16/10/2025
*పన్నులు భారం తగ్గించి ప్రజలకు మరింత చేరువుగా సూపర్ జీఎస్టీ...*
*కేంద్ర ప్రభుత్వ సహకారంతో నూతన విధానాలతో ముందుకు వెళుతున్నామన్న డాక్టర్ రవి రామ్ కిరణ్ గోరంట్ల...*
పన్నుల అధిక భారం తగ్గించి ప్రజలకు మరింత చేరువుగా సూపర్ జీఎస్టీ ఎంతగానో ఉపయోగపడుతుందని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక నూతన విధానాలతో ముందుకు వెళుతున్నామని, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవి రామ్ కిరణ్ పేర్కొన్నారు.
ఈరోజు శాటిలైట్ సిటీ గ్రామంలో ఆటో యూనియన్ లతో RTO రామనారాయణ గారి ఆధ్వర్యంలో జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు డాక్టర్ గోరంట్ల రవి రామ్ కిరణ్ పాల్గొన్నారు.
డా"రవి రాం కిరణ్ మాట్లాడుతూ గతంలో రకరకాల పన్నులు ఉండేవని, రాష్ట్రానికి, రాష్ట్రానికి ఈ పన్నుల వ్యవస్థ వేరువేరుగా ఉండేదని, దేశవ్యాప్త పన్ను సంస్కరణలలో భాగంగా వ్యాట్ వచ్చిందని, ఆ పై దేశమంతా ఒకే పన్ను నినాదంతో జీఎస్టీ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 పేద, మధ్యతరగతి వర్గాలతో పాటు రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు ఊపు రావడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. స్వదేశీ ఉత్పత్తులు పెరిగినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు.
వ్యవసాయానికి సంబంధించి పాలు, పన్నీరు, డ్రిప్, బయో పెస్టిసైడ్స్, యంత్ర పరికరాలు వంటి వాటిపై పన్ను గణనీయంగా తగ్గిందని దానితో వాటి ధరలు భారీగా తగ్గాయని పేర్కొన్నారు.
కృషి ట్రాక్టర్ , ఆటోలపై రూ.16,500 ధర తగ్గుతుందని తెలిపారు. టెలివిజన్ మీద రూ.3,500 నుంచి ఆ పైన ధరలు తగ్గుతున్నాయని తెలిపారు. చిన్నకార్ల మీద రూ.70వేల వరకూ ధరలు తగ్గుతున్నాయన్నారు. సెలూన్ , బ్యూటీ ఇండస్ట్రీ పై పన్నుల సైతం 5 శాతానికి దిగివచ్చాయని తెలిపారు. సెలూన్లు, బ్యూటీమొదలైనవాటిపై తగ్గిన పన్నుల వల్ల ఏడాదికి ఒక కుటుంబానికి రూ.8,500లు ఆదా అవుతుందన్నారు. మధ్యతరగతి కుటుంబీకుడు ఒక మోటారు సైకిల్ కొనుగోలు చేస్తే రూ.8వేల వరకూ ధర తగ్గుతుందన్నారు. ఇలా ప్రతీ వస్తువు మీద ధరలు తగ్గి వినియోగదారులు లాభపడుతున్నారని తెలిపారు. ప్రతీ ఒక్కరూ జీఎస్టీ2.0పై అవగాహన పెంచుకోవాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశ్యమని ఆయన వ్యాఖ్యానించారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ఫలితాలు సామాన్యులకు చేరాలన్నారు. సభా అనంతరం గతానికి ఇప్పటికీ జీఎస్టీ ఎంతవరకు తగ్గిందో ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ నాయకులు వినుకొండ సుబ్రమణ్యం ,AMC చైర్మన్ మార్ని వాసుదేవ్, టీడీపీ రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, గ్రామ కమిటీ అధ్యక్షులు నిచ్చిన కోళ్ల సత్తిబాబు ,ఎమ్మెస్సార్ శ్రీను, పితాని శ్రీనివాసరావు, పెంకే కోటేశ్వరరావు, చౌడాడ లాజర్, తనుబుద్ధి సుబ్బయ్య ,మజ్జి కనకారావు ,బుడంపత్తి రామకృష్ణ ,పెద్దాడ వెంకటకృష్ణ, పీతల రాంబాబు, వెంకటేష్, గుడిసిపూడి, నాగేంద్ర ,దుర్గారావు, కట్ట అన్నవరం, ఆటో యూనియన్ తదితరులు పాల్గొన్నారు.
Telugu Desam Party (TDP)
Nara Chandrababu Naidu
Nara Lokesh