13/08/2021
కీళ్ల నొప్పులు.... హోమియో వైద్యం
మన సొంత కాళ్లపై నిలబడాలంటే ముందుగా సొంత కీళ్ల మీద నిలబడాలి. మనిషి శరీరాన్ని మోయడానికి చేతులు కాళ్ళు కదిలించడానికి కి ముందుకి వెనక్కి కదలడానికి ఉపకరించేవి కీళ్లే.
రెండు ఎముకలను కలిపే చోటును కీలు అంటారు. ప్రతి కీలు చుట్టూ కార్టిలేజ్ పొర ఉంటుంది. ఎముక చుట్టూ ఉండే ఈ కార్టిలేజ్ పొర అరగడం వలన కీళ్ల నొప్పి వస్తుంది. వయసుతోపాటు కీళ్లు అరిగే సమస్యను ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు.
కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి....?
సాధారణంగా ఎముకలు కలిసే అన్ని చోట్ల కీళ్లు ఉన్నా మనల్ని నిలబెట్టేది మన కదలికలకు సహాయపడేది మోకాళ్లు. కాబట్టి కీళ్ళనొప్పులు అనగానే ముందుగా మోకాలి నొప్పులు గుర్తొస్తాయి. రెండు ఎముకలు కలిసే చోట మెత్తటి కార్టిలేజ్ ఉంటుంది. ఇది ఇది ఎముకలు దానికొకటి రాపిడికి గురి కాకుండా కాపాడుతుంది. ఎప్పుడైతే ఈ కార్టిలేజ్ అరగడం జరుగుతుందో ఎముకలు పరస్పరం రాపిడికి గురై నొప్పి వస్తుంది. ఇలా వచ్చే నొప్పులను ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇది ముఖ్యంగా వయసు పైబడినవారిలో లో గమనిస్తాము.
ఆర్థరైటిస్ లక్షణాలు:-
ఆర్థరైటిస్ లక్షణాలు ముఖ్యంగా గా 3 దశలుగా విభజించవచ్చు
మొదటి దశ: ఆర్థరైటిస్ తొలిదశలో కాళ్లు బరువెక్కి నట్టుగా బిగుసుకుపోయినట్లుగా ఉంటాయి. కట్టెలా అయిపోయి ముడుచుకోవ డానికి వీలు లేనట్లుగా అనిపిస్తాయి. ఆర్థరైటిస్ కి ఇది మొదటి సంకేతం.
రెండో దశ: ఈ ఈ దశలో కీళ్ల దగ్గర వాపు వస్తుంది. మెట్లు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు తట్టుకోలేనంత బాధ ఉంటుంది. కింద కూర్చొని లేచేటప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది.
మూడవ దశ: ఎముకలు రాసుకున్నట్టు గా శబ్దం వస్తుంది. ఎముకల చివరన ఆస్టియోఫైట్స్ ఏర్పడతాయి దీనివల్ల లిగమెంట్స్ దెబ్బతింటాయి దాంతో మోకాలు దెబ్బతింటుంది.
ఆస్టియో ఆర్థరైటిస్ నిర్ధారణ:
ఎక్స్రే పరీక్ష ద్వారా దీనిని నిర్ధారించవచ్చు ముఖ్యంగా ఎక్స్రేలో ఎముకల మధ్య ఖాళీ తగ్గడం కీలు చివరలో కొత్త ఎముక వంటి నిర్మాణాలు ఆస్టియోఫైట్స్ ఏర్పడతాయి.
ఆర్థరైటిస్ నివారణకు జాగ్రత్తలు:
అధిక బరువు లేకుండా చూసుకోవాలి.
1.మఠం వేసుకుని నేల మీద కూర్చోకుండా కోవాలి.
2.బ్రీతింగ్ ఎక్సర్సైజులు స్ట్రెచింగ్ ఎక్సర్సైజుల వలన ఎముక చివరన ఉండే కార్టిలేజ్ ఆరోగ్యం బాగుంటుంది. 3.ఎక్కువ సమయం నిల్చోవడం తగ్గించాలి .
4.పదే పదే మెట్లు ఎక్కడం దిగడం తగ్గించాలి మోకాలు నొప్పి లేనంతవరకూ నడవడం మంచిది
5.ఫిజియోథెరపీ కూడా కొంతవరకు ఉపకరిస్తుంది .
ఆర్థరైటిస్ కి హోమియో వైద్యం:
హోమియోపతి దీర్ఘకాలిక కీళ్ల సమస్యలకు చక్కని పరిష్కారం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ వైద్య విధానం ద్వారా ఎముకల పటుత్వం పెరగడంతోపాటు కీళ్లలో వచ్చే అసాధారణ మార్పులను నియమిత కాలంలో సరిచేయవచ్చు . సాధారణంగా రుస్ టాక్స్ , బ్రయోనియా, అర్జంటం మెట్. ఆరమ్, కాల్కేరియాకార్బ్, కాల్కేరియా ఫ్లోర్, పల్సటిల్లా, ఫెర్రంమెట్, నేట్రం మూరు, లైకో పోడియం మరియు ఇతర మందులను సారూప్య లక్షణాల ఆధారంగా ఇవ్వడం ద్వారా నయం చేయవచ్చు. పై మందులను హోమియో వైద్యనిపుణుల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.