లో వేస్తె చాలు* .ఇది గృహ వైద్యం . ఉదయంవేళల్లో వేప చివుళ్ళు కొద్దిగా రోజూ తిన్నా కూడానులిపురుగులు చస్తాయు . రక్తం కూడాశుభ్ర పడిచక్కగ ,ఎర్రగా మెరుస్తుంది.చర్మం లోని రోగాలుపోతాయి .కానీ అదే పని గా తింటే వేడి చేస్తుంది.ఏదైనా అతి చేయకూడదు .అదే
*ఆయుర్వేదములో అయుతే సురక్తా అనే టానిక్కుకొనుక్కుని త్రాగినా కూడా చర్మం ,రక్తం శుభ్రపడతాయి*
అయుతే గంధ కి సోదక్ అనే sulpherకలిసిన ఆయుర్ వేదం టాబ్లెట్స్ తో కలిపివేసుకోవాలి .1 tab కి 2 మూతలు ఆ సిరప్ తోవేసుకుంటారు .

ఇక హోమియో లో sulpher 25౦ పవర్ ఇస్తూవుంటారు కొన్ని సార్లు . ఇక కొంతమందికి మధ్యవయస్సు లో అన్ని రకాల గా infection మందులువాడినా కూడా దురద ,మంట తగ్గక పొతే షుగర్టెస్ట్ లు చేయుం చుకోవాలి .

ఇక కొంత మందికి sugar వాళ్ళు infection వుండి,urinaryproblems తో బాధ పడుతూspremcount తక్కువ గా అయుపోతు న్నవాళ్ళుbaidyanath వారి Tarkeswara ras tabletsవాడితే అన్నిటికి పరిష్కారం దొరుకుతుంది . అలానేషుగర్ వాళ్ళ కు నోరు ఎండిపోవడం ,గొంతుఎండిపోవడం urinary infection ,నీరు అస్తమానంత్రాగాలని అనిపించే విపరీతమైన దాహం , అధికమూత్రం ,అస్తమానం వెళ్లాలని అనిపించడం వీటిఅన్ని౦ టికి ఒకే ఒక్క టానిక్కుJambavasavaadiదీనిని రొజూ లోపలికి తీసుకొంటూ వుంటే చాలాబాగా పని చేస్తుంది .పైవి అన్నియు ఆడ మగ ఇద్దరువాడవచ్చు.

*ధన్యవాదములు🙏*


*సభ్యులకు విజ్ఞప్తి*
******************
మన గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

22/08/2019

*ఛాతీలో మంట అనగా ఏమిటి? దానిని నివారించటం లేదా తగ్గించుకోవటం అవగాహనా కోసం *

ఛాతీలో మంట (Heartburn) దీనినే అసిడిటీ (acidity) లేదా ఆసిడ్ రిఫ్లెక్స్ (acid reflux) అని కూడా చెప్పవచ్చు. ఈ సమస్య ఉన్నవారు ఆహారం తీసుకున్న తర్వాత చాలా సమయం వరకు ఛాతీలో మంటగా ఉంటుంది, పుల్లటి త్రేన్పులు ఎక్కువగా వస్తుంటాయి మరియు గొంతులో అసౌకర్యంగా ఉంటుంది. (Heartburn) ఛాతీలో మంటకి గుండెకి సంబంధం లేదు, ఇది గుండె సంబంధ వ్యాధి కాదు. ఈ పరుగుల ప్రపంచంలో ఇంటి భోజనం తినడం రోజు అందరికీ కుదరదు అలాంటపుడు అందుబాటులో ఉన్న హోటల్స్ లోనో కాంటీన్లలో తింటారు. ఇలా బయట ఆహారం తినటం, సమయానికి భోజనం తినకుండా చిరుతిళ్ళు తినటం, సోడా వంటి పానీయాలు త్రాగటం, రోజు కాఫీ త్రాగటం లాంటి అలవాట్లు ఛాతీలో మంటకు కారణం
*👉🏿అసిడిటీ ఉన్నవారిలో కనిపించే లక్షణాలు:*

పొట్ట పైభాగం నుండి గొంతులోకి అసౌకర్యం, మంటగా ఉంటుంది. ఇది ముఖ్య లక్షణం.

గొంతు మరియు నోరు పుల్లగా మారటం.

కొన్నిసార్లు దీని వలన దంతాలు కూడా రంగు మారతాయి.

త్రేన్పులు రావటం, ఏమి తినకపోయినా త్రేన్పులు వస్తూ ఉంటాయి.

పొట్ట ఉబ్బరంగా ఉండటం అంటే లోపల గ్యాస్ చేరి పొట్ట లావుగా ఉబ్బినట్టు ఉంటుంది.

ఆహారం తిన్న తర్వాత వికారంగా అనిపించటం.

