KMR Universal hospital

KMR Universal hospital Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from KMR Universal hospital, Hospital, Nandigama.

24*7 emergency care services with 100 bed capacity, with all multy speciality hospital services, Lever, Gynic, paediatric, Ortho, ENT, General Medicine, Radiology, and Dental specialities.

*Important health service*... Forward to needy 🙏🙏🙏మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ నమస్కారం,మేము కెఎంఆర్ యూనివర్సల్ హాస్ప...
24/11/2021

*Important health service*...
Forward to needy 🙏🙏🙏
మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ నమస్కారం,
మేము కెఎంఆర్ యూనివర్సల్ హాస్పిటల్ నందిగామ లో KMR DIAGNOSTICS unit ను ప్రారంభించాము ... CT scan Hitachi 64 slice CT unit ను ప్రారంభించిన సందర్భంగా... Introductory offer క్రింద CT angio, contrast, plain CT లను upto 50% concession తో నవంబర్ 30 వ తేదీ వరకు ఈ ప్రారంభోత్సవ ఆఫర్ వినియోగించుకొనగలరు ... కావునా అవసరం ఉన్న వారు సద్వినియోగం చేసుకోగలరు... వివరాలకు సంప్రదించండి
KMR DIAGNOSTICS,
KMR UNIVERSAL HOSPITAL,
రైతు పేట, నందిగామ
ఫోన్ - 7888914449

03/10/2021
Important information about heart deceases: Don't miss...*గుండె వ్యాధి ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు* అథెరోస్క్లెరోటిక్...
02/10/2021

Important information about heart deceases: Don't miss...
*గుండె వ్యాధి ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు*
అథెరోస్క్లెరోటిక్ (రక్త నాళాలు ఇరుకై, రక్తప్రసరణను అడ్డుకునే పరిస్థితి) వ్యాధికి సంబంధించిన లక్షణాలు.
ఛాతీలో గట్టిదనం లేదా పట్టేసినట్లుండడం, నొప్పి (పురుషుల్లో ఇది సాధారణం) మరియు
అసౌకర్యం (మహిళల్లో ఇది సాధారణం). శ్వాసలోపం.
• దవడ, మెడ, వెనుక మరియు దిగువ ఉదరం వరకు వెలువడే ఛాతీ నొప్పి
• చేతులు మరియు కాళ్ళలో తిమ్మిరి, నొప్పి మరియు బలహీనత

*అరిథ్మియాలకు సంబంధించిన లక్షణాలు.* హృదయంలో దడతో కూడిన గందరగోళకరమైన వేదన
• గుండె దడ తీవ్రమవడం మరియు మైకము. టాచీకార్డియా (వేగవంతమైన హృదయ స్పందన రేటు). బ్రాడీకార్డియా (నెమ్మదిగా ఉండే గుండె స్పందన రేటు). .
• ఊపిరాడకపోయే పరిస్థితి. గుండె లోపాలు లేదా గుండె వైఫల్యాలకు సంబందించిన లక్షణాలు
• శిశువుల్లో పాలిపోయి, నీలి రంగులోనికి మారిన చర్మం రంగు. శిశువుకు ఆహారం తినిపించేటప్పుడు ఊపిరాడని పరిస్థితి ఉండడంవల్ల శిశువు బరువు తగ్గడం సంభవించొచ్చు. తద్వారా శిశువు ఆహారసేవనానికి విముఖత చూపుతూ ఉంటుంది.
• చేతులు, కాళ్ళు మరియు కడుపులో వాపు,
వ్యాయామాలు లేదా కొద్దిపాటి శారీరక కార్యకలాపాలకే సులభంగా అలసిపోవచ్చు.

*గుండె సంక్రమణకు సంబందించిన లక్షణాలు కిందివిధంగా ఉంటాయి*
• రాత్రి చెమటలు మరియు చలి పట్టడం,
హార్ట్ మర్మెర్స్ (గుండె లయకు మద్యలో వచ్చే శబ్దం)
పొత్తికడుపు, వేళ్లు మరియు కాలి వేళ్ళలో నొప్పి.
ఛాతీ, పొత్తికడుపు, వేళ్ళు, మరియు కాలి వేళ్లలో నొప్పి...
KMR UNIVERSAL HOSPITAL నందు *కార్డియాలజిస్ట్ డాక్టర్ పృథ్వీ శ్రీనివాస్ MD DNB Cardiology* గారు ప్రతి ఆది వారం (ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5:00 వరకు) మన *KMR UNIVERSAL హాస్పిటల్* నందు అందుబాటులో ఉంటారు... డాక్టర్ గారి సేవలను వినియోగించుకోగలరు.. డాక్టర్ గారి అప్పాయింట్ మెంట్ ఎంతో విలువైనది.. *ముందస్తు అప్పాయింట్ మెంట్* తీసుకోగలరు.. మరిన్ని వివరములకు
*Please Contact*:
*KMR యూనివర్సల్ హాస్పిటల్, NH-65,*
Nandigama,
08678294678

అతి ముఖ్య ఆరోగ్య సమాచారం : గుండెనొప్పి గురించి::గోల్డెన్ అవర్ అంటే ఏమిటి??గోల్డెన్ అవర్ లో ఏమి చేయాలి??గుండె నొప్పి వచ్చ...
01/10/2021

అతి ముఖ్య ఆరోగ్య సమాచారం : గుండెనొప్పి గురించి::
గోల్డెన్ అవర్ అంటే ఏమిటి??
గోల్డెన్ అవర్ లో ఏమి చేయాలి??

గుండె నొప్పి వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు:(ఇటువంటి విషయాలను పంచుకోవాలా అని అనుకోకండి... ఈ చిట్కాలు కొంతమందికి జీవనదానం చేయవచ్చు)very useful and critical information.. read completely and share to your Near & Dear...
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మానవుని జీవితంలో అనేక మార్పులు తెచ్చింది. మానవ జీవన శైలిలో వచ్చిన మార్పులు అందులో భాగమే. అభివృద్ధి చెందిన దేశాల్లోనే కాకుండా అభివృద్ధి చెందుతున్న మన లాంటి దేశాల్లో కూడా ఈ మార్పులు శరవేగంగా వస్తున్నాయి. ఊబకాయం, మధుమేహం, రక్తపోటు లాంటి రుగ్మతలు అధికం కావడానికి మారుతున్న జీవన శైలి కారణమని వైద్యశాస్త్రం ఘోషిస్తోంది. ఈ రుగ్మతలు కలిగిన ప్రజానీకానికి గుండెపోటు ఓ ప్రమాదకరమైన సమస్య. గుండెపోటు చాలా ప్రమాదకరమైనదని మనలో చాలా మందికి తెలుసు. గుండెపోటు వచ్చిన వారిలో సగం మంది గుండె నొప్పి వచ్చిన రెండు గంటల్లోనే చనిపోతున్నారంటే, ఈ వ్యాధి ఎంత ప్రమాదమైందో మనం అర్థం చేసుకోవచ్చు.
నొప్పి వచ్చిన గంటలోపు సరైన ప్రాథమిక వైద్యాన్ని పొందగలిగితే గుండెపోటు వల్ల సంభవించే మరణాలను సగానికి తగ్గించవచ్చు. గుండెపోటు వైద్యంలో అత్యంత కీలకమైన ఈ మొదటి గంట సమయాన్ని ‘గోల్డన్‌ అవర్‌ ఆఫ్‌ ది హార్ట్‌ అటాక్‌’ అంటారు.
గోల్డెన్‌ అవర్‌లో ఏం చేయాలి?
గుండె నొప్పి వచ్చిన వ్యక్తి ‘నేనిక బతకన’ని భావిం చడం సహజం. భయపడేకొద్దీ గుండె కొట్టుకునే వేగం పెరిగి, గుండె నొప్పి తీవ్రత ఎక్కువవుతుంది. అందుకే రోగికి ధైర్యం చెప్పాలి. రోగికి సహకారం అందించే వారు కూడా ధైర్యంగా ఉండాలి.
యాస్ప్రిన్‌ (325 మిల్లీ గ్రాముల) మాత్రను వీలైనంత త్వరగా చప్పరిం చాలి. మింగడం కన్నా ఈ మాత్ర చప్పరించడం వల్ల ఈ మాత్ర ప్రభా వాన్ని త్వరగా పొందగలం. సార్బి ట్రేట్‌ (5 మిల్లీగ్రాములు) మాత్రను నాలుక కింద ఉంచుకోవాలి. యాస్ప్రిన్‌ మాత్రను, సార్బిట్రేట్‌ మాత్రను వీలైనంత త్వరగా తీసుకోగలిగితే గుండెపోటుకు జరిగే అత్యవసర వైద్యంలో సగం వైద్యం పూర్తయినట్లే.
ఈ రెండు మాత్రలూ గుండెకు రక్తప్రసరణ పెంచడంలో ఎంతో ఉప యోగపడతాయి. గుండె కణజాలం దెబ్బతినకుందడా మనల్ని రక్షిస్తాయి. గుండెపోటు వచ్చిన గంట లోపల ఈ మాత్రలను అందుబాటులోకి తెచ్చుకోవడమనన్నదే పెద్ద సమస్య. గుండెపోటు వచ్చినప్పుడు ఈ మాత్రలను వాడాలని తెలిసిన వారే తక్కువ. తెలిసినా ఆ సమయంలో గుర్తుండడం చాలా కష్టం. గుర్తున్నా అందుబాటులో లేకపోవడం సర్వ సాధారణం. నొప్పి వచ్చిన సమయంలో ఆ రోగి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో? ఎంత దూరంలో ఉంటాడో? ఊహించడం చాలా కష్టం. గంట లోపల డాక్టరును కలవడం సాధారణంగా సాధ్యం కాదు.
