ధ్యానం తోనే దైవ దర్శనం

ధ్యానం తోనే దైవ దర్శనం Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ధ్యానం తోనే దైవ దర్శనం, Meditation Center, Rajampet.

Phone pe number : 9985352586Account number : 65010201000137V. Prakash raoUnion bankRajampetIFSC : UBINO565016
18/04/2022

Phone pe number : 9985352586
Account number :
65010201000137
V. Prakash rao
Union bank
Rajampet
IFSC : UBINO565016

నైవ వాచా న మనసా, ప్రాప్తుం శక్యోన చక్షుషా!అస్తీతి బ్రువతో న్యత్ర కథం తదుపలభ్యతే!!ఆత్మను గురించి మాటల ద్వార, కళ్ళచేత, మనస...
27/03/2022

నైవ వాచా న మనసా, ప్రాప్తుం శక్యోన చక్షుషా!
అస్తీతి బ్రువతో న్యత్ర కథం తదుపలభ్యతే!!

ఆత్మను గురించి మాటల ద్వార, కళ్ళచేత, మనసు చేత చెప్పేందుకు సాధ్యమయ్యేది కాదు. నిరంతరం ధ్యాన సాధనలో