తిన్న పదార్ధాలు బయటకి వస్తునట్టు అనిపించటం.

పొట్ట పైభాగంలో నొప్పి రావచ్చు.

ఛాతీలో మంటగా అనిపిస్తుంది.

మింగటానికి ఇబ్బందిగా ఉంటుంది.

గొంతులో పుండు ఉనట్టు లేదా గొంతులో గరగర అనిపిస్తుంది.

పొడి దగ్గు వస్తుంది.

ఈ అసిడిటీ లేదా ఛాతీలో మంట అప్పుడప్పుడు వస్తుంటే ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ ఒక వారానికి రెండు సార్లు కంటే ఎక్కువగా వస్తుంటే వైద్యుని సంప్రదించాలి. మందులతో అదుపులోకి వస్తుంది. చాలా అరుదుగా కడుపులో పుండ్లు వచ్చి కాన్సర్ వ్యాధికి దారి తీయవచ్చు. అందరికీ ఇలా జరగదు అని గమనించాలి.

*👉🏿ఛాతీలో మంటకి గుండె నొప్పికి తేడా ఏంటి?*

ఛాతీలో మంట అనేది కడుపులో నుండి మొదలై గొంతులోకి వస్తుంది, పుల్లటి త్రేన్పులు రావటం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. గుండెలో నొప్పి పొట్ట పైభాగంలో ఎడమ పక్కన మొదలవుతుంది. అది మెడ భుజం వరకు కూడా పాకవచ్చు. ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉండవచ్చు. ఇవి గుండె నొప్పి లక్షణాలు. మీకు రెండిటికి తేడా తెలియనపుడు వైద్యుని కలవటం శ్రేయస్కరం.

*👉🏿చికిత్స:*

మందులు వాడటం వలన ఈ అసిడిటీ సమస్య అదుపులో ఉంటుంది. ఒకవేళ మందులకి తగ్గకపోతే ఆపరేషన్ చేసి ఆమ్లాలు అన్నవాహికలోకి రాకుండా చేస్తారు. దాని వలన ఉపశమనం లభిస్తుంది.

*👉🏿అసిడిటీ తగ్గటానికి సహజ మార్గాలు*:

అసిడిటీ తగ్గటానికి చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే రోజు వాటిని వాడటం వలన వేరే ఇబ్బందులు తలెత్తవచ్చు. మరి సహజంగా ఛాతీలో మంటని తగ్గించుకోవటం సాధ్యమేనా. అవును చాలా పద్ధతులు ఉన్నాయి సహజంగా చేసుకోదగినవి. వీటిలో కొన్ని చిట్కాలు మనం తెలుసుకుందాం

యాలుకలు – మీరు అసిడిటీ సమస్య తగ్గాలంటే ఇంట్లో చేసుకోగల ఉపాయం ఇది. రెండు లేదా మూడు యాలుకలు మెత్తగా దంచి ఒక గ్లాస్ నీటిలో కలిపి మరిగించాలి. దీన్ని తాగటం వలన ఛాతీలో మంట నుండి ఉపశమనం లభిస్తుంది.

ఇంట్లో ఉండే వాము, ఆవు నెయ్యి మరియు కండ చెక్కెర కలిపి ఒక చక్కటి ఔషధం తయారు చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం ఒక 100 గ్రాములు వాము తీసుకుని దోరగా వేయించి పొడి చేసుకోవాలి. తర్వాత 100 గ్రాములు కండ చెక్కెర కూడా మెత్తగా పొడి చెయ్యాలి. ఈ రెండిటిని తీసుకుని మరిగించిన 100 గ్రాములు ఆవు నెయ్యిలో కలిపాలి. చల్లారాక ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోండి. రెండు పూటల భోజనానికి ఒక గంట ముందు దీన్నిఒక చెంచా తీసుకోవాలి. ఇలా చేస్తే అసిడిటీ అదుపులో ఉంటుంది. మెల్లమెల్లగా సమస్య తగ్గిపోతుంది. అందరూ సులభంగా ఇంట్లో చేసుకోవచ్చు. ప్రయత్నించి అసిడిటీ సమస్య నుండి విముక్తి పొందండి.

నిమ్మకాయ, నల్ల ఉప్పు (బblack salt), జీలకర్ర పొడి, పసుపు వాడి అసిడిటీ ఎలా తగ్గించాలో చూద్దాం. ముందుగా ఒక నిమ్మకాయని కోసి సగం ముక్కని తీసుకుని పొయ్యి మీద కాల్చాలి. 30 సెకండ్స్ సమయం పట్టచ్చు.తర్వాత దీనికి పసుపు, నల్ల ఉప్పు, జీర పొడి పట్టించాలి. ఇప్పుడు ఈ నిమ్మకాయని తినాలి. నిమ్మకాయ సరిపడని వారు తినవద్దు. ఇలా చెయ్యటం వలన వెంటనే అసిడిటీ నుండి ఉపశమనం కలుగుతుంది. చేసుకోవటం కూడా చాలా సులభం.

ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో పసుపు కొంచెం ఉప్పు కలిపి తాగాలి. దీని వలన ఛాతీలో మంట త్వరగా తగ్గుతుంది.అధిక రక్త పోటు ఉన్నవారు దీన్ని రోజు తాగకూడదు.

భోజనం తర్వాత ఒక అర గ్లాస్ నీటిలో కొంచెం వాము పొడి మరియు నల్ల ఉప్పు కలిపి తాగటం వలన వెంటనే అసిడిటీ నుండి ఉపశమనం ఉంటుంది లేదా అసిడిటీ రాకుండా చేస్తుంది.

లవంగాలు – లవంగాలు పొడి దగ్గునే కాదు, ఛాతీలో మంటని కూడా తగ్గిస్తాయి. రెండు లేదా మూడు లవంగాలు నోట్లోనే ఉంచి చప్పరించాలి. ఆ రసం మింగేయాలి. దీని వలన అసిడిటీ తగ్గుతుంది. ఇది చాలా సులభ మార్గం. ఇంట్లోనే కాదు, బయట ఉన్నా కూడా చేయవచ్చు. ఉద్యోగస్తులు కూడా సులభంగా ఆచరించవచ్చు. మీతో పాటు ఎప్పుడూ కొన్ని లవంగాలు బాగ్ లో ఉంచుకోండి.

తులసి ఆకులు – ప్రతి ఇంట్లో తులసి మొక్కలు విరివిగా ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఛాతీలో మంట మొదలవగానే ఆరు లేదా ఏడు తులసి ఆకులు నమిలి తినేయాలి. బాగా ఉపశమనం ఉంటుంది. ఇది కష్టము కాదు ఖర్చు లేదు. పైగా ఎటువంటి ఇబ్బందులు రావు.

జీలకర్రని నూరి పెట్టుకోవాలి. భోజనానికి ముందు ఇది ఒక చెంచా తిని అర గ్లాస్ నీరు తాగితే అసిడిటీ రాదు. జీలకర్ర ఆహారం జీర్ణం అవటంలో కూడా దోహదపడుతుంది.

*నివారణ మార్గాలు:*

మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పదార్ధాలు తినకూడదు.

భోజనంలో అధిక శాతం కూరగాయలు రోజు ఉండేలా చూసుకోవాలి. ప్యాక్ చేసిన ఆహార పదార్ధాలు ఏవైనా ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది ఆరోగ్యానికి.

ఆహారం ఒకేసారి ఎక్కువగా తినకుండా కొంచెం కొంచెంగా తినాలి. అపుడు ఈ సమస్య అదుపులో ఉంటుంది.

*👉🏿పొగ త్రాగటం* మానివేయాలి. లేదంటే ఈ సమస్య అలాగే కొనసాగుతుంది.

*👉🏿ఊబకాయం* మరొక ముఖ్య కారణం. బరువు తగ్గటం వలన అసిడిటీ కూడా తగ్గుతుంది. చాలా సమస్యలకు బరువు తగ్గటం అనేది అవసరం.

మద్యపానం తాగటం మానివేయాలి లేదంటే అసిడిటీ తీవ్రత ఎక్కువ అవచ్చు.

సమయ పాలన లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం తినకూడదు.

ఘాటైన మసాలా పదార్ధాలు తినటం తగ్గించాలి. ఇవి పుల్లటి త్రేన్పులు మరియు మంట కలగజేస్తాయి.

వేపుడు కూరలు ఎక్కువగా తినకుండా ఉంటే మంచిది.

పొట్టకి సంబందించిన కొన్ని రకాల వ్యాయామాలు చేసేటపుడు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వాటి వలన అసిడిటీ ఎక్కువ అవచ్చు. అందువలన మీకు తగినట్టు వ్యాయామాలు చేసుకోవాలీ
*ధన్యవాదములు🙏*
*సభ్యులకు విజ్ఞప్తి*

మన గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

Address

R. S. RANGAPURAM, BUSTAND. BETHAMCHERLA MANDAL
Kurnool
518002

Opening Hours

Monday 8am - 9:30pm
Tuesday 8am - 9:30pm
Wednesday 8am - 9:30pm
Thursday 8am - 9:30pm
Friday 8am - 9:30pm
Saturday 8am - 9:30pm
Sunday 8am - 9:30pm

Telephone

9440165172

Website

Alerts

Be the first to know and let us send you an email when Sudhakar Medicals R.S Rangapuram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram