26/09/2019
ప్రకాశం జిల్లా విద్యాశాఖాధికారి గారికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గవర్నర్ పురస్కారం.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జూనియర్ / యూత్ రెడ్ క్రాస్ కార్యక్రమంలో భాగంగా 2018-19 విద్య/ ఆర్థిక సంవత్సరానికి గాను ప్రకాశం జిల్లా నుండి రాష్ట్రంలోనే అత్యధిక విద్యాసంస్థలు నమోదు చేయించి, అద్భుతమైన ఫలితాలు చూపిన సందర్భముగా ప్రకాశం జిల్లా విద్యాశాఖాధికారి, శ్రీ వి.ఎస్.సుబ్బారావు గారిని రాష్ట్ర గవర్నర్ మరియు రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ. బిస్వభూషణ్ హరిచంద్రన్ గారి చేతుల మీదుగా బంగారు పతకంతో సత్కరించబోతున్నారు. సదరు కార్యక్రమం ఈ నెల 30వ తేదీ సాయంత్రం గం.04:00ని లకు విజయవాడ లోని లబ్బీపేట లో గల ఎస్.ఎస్. ఫంషన్ హాల్ నందు జరుగును. ఈ సందర్భముగా జిల్లా విద్యాశాఖాధికారి, శ్రీ వి.ఎస్.సుబ్బారావు గారికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ , ప్రకాశం జిల్లా శాఖా చైర్మన్ డా. గుండవరపు రాఘవ్ మరియు కార్యదర్శి శ్రీ. ఎం.ఎల్. నరసింహరావు గారు (స్టెప్ సి.ఈ.ఓ మరియు APIIC జోనల్ మేనేజర్, ప్రకాశం జిల్లా) మరియు రెడ్ క్రాస్ ప్రకాశం జిల్లా శాఖా ఎక్సిక్యూటివ్ కార్యవర్గం, సభ్యులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.