Kadiyala Physiotherapy Clinic Narasaraopet

Kadiyala Physiotherapy Clinic Narasaraopet Kadiyala Physiotherapy Clinic,Specialty center for neurology,pediatric, and orthopedic physiotherapy

Kadiyala Physiotherapy Clinic is a private clinic, in Narasaraopet of Guntur dt, Andhra pradesh ,India, providing treatment for all musculoskeletal pains like Neck, shoulder,elbow,wrist,Back,hip,knee,and ankle pain. We deal with All post op orthopedic and neurosurgical rehabilitation,. Major work load involves Facial paralysis, stroke rehabilitation (paralysis) Spinal cord Injury rehabilitation, Parkinson's rehabilitation, Gbs rehabilitation along with regular Wrist drop, Foot drop, Joint replacements physiotherapy. We are having a well equipped electrotherapy with Biofeedback therapy, combination therapy with 1 and 3 MHz ultrasound therapy,updated exercise therapy equipment and Manual and motorized tilt tables for early ambulation of Neurological patients. We are the only center in this part having in patient rehabilitation facility.

Happy to to deliver a talk on MSK pain management and drug-induced MSK pain in my hometown@Narasaraopet .Thank you to ev...
03/09/2024

Happy to to deliver a talk on MSK pain management and drug-induced MSK pain in my hometown@Narasaraopet .
Thank you to everyone who joined and made it a memorable experience!”

I am happy to share 15th anniversary of our physiotherapy clinic,even in my absence, it continues to thrive and deliver ...
07/04/2024

I am happy to share 15th anniversary of our physiotherapy clinic,even in my absence, it continues to thrive and deliver exceptional patient care, and happy for the safe hands it is in.What truly sets us apart are the core values of empathy, patience, and active listening. We believe in going the extra mile to meet our patients’ needs and ensure their well-being. This compassionate approach, combined with our effective branding, has solidified our clinic’s reputation as a trusted physiotherapy provider dedicated to excellence and patient-centered care. Thank you all People around for being part of our remarkable journey!
Happy that still getting calls for telephonic consultation.

అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు .
17/09/2023

అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు .

Happy to see that one of our patient Mr.Srinivas from Pamidipadu village Narasaraopet happened to be YCP party activist ...
26/06/2023

Happy to see that one of our patient Mr.Srinivas from Pamidipadu village Narasaraopet happened to be YCP party activist being able to get back to his near normal life after a debilitating brain surgery,we have provided him with high intensity physiotherapy and rehabilitation from Kadiyala Physiotherapy Clinic Narasaraopet.
Yesterday pic :MLA Dr.Gopireddy Srinivasa Reddy visited him at his home.

Have had an opportunity to witness this iconic, gigantic personality, clad in white shirt and dhoti,bearly few feet away...
28/05/2023

Have had an opportunity to witness this iconic, gigantic personality, clad in white shirt and dhoti,bearly few feet away in my village ,the memory is still remembered .

Undoubtedly he is the only Telugu pride will be remembered for forever and ever.

అందరికి ఈస్టర్ శుభాకాంక్షలు .
09/04/2023

అందరికి ఈస్టర్ శుభాకాంక్షలు .

17/09/2022

25 ఏళ్ళ కుర్రోడు అమెరికా హెచ్ 1 మీద వెళ్తూ మోకాలి నొప్పి అని పది నెలల క్రితం వచ్చాడు,వివరంగా పరీక్ష చేస్తే ఎసిఎల్ లిగమెంట్ కి గాయం లాగా అనుమానించి ఎమ్మారై స్కాన్ చేయిస్తే పూర్తిగా తెగినట్లు రిపోర్ట్ వచ్చింది ,సర్జరీ కి వెళ్లమంటే ఆఫీస్ లో రిపోర్టింగ్ ఇవ్వాలి,కొన్నాలాగి వచ్చి చేయించుకుంటాను అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి ,బ్రేస్ ఇచ్చి పంపాను .
నొప్పి పెరుగుతుంది ,కాలు పక్కకి వెళ్తుంది అని ఒక ఇరవై రోజుల క్రితం వస్తే ఆపరేషన్ కి పంపాను .

నెలలో అమెరికా వెళ్ళాలి ,అక్కడ థెరపీ బాగా ఖరీదు,వెళ్ళటం కూడా కష్టం,అంటే యాక్సిలరేటెడ్ ,ఇంటెన్సివ్ ఫిజియో థెరపీ మొదలు పెడితే మొత్తానికి కాల్లో అన్ని కండరాల్లో చాలా వరకు బలం పెరిగి మొత్తానికి మెట్లు ఎక్కడం దిగటం కూడా నేర్చుకొని ప్రయాణానికి సిద్దమవుతున్నాడు .

Acl reconstruction post operative person doing stair climbing with out apprehension and with ease.




08/09/2022
30/07/2022

One more 66 year old cervical spinal cord injury patient success story from kadiyala physiotherapy in 2022

Started walking with support.

మరో 66 ఏళ్ల మెడ వెన్నుపూస కి దెబ్బ తగలటం ద్వారా నడక కోల్పోయిన వ్యక్తి విజయగాథ.

కొన్ని రోజుల ఫిజియోథెరపీ ద్వారా సహాయంతో నడవడం ప్రారంభించాడు.

06/07/2022

Post operative Left frontal meningioma removal sequel right hemeperesis with cognition impairment, recovered well and able to walk independently with near normal functioning of right upper limb,after 45 days of physiotherapy at kadiyala Physiotherapy Narasaraopet.

కడియాల ఫిజియోథెరపీ నరసరావుపేటలో 45 రోజుల ఫిజియోథెరపీ తర్వాత, లెఫ్ట్ ఫ్రంటల్ మెనింజియోమా తొలగింపు వలన వచ్చిన కుడి కాలు, చెయ్యి బలహీనత నుంచి , బాగా కోలుకొని సాధారణ పనితీరుతో స్వతంత్రంగా నడవగలుగుతున్న వ్యక్తి .



#నరసరావుపేట

డిస్క్ ప్రొలాప్స్:శరీర వ్యవస్థలో వెన్నెముక ఒక మూలస్తంభం లాంటిది. ఆ మూల స్తంభం దెబ్బ తింటే ఎటూ కదల్లేక నేల మీద వాలిపోయే ప...
02/07/2022

డిస్క్ ప్రొలాప్స్:

శరీర వ్యవస్థలో వెన్నెముక ఒక మూలస్తంభం లాంటిది. ఆ మూల స్తంభం దెబ్బ తింటే ఎటూ కదల్లేక నేల మీద వాలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఈ సమస్యలు రాకుండా జాగ్రత్త పడటమే ఉత్తమం. ఒకవేళ ఆ సమస్యలు వస్తే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్య చికిత్సలు తీసుకోవడం చాలా అవసరం. లేదంటే శరీరం శాశ్వతంగా మూలనపడే ముప్పు ఏర్పడుతుందంటున్నారు నిపుణులు.
వెన్ను పలు విభాగాల సమ్మేళనం. వెన్నుముకకు తోడుగా కండరాలు, లిగమెంట్లు, డిస్కులు ఉంటాయి. వెన్నెముక సులభంగా వంగడానికి డిస్కులు, లిగమెంట్లు తోడ్పడతాయి. మెడనుంచి న డుము వరకు ఉండే ఈ వెన్నెముకలో 33 పూసలు ఉంటాయి. వెన్నెముకలోని ప్రతి రెండు పూసలను బంధిస్తూ లిగమెంట్లు ఉంటాయి. పూసల మధ్య రబ్బరు కుదురు లాంటి ఒక పదార్థం ఉంటుంది.
దీనికే డిస్క్ అని పేరు. వెన్నెముక పొడవునా లేదా వెన్నుపాము (స్పైనల్ కార్డ్) ఉంటుంది. దీంట్లోంచి అసంఖ్యాకమైన నరాలు వెళుతుంటాయి. మెడభాగం నుంచి వె ళ్లే నరాలు చేతుల్లోకి వెళతాయి. న డుము నుంచి వెళ్లే నరాలు కాళ్లలోకి వెళతాయి. వీటిలో కొన్ని నరాలు మూత్రకోశం, మలవిసర్జక భాగంతో పాటు లైంగిక భాగాల్లోకీ వెళతాయి. వెన్నుపూసల మధ్య ఉండే డిస్కు దెబ్బ తినడం శరీరంలోని ఒక పరిణామం.
శరీరంలోని కదలిక లకు ఒక ప్రధాన కేంద్రంగా ఉండడం వల్ల సర్వైకల్, లుంబార్ భాగాల్లోని డిస్క్‌లే ఎక్కువగా దెబ్బతింటూ ఉంటాయి. అంటే ఉన్న స్థానం నుంచి పక్కకు జరుగుతాయి ఈ స్థితినే డిస్క్ ప్రొలాప్స్ అంటారు. శరీరంలో వెన్నుపాము ఒక మూలస్తంభం లాంటిది. దానికి ఇరువైపులా, ఉదరభాగంలోనూ కండరాలు ఉంటాయి. నిరంతరం శరీర శ్రమ చేసివారిలో ఈ కండరాలు బలిష్టంగా ఉంటూ వెన్నుపూసలకు సహాయంగా ఉంటాయి.
ఈ శరీర శ్రమేదీ లే ని వారిలో కండరాలు బలహీనమై శరీర భారమంతా వెన్నుపాము మీదా అలాగే డిస్కుల మీదా పడుతుంది. ఆ ఒత్తిడికి లోనైన డిస్కు తన స్థానం నుంచి పక్కకు జరుగుతుంది. ఈ స్థితినే డిస్క్ ప్రొలాప్స్ అంటారు. ఈ స్థితిలో పక్కకు జరిగిన డిస్కు పక్కనున్న నాళాల మీద వాలిపోతుంది. ఆ తరువాత వచ్చే సమస్యల అన్నిటికీ ఇదే మూలం. డిస్కు నాళాల మీద వాలిన వెంటనే నొప్పి రావడం మొదలువుతుంది.
సాధారణంగా డిస్క్ ప్రొలాప్స్ సమస్యలకు గురయ్యే వారిలో ఎక్కువగా వృద్దులే ఉంటారు. అయితే శరీర శ్రమ బాగా తగ్గిపోవడం వల్ల ఇటీవలి కాలంలో యుక్తవయస్కులు కూడా ఈ సమస్యకు లోనవుతున్నారు. డిస్కుల్లో సహజంగానే కొంత ద్రవం ఉంటుంది. డిస్కుల్లో వెన్నుపూసను పట్టి ఉంచే బిగువు ఈ ద్రవం వల్లే కలుగుతుంది.. అయితే వయసు పైబడే కొద్దీ ద్రవం క్రమంగా తగ్గిపోయి డిస్కు మెత్తబడుతుంది. ఆ తరువాత వెన్నుపూసకు ఆధారంగా ఉండలేక డిస్కు తన స్తానం నుంచి కొంత పక్కకు జరిగి నరాల మీద వాలిపోతుంది. వెన్ను నొప్పి కారణాల్లో ఇదీ ఒకటి.
డిస్కు సమస్యలకు స్థూలకాయం మరో ప్రధాన కారణం. బరువు పెరిగే కొద్దీ డిస్కుల మీద భారం పెరిగి అవి బయటికి అంటే త మ సహజ స్థానం నుంచి పక్కకు జరుగుతాయి.
పని భారాన్ని అన్ని అవయవాల మీద సమంగా వేయకుండా ఆ ఒత్తిడి అంతా వెన్నెముక మీదే పడేలా చేయడం మరో కారణం.అలాగే శక్తిని మించిన బరువులు ఎత్తడం, ఏ శిక్షణా లేకుండానే హై జంప్, లాంగ్ జంప్, హెవీ వెయిట్ లిఫ్టింగ్‌లు, ఎక్కువ దూరం రన్నింగ్ చేయడం, రోజంతా వంగి పనిచేయడం డిస్కు ప్రొలాప్స్ కు దారి తీసే మరికొన్ని ఇతర కారణాలు. అలాగే వయాగ్రా లాంటి కృత్రిమ ప్రేరకాలు కూడా డిస్కు సమస్యలకు కారణమవుతాయి.
