Dr.yalla pradeep sukumar

Dr.yalla pradeep sukumar The ballot is stronger than the bullet

మొంథ తుపాన్ నేపథ్యంలో లో  నేడు అర్ధరాత్రి వేళ నగరంలో స్థానిక 39వ వార్డు తుమ్మలోవ అంబేద్కర్ కమ్యూనిటీ భవన్ ను సందర్శించి ...
28/10/2025

మొంథ తుపాన్ నేపథ్యంలో లో నేడు అర్ధరాత్రి వేళ నగరంలో స్థానిక 39వ వార్డు తుమ్మలోవ అంబేద్కర్ కమ్యూనిటీ భవన్ ను సందర్శించి అధికారులు అప్రమత్తంగా ఉన్నారోలేదో పరిశీలించి మత్స్యకారులకు ఏ ఆహారం ఇచ్చారు, ఉదయం ఏ ఆహారం ఏర్పాటు చేస్తున్నారు అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు.


 అంగరంగ వైభవంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముందస్తు పుట్టిన రోజు వేడుకలు - యాళ్ళ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ డాక్టర్ యాళ్ళ ప...
26/10/2025


అంగరంగ వైభవంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముందస్తు పుట్టిన రోజు వేడుకలు
- యాళ్ళ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ డాక్టర్ యాళ్ళ ప్రదీప్ ఆధ్వర్యంలో...
- 2వేల మందికి 5 కిలోల వంతున బియ్యం బ్యాగులు పంపిణి
- భారీ కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే. ఆదిరెడ్డి శ్రీనివాస్
- ఈవీఎం ఎమ్మెల్యే కాదు ఎవ్రీ టైమ్ రాజమండ్రిసిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు: డాక్టర్ యాళ్ళ ప్రదీప్
- మరో 20 ఏళ్ళు కూటమి అధికారంలో ఉంటుంది... ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యేగా ఉంటారు : నాయకులు
రాజమహేద్రవరం :
రాష్ట్రంలో ఏగాలి వీచినా రాజమండ్రిలో టీడీపీ జెండా ఎగరవేస్తున్న, మహిళలకు ప్రజలకు పాదాభివందనలు చేస్తున్నానని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) వినయంగా చెప్పారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తూ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
యాళ్ళ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ డాక్టర్ యాళ్ళ ప్రదీప్ సుకుమార్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నటరాజ్ థియేటర్ వద్ద ఆదిరెడ్డి శ్రీనివాస్ ముందస్తు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2 వేలమందికి 5 కేజీల వంతున బియ్యం బ్యాగులను, మొక్కలను పంపిణి చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు భారీ కేకు కట్ చేశారు. ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ బుడ్డిగ రవి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాజమండ్రిని టీడీపీకి కంచుకోటగా మార్చి వరుస విజయాలు అందిస్తున్న నగర ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.తమను కుటుంబ సభ్యులుగా ఆదరిస్తున్న ప్రజల మధ్యకు రావడం గొప్ప అనుభూతిని ఇస్తోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.16 సంవత్సరాలుగా తమ కుటుంబంలో తన తల్లిని మేయరుగా, తండ్రిని ఎమ్మెల్సీగా, తన సతీమణిని ఎమ్మెల్యేగా, ఇప్పుడు తనను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. నాయకత్వ లక్షణాలు పెంచేందుకు
అందరికీ పదవులు కల్పిస్తున్నామని ఆయన అన్నారు. అనవసర విమర్శలు,అసత్య ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు తన మంచితనాన్ని చేతకానితనంగా భావించవద్దని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. తాను కన్నెర్ర చేస్తే అన్ని ప్రాంతాల్లో ఉన్న తన అభిమానుల ఆగ్రహాన్ని ప్రత్యర్థులు తట్టుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. అయితే రాజకీయ వాతావరణ బాగుండాలని, నగరం, మహిళలు సురక్షితంగా ఉండాలని తాను కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ముందస్తు పుట్టిన రోజు వేడుకల నిర్వాహకుడు యాళ్ళ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ డాక్టర్ యాళ్ళ ప్రదీప్ సుకుమార్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నయ్య ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన అక్కసుతో, అసుయతో వాసు అన్నయ్యను ఈవీఎం ఎమ్మెల్యే అంటున్నారని, కాని రాజమండ్రి సిటీలో ఎవ్రీ టైమ్ ఆయనే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అని, రానున్న రోజుల్లో మంత్రిగా పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటారని ఆయన ఆకాంక్షించారు. ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ చల్లా శంకరరావు మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ వారి మంచిచెడ్డలు చూసే యువ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నిజమైన ప్రజా నాయకుడని 43 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వాసు‌మరో 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండాలని ఆశీస్సులు అందచేశారు. రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, ఉపాధ్యక్షుడు ఉప్పులూరి జానకి రామయ్య, రాచపల్లి ప్రసాద్, కూటమి నాయకుడు దొండపాటి సత్యం బాబు, యెనుముల రంగబాబు, నగర తెలుగు మహిళ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

తెలుగువారింట మహా పండుగ దసరా. అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ కరుణతో మీకు, మీ కుటుంబ సభ్యులు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించాల...
02/10/2025

తెలుగువారింట మహా పండుగ దసరా. అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ కరుణతో మీకు, మీ కుటుంబ సభ్యులు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని, మీ ఇంటిల్లిపాదీ సుఖ సంతోషాలతో ఉండాలని ,
ఈ పండుగ ఆత్మవిశ్వాసం, ధైర్యం, సత్యం ఎల్లప్పుడూ నిలిచేలా మనకు స్ఫూర్తినిస్తుంది.

ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, సౌభాగ్యం, ఆరోగ్యం కలగాలని అమ్మ దుర్గమ్మ తల్లిని ప్రార్థిస్తున్నాను.

మీకు మరియు మీ కుటుంబానికి
విజయదశమి శుభాకాంక్షలు !!




Helping Hands 🤝🤝🤝 ఒక నిరుపేద కుటుంబానికి చెందిన క్రీడాకారుడు ఆర్థిక సమస్యల కారణంగా తన క్రీడా ప్రయాణాన్ని కొనసాగించలేకపోత...
01/10/2025

Helping Hands 🤝🤝🤝

ఒక నిరుపేద కుటుంబానికి చెందిన క్రీడాకారుడు ఆర్థిక సమస్యల కారణంగా తన క్రీడా ప్రయాణాన్ని కొనసాగించలేకపోతున్నాడు. ఈరోజు యళ్ళ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా యళ్ళ ప్రదీప్ సుకుమార్ గారు మరియు యాళ్ళ రాధాకృష్ణ గారు ఆ క్రీడాకారుడికి ప్రతి నెలకు అవసరమైన క్రీడా సామగ్రి మరియు ఆర్థిక సహాయాన్ని ఉచితంగా అందజేశారు.

యళ్ళ చారిటబుల్ ట్రస్ట్ ఎల్లప్పుడూ నిరుపేదలు, బాధపడుతున్న రోగులు, విద్యార్థులు, క్రీడాకారులు మరియు సహాయం అవసరమైన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తోంది. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలతో సమాజంలో వెలుగులు నింపాలని ట్రస్ట్ సంకల్పించింది.

*స్థానిక లింగంపేట 39వ వార్డులోని ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా Parkinson disease అనే వ్యా...
27/09/2025

*స్థానిక లింగంపేట 39వ వార్డులోని ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా Parkinson disease అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈరోజు యళ్ళ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డాll యళ్ళ ప్రదీప్ సుకుమార్ గారు ఆ వ్యక్తికి నెలకు సుమారు ₹7,000 విలువ చేసే అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు.

*ఇలాంటి సహాయ కార్యక్రమాలు ఆ కుటుంబానికి మాత్రమే కాకుండా, వార్డ్ లోని ఇతరులకు కూడా ఆశాకిరణంగా నిలుస్తాయి. అవసరంలో ఉన్నవారికి తోడ్పాటు అందించడం ద్వారా మానవతా విలువలను నిలబెట్టడమే కాక, సమాజంలో మంచి మార్పుకు దారితీస్తుంది.

*యళ్ళ చారిటబుల్ ట్రస్ట్ ఎల్లప్పుడూ నిరుపేదలు, బాధపడుతున్న రోగులు, విద్యార్థులు మరియు సహాయం అవసరమైన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తోంది. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలతో సమాజంలో వెలుగులు నింపాలని ట్రస్ట్ సంకల్పించింది.

మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు. సమాజానికి విద్య, వివేక, విజ్ఞానం అందించే గ...
05/09/2025

మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు. సమాజానికి విద్య, వివేక, విజ్ఞానం అందించే గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

39వ వార్డులో రూ.కోటి 80 లక్షలతో  అభివృద్ధి పనులు - మరో రూ.85 లక్షల పనులకు ప్రతిపాదనలు పంపించాం- ప్రజలకు అవసరమైన పనులు చే...
30/08/2025

39వ వార్డులో రూ.కోటి 80 లక్షలతో అభివృద్ధి పనులు
- మరో రూ.85 లక్షల పనులకు ప్రతిపాదనలు పంపించాం
- ప్రజలకు అవసరమైన పనులు చేస్తున్నాం
- ఈవార్డు టీడీపీకి కంచుకోట
- ప్రభుత్వ నిధులు... సొంత నిధులతో పనులు చేస్తున్నాం
- ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
రాజమహేంద్రవరం :
ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) చెప్పారు. 39వ వార్డులో ఇంతవరకు రూ. కోటి 52 లక్షలతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని,మరో 30 లక్షలతో ఈరోజు పనులు చేస్తుతున్నామని ఆయన చెప్పారు. అలాగే మరో రూ.85 లక్షల పనులకు ప్రతిపాదనలు పంపించామని ఆయన తెలిపారు. వార్డులో రూ.24 లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శనివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డివిజన్ ఇంచార్జ్ యాళ్ల ప్రదీప్ తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. అలాగే లింగం పేట 5 వ వీధిలో కాలువ నిర్మించగ రోడ్డు కిందకు అవడంతో దాన్ని లెవెల్ చేసేందుకు పనులు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులుగా తమ ఇష్టం వచ్చినట్లు పనులు చేయడం కాకుండా, ప్రజలు తమకు ఏ పనులు అవసరమో చెబితే అవి చేపడుతున్నామని చెప్పారు. ఈ వార్డు తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని గతంలో గొర్రెల రమణి తదితరులు ఈ వార్డు నుంచి ప్రాతినిధ్యం వహించారని, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీకి, 2024 ఎన్నికల్లో తనకు ఈ వార్డులో 2 వేలకు పైగా మెజారిటీ ఇచ్చారని, అందుకే ఈ వార్డులో అభివృద్ధి పనులు, ప్రజలకు అవసరమైన పనులు చేయడం తమ బాధ్యత అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. లింగంపేటలో కాలువ నిర్మించారని రోడ్డు కిందకు అయిందని దాని లెవెలింగ్ పనులు చేపడుతున్నామని చెప్పారు. లింగంపేట వాంబే గృహాల చివరి బ్యాంకుకు సెప్టిక్ ట్యాంకు లు నిర్మించాల్సిఉందని తన శ్రీమతి ఆదిరెడ్డి భవాని ఎమ్మెల్యేగా ఉండగా ఆ పనులు చేపడితే వైసీపీ నాయకులు వారి ఫ్లెక్సీలు కట్టుకుని హడావిడి చేసి వదిలేశారని ఆయన విమర్శించారు. ఇప్పుడు ఆ పనులు పూర్తి చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. ప్రభుత్వ నిధులతో ఎలాగూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని, అలాగే వార్డులో ఏడు ఆకుల చెట్లు ఉంటే వాటి గాలి పీల్చితే అనారోగ్యమని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తే వాటిని తోలగించేందుకు సొంత ఖర్చుతో ఎత్తయినా నిచ్చెన ఏర్పాటు చేయించి ఆ చెట్టు నరికించామని ఆయన చెప్పారు. నగరపాలకసంస్థ వద్ద ఉన్న లాడర్ అంత ఎత్తుగా లేకపోవడంతో తన డబ్బుతో నిచ్చెన ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, గొర్రెల రమణి, చాపల నాగమణి, తుళ్లి పద్మ, నాగలక్ష్మి, కరగాని వేణు, మళ్ల వెంకట రాజు, దాస్యం ప్రసాద్, దుత్తరపు గంగాధర్, సలాది ఆనంద్, నగర పాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ రోజు 39వ వార్డ్ లింగంపేట 5 వ విధీ లో పర్యటించడం జరిగింది. వర్షాల నేపథ్యంలో డ్రైనేజ్ వ్యవస్థ మరియు శానిటేషన్ నిర్వహణ ఏర...
29/08/2025

ఈ రోజు 39వ వార్డ్ లింగంపేట 5
వ విధీ లో పర్యటించడం జరిగింది. వర్షాల నేపథ్యంలో డ్రైనేజ్ వ్యవస్థ మరియు శానిటేషన్ నిర్వహణ ఏర్పాట్లను మున్సిపల్ సిబ్బంది మరియు వార్డ్ మెంబర్స్ తో కలిసి పరిశీలించడం జరిగింది.

వినాయక చతుర్థి సందర్భంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను సందర్శించి పూజలు నిర్వహించి ప్రజలందరూ సుఖశాంతులతో...
28/08/2025

వినాయక చతుర్థి సందర్భంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను సందర్శించి పూజలు నిర్వహించి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ విగ్నేషుడుని ప్రార్థించడం జరిగింది.




Address

Vasavi Sri Multi-speciality Hospital
Rajahmundry
533101

Telephone

9177996229

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.yalla pradeep sukumar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr.yalla pradeep sukumar:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category