ఎవరిలో సమస్య ఎక్కువ?
గుండెపోటు అవకాశం ఎక్కువగా ఊబకాయం, రక్తపోటు, మధుమేహం లాంటి వ్యాధులున్న వారిలో ఉంటుంది. ఈ మాత్రలను వీలైనంత అందుబాటులో ఉంచుకోవాలి. వీరికే కాకుండా 40 సంవత్సరాలు పైబడిన వారిలో కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నందున, 40 సంవత్సరాలుపైబడిన ప్రతీ ఒక్కరూ ఈ మాత్రలను అందుబాటులో ఉంచుకోవడం మంచిది. ఈ మాత్రలను అందుబాటులో ఉంచుకోవడానికి ఎవరికి అనుకూలమైన పద్ధతిని వారు వెతుక్కోవడం మేలు. ఒక్క చోటే ఈ మాత్రలను ఉంచుకొనే కన్నా రెండు, మూడు ప్రాంతాల్లో భద్రపరుచు కోవడం మంచిది. జేబులో, డబ్బు దాచుకునే మనీ పర్సులో, చేతి సంచిలో, ఏటిఎం కార్డు భద్రపరుచు కునే పెట్టెలో, ఇంటిలో ఒక నికరమైన ప్రాంతంలో, పనిచేసే ఆఫీసులో, ప్రయాణం చేసేటప్పుడు లగేజీ బ్యాగ్‌లో ఎవరికి అనుకూలమైన పద్ధతిలో వారు అందుబాటులో ఉంచుకోవడం మంచిది.
గుండెనొప్పి అని తెలుసుకోవడం ఎలా?
మాత్రలైతే అందుబాటులో ఉంచుకోగలం గానీ, ఛాతీలో వచ్చిన ప్రతి నొప్పీ గుండె నొప్పి కాదు కదా! అసలైన గుండె నొప్పిని గుర్తించడమెలా అనే అనుమానం ఇప్పటికే వచ్చి ఉంటుంది. ఛాతీలో వచ్చిన ప్రతి నొప్పీ గుండె నొప్పి కాదన్నది వాస్తవమే. జీర్ణాశయం, ఆహార వాహిక పొక్కడం, పుండ్లు పడడం లాంటి సమస్యలున్నా ఛాతీలో నొప్పి ఉంటుంది. దీనినే సాధారణంగా గ్యాస్ట్రిక్‌ సమస్య అంటారు.
గ్యాస్ట్రిక్‌ సమస్య, గుండెపోటు లక్షణాల మధ్య తేడా స్పష్టంగా గుర్తించడం చాలా సందర్భాల్లో డాక్టర్లకు కూడా కష్టమే. ఛాతీలో వచ్చిన నొప్పిని గ్యాస్ట్రిక్‌ సమస్యగా భావించి ప్రమాదానికి గురైన సందర్భాలు కోకొల్లలు. ఛాతీలో చెప్పడానికి సాధ్యం కాని బాధ అనిపించినా, ఛాతీలో నొప్పి వచ్చి మెదడుకు కానీ, ఎడమ చేతికి కాని పాకినట్లు అనిపించినా, నొప్పితో పాటు ముచ్చెమటలు పట్టినా ఆ నొప్పిని గుండెపోటుగా భావించాలి.
ఛాతీలో తీవ్ర స్థాయిలో వచ్చిన ప్రతి నొప్పినీ గుండెపోటుగా భావించి యాస్ప్రిన్‌ మాత్రను వాడితే లాభమే తప్ప, వచ్చే నష్టమేమీ పెద్దగా ఉండదు. వచ్చింది ఒకవేళ గుండెనొప్పి అయితే మాత్ర వాడడం చాలా బాగా ఉపయోగపడు తుంది. వచ్చింది గనక గ్యాస్ట్రిక్‌ సమస్య గనక అయితే ఛాతీ నొప్పి కొద్దిగా పెరుగు తుంది. పెరిగినా అది పెద్ద సమస్య కాదు.
Note: Becautious :: ఈ మాత్రను వాడడం ప్రాథమిక వైద్యమే! యాస్ప్రిన్‌ మాత్రను మింగి వీలైనంత త్వరగా డాక్టరును సంప్రతించాల్సిందే. యాస్ప్రిన్‌ మాత్ర మింగాం. మనకింకేమీ కాదని అనుకోకూడదు. ఇలా యాస్ప్రిన్‌ మనకు తోడుంటే, గుండెపోటు నుంచి తాత్కాలికంగా రక్షణ పొందగలం.Be cautious

గుండె జబ్బు లక్ష్గణాలు::
కొద్దిదూరం నడవగానే ఆయాసం, ఛాతీ ఒక్కోసారి పట్టేసినట్లుగా ఉండటం, చెమట ఎక్కువగా పడుతుండటం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటం ఉంటేగుండె జబ్బుగా అనుమానించాల్సి ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన గుండె జబ్బు ఉందని డీలా పడిపోవడం కూడా సరికాదు. లక్షణాలు ఉన్నా నిర్ధారించుకోవడానికి పరీక్షలు తప్పనిసరి...

గుండెకు సంబంధించి ఏమైనా వాల్వులు పూడుకు పోయినా... బలహీనముగా ఉన్నా.. మనకు 2D Echo పరీక్షలో బయట పడతాయి... డాక్టర్ పృథ్వీ శ్రీనివాస్ MD DNB Cardiology గారు ప్రతి ఆది వారం మన KMR UNIVERSAL నందు అందుబాటులో ఉంటారు... డాక్టర్ గారి అప్పాయింట్ మెంట్ కోసం సంప్రదించండి..
KMR Universal Hospital,
NH-65, Nandigama,
Phone-08678294678
మీ మిత్రులకు అవసరం ఉన్న వారికి షేర్ చేయగలరు::
🙏🙏🙏

*అతి ముఖ్యమైన ఆరోగ్య సమాచారం*:1. అన్ని నడుము నొప్పులు స్పాండిలైటిస్ కాకపోవచ్చు... కానీ నడుము/వెన్ను నొప్పులను సకాలంలో గు...
30/09/2021

*అతి ముఖ్యమైన ఆరోగ్య సమాచారం*:
1. అన్ని నడుము నొప్పులు స్పాండిలైటిస్ కాకపోవచ్చు... కానీ నడుము/వెన్ను నొప్పులను సకాలంలో గుర్తించగలిగితే చాలా వరకు ఆపరేషన్ లేకుండా నివారించవచ్చు..
2. ఎన్నో సంవత్సరాల నుండి ఫిట్స్ / మూర్చ వ్యాధులతో బాధ పడేవారు ఒకే ఒక ట్రీట్ మెంట్ తో న్యూరాలజిస్ట్ నయం చేయవచ్చు...
3. పార్శ్వనొప్పి/మైగ్రేన్ లాంటివి సరైన విధంగా డయాగ్నసిస్ చేస్తే వాటినుండి ఉపశమనం లభిస్తుంది..
4. స్పృహ తప్పడం, పార్కిన్సన్ (వణుకుడు)వ్యాధులను సరైన సమయంలో గుర్తిస్తే చాలా సమస్యలను నివారించవచ్చు..
5. మెడ, నరములు, నడుము, కండరాల నొప్పులు,కదలికలలో మార్పులు తదితర సమస్యలు ఇవన్నీ సరిగ్గా నిద్ర పోనివ్వవు.. ఏ పని కూడా చేయనీయవు..
పైన తెలిపిన అన్ని రకముల సమస్యలకు ప్రతి శుక్ర వారం నాడు KMR హాస్పిటల్ నందు.. *న్యూరాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ అన్వేష్ గారు* వస్తున్నారు... వీరు స్ట్రోక్ స్పెషలిస్ట్ అంటే పక్షవాతం, ఫిట్స్ లాంటి వ్యాధులు మొదలుకుని స్పాండిలైటిస్ / వెన్ను నొప్పుల వరకు అన్ని సమస్యలను clear చేయగలరు..
మన *KMR హాస్పిటల్* లాభాపేక్ష లేకుండా చక్కటి సేవలను అందుస్తున్నది.. డాక్టర్ గారి సేవలను వినియోగించుకోగలరు.. డాక్టర్ గారి అప్పాయింట్ మెంట్ ఎంతో విలువైనది.. ముందస్తు అప్పాయింట్ మెంట్ తీసుకోగలరు.. మరిన్ని వివరములకు
Please Contact:
KMR యూనివర్సల్ హాస్పిటల్,
Nandigama,
08678294678