ఇవే కాకుండా ఏదైనా ప్రమాదంలో వెన్నుపూసల మీద బలంగా దెబ్బ తగలడం, మనం ప్రయాణిస్తున్న వాహనాలు గోతుల్లో పడిపోవడం కూడా ఈ సమస్యలను తెచ్చిపెడతాయి. కొందరిలో టిబి ఇన్‌ఫెక్షన్లు కూడా వెన్నుపూసను దెబ్బ తీసే ప్రమాదం ఉంది. పక్కకు జరిగిన డిస్కు నరాల మీద పడిపోయినప్పుడు నొప్పి మాత్రమే కాకుండా కొన్ని సార్లు పక్షవాతం కూడా రావచ్చు.
డిస్క్ దెబ్బతింటే...
మెడ భాగంలో మొదలయ్యే సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యతో మెడతో పాటు చేతి నరాల్లోనూ నొప్పివస్తుంది. నడుము భాగంలోని డిస్కులు పక్కకు జరిగిన వారికి పడుకుని లేదా కూర్చుని ఉంటే ఏమీ అనిపించదు. కానీ, లేచి కొద్ది దూరం నడవగానే వెన్నునొప్పి మొదలవుతుంది. కాళ్లల్లో నొప్పితో పాటు నరం ఒత్తిడికి గురవుతున్న చోట తిమ్మిరి వస్తుంది. నడకలో ఇబ్బందులు మొదలవుతాయి ఈ స్థితినే సయాటికా అంటారు.
చికిత్సలేమిటి?
ఎంఆర్ఐ పరీక్షలోనే దాదాపు 50 మందిలోని డిస్క్ ప్రొలాప్స్ సమస్య కనిపిస్తుంది. నిజానికి డిస్క్ ప్రొలాప్స్‌తోనే సమస్య కాదు. ప్రొలాప్స్ తరువాత నొప్పి వస్తేనే దాన్ని సమస్యగా భావించాలి. నొప్పి లేనప్పుడు పక్కకు జరిగిన డిస్కులు వాటికవే తిరిగి తమ సహజ స్థానానికి వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి 90 శాతం డిస్కు సమస్యలు మందులతోనే నయమవుతాయి.
మిగతా ఆ 10 శాతం మందికే శస్త్ర చికిత్స అవసరమవుతుంది. కాళ్లల్లో బలహీనతగానీ, తిమ్మిరిగానీ లేకుండా కే వలం నొప్పి మాత్రమే ఉంటే మందులు, #ఫిజియోథెరపీతో సమస్య ముగిసిపోతుంది. కొందరిలో మందులు వాడుతున్నా తిమ్మిర్లతో పాటు కాళ్లు లేదా చేతులు బలహీనపడుతూ నొప్పి భరించలేని స్థితికి చేరుతుంది. తమ ఉద్యోగ, వ్యాపారాలేవీ చేసుకోలేని స్థితికి కూడా కొందరు వచ్చేస్తారు. అలాంటి వారికి శస్త్ర చికిత్స తప్పనిసరి అవుతుంది.
సాధారణంగా డిస్కు ఏదో ఒక పక్కకు జరగడమే చూస్తాం. కానీ, అరుదుగా కొందరిలో డిస్కు మద్యలో దెబ్బ తింటుంది. ఇది మరీ తీవ్ర సమస్య. ఈ సమస్యతో లైంగిక శక్తి దెబ్బ తింటుంది. చివరికి మలమూత్ర విసర్జనలు కూడా ఆగిపోతాయి, ఈ స్థితిలో తక్షణమే శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుంది. ఆలస్యం చేస్తే ఇది ప్రాణాపాయానికి కూడా దారి తీయవచ్చు.
నివారణేమిటి ?
రోజూ పొట్ట, మెడ కండరాలను పటిష్టపరిచే #వ్యాయామాలు చేస్తే నడుము భాగంలో వచ్చే లుంబార్ స్పాండిలోసిస్ గానీ, మెడ భాగంలో వచ్చే సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యలు గానీ రాకుండానే కాపాడుకోవచ్చు. నిజానికి మన రోజు వారి కార్యకలాపాలన్నిలోనూ శరీరాన్ని ముందు వైపు వంచే ఉంచుతాం.
ఈ స్థితిని బ్యాలెన్స్ చేసేందుకు శరీరాన్ని వెనుకకు వంచే సాధన లేవీ చాలా మంది చేయరు. అందుకే విధిగా శరీరాన్ని ముందుకు వంచే ఫ్లెక్షన్ వ్యాయామాలతో పాటు వెనక్కు వంచే ఎక్స్‌టెన్షన్ వ్యాయామాలు కూడా రోజూ చేస్తే డిస్కు సమస్యలను చాలా వరకు దూరంగా ఉంచవచ్చు.
,

Address

Dr. Moparthi Complex, Rajagari Kota
Narasaraopet
522601

Telephone

+919440676100

Website

Alerts

Be the first to know and let us send you an email when Kadiyala Physiotherapy Clinic Narasaraopet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Kadiyala Physiotherapy Clinic Narasaraopet:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category