06/09/2024
_*వరద బాధితులకు బాసటగా నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు*_
_*నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులు ఎమ్మెల్యే డా౹౹చదలవాడ పరిశీలన*_
_*ప్రతి ఒక్కరూ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ సూచన*_
_వరదలతో అవస్థలు పడుతున్న ప్రజానీకానికి అండగా నిలిచే మహా కార్యక్రమంలో తన వంతు బాధ్యత నెరవేర్చేందుకు ఎప్పుడూ ముందుంటానని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు.ఈ మేరకు విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుల్ని పరిశీలించారు.అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు.వరదల కారణంగా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని,తక్షణమే శానిటేషన్ పనులు చేపట్టాలని సూచించారు.ప్రతి ఇంటికీ మెడికల్ కిట్ అందించి అత్యవసర సమయంలో వినియోగించడం గురించి తెలిపారు.ప్రతి ఒక్కరూ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ సూచించారు._