KMR Diagnostics:ఒక అత్యుత్తమ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ కు అత్యంత కీలకమైనది ... అత్యావశ్యకముగా ఉండవలసినది... రోగనిర్ధారణ ...
29/09/2021

KMR Diagnostics:
ఒక అత్యుత్తమ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ కు అత్యంత కీలకమైనది ... అత్యావశ్యకముగా ఉండవలసినది... రోగనిర్ధారణ విభాగము...
మన KMR హాస్పిటల్ నందు... COVID, డెంగీ, మలేరియా, టైఫాయిడ్, మరియు ప్రస్తుతం వస్తున్న ఎన్నో రకములైన సీజనల్ వ్యాధులకు సంబంధించి...తగిన నిర్ధారణ పరీక్షలు ఇక్కడే లభించును... రక్త పరీక్షలకు సంబంధించి... Complete Blood Picture, sugar, thyroid పరీక్షల వరకు సమస్తం ఇక్కడ నిర్వహించబడును... కేవలం వ్యాధిగ్రస్తులు మాత్రమే కాదు... మామూలు వ్యక్తులు కూడా ఆరోగ్య పరీక్షలను ఇక్కడ వేర్వేరు ప్యాకేజీ రూపంలో తెలుసుకోవచ్చు... దీనికిగాను వేర్వేరు ప్యాకేజీలు ఉన్నాయి ఆ వివరాలు కింద ఉన్న చిత్రాలలో చూడవచ్చు...
కేవలం విజయవాడ లో మాత్రమే ఉండే సదుపాయాలు ప్రస్తుతం నందిగామలో మన ఆస్పత్రిలో అందుబాటులోకి వచ్చాయి... అవసరం ఉన్నవారు ఉపయోగించుకో గలరు... ఈ సదవకాశాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి!!
🙏🙏🙏

KMR యూనివర్సల్ హాస్పిటల్  ఫార్మసీ:మన KMR యూనివర్సల్ హాస్పిటల్ నందు ఫార్మసీ సదుపాయం 24 గంటలూ అందుబాటులో ఉంటుంది...అత్యవసర...
27/09/2021

KMR యూనివర్సల్ హాస్పిటల్ ఫార్మసీ:
మన KMR యూనివర్సల్ హాస్పిటల్ నందు ఫార్మసీ సదుపాయం 24 గంటలూ అందుబాటులో ఉంటుంది...అత్యవసర మెడిసిన్ అవసరం ఉన్నవారు... ఉపయోగించుకోగలరు...

ఈ రోజు నందిగామ గాంధీ సెంటర్ లో ఉదయం 10 గంటలకు మెడికల్ క్యాంపు ఉంది... దయచేసి అందరికీ తెలియజేయండి...ఇందులో పాల్గొంటున్న మ...
19/08/2021

ఈ రోజు నందిగామ గాంధీ సెంటర్ లో ఉదయం 10 గంటలకు మెడికల్ క్యాంపు ఉంది... దయచేసి అందరికీ తెలియజేయండి...
ఇందులో పాల్గొంటున్న మా స్పెషలిస్ట్ వైద్యులు
1.డాక్టర్.మహీంద్రా గారు B.D.S.,D.IMP హాస్పిటల్ డైరెక్టర్.
వీరు దంత నిపుణులు.వీరు పంటి నొప్పి,చిగుళ్ల సమస్యలు,పిప్పి పళ్లకి రూట్ కెనాల్ చేయుదురు.
2.డాక్టర్.రవితేజ గారు. M.B.B.S,MD (EMERGENCY MEDICINE)మేనేజింగ్ పార్టనర్.
వీరు అత్యవసర కేసులు మరియు ట్రామా కేర్ కేసులు చూడబడును.
3.K.శ్రీనివాసరావు గారు M.B.B.S,DNB (Ortho)
వీరు ఎముకలు, కీళ్లు,నరములు మరియు మోకాళ్ల మార్పిడి నిపుణులు.
4.డాక్టర్.ఎలిజిబెత్ మండేలా గారు.M.B.B.S DGO (GYNOCOLOGY)
వీరు స్త్రీ ప్రసూతి మరియు సంతాన సాఫల్యురాలు.
5.డాక్టర్.రత్నం నాయుడు BPT ( PHYSIOTHERAPiIST)
వీరు ఫిజియోథెరపీ కేసులు చుడబడును.

Address

Nandigama
521185

Telephone

+918678294678

Website

Alerts

Be the first to know and let us send you an email when KMR Universal hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to KMR Universal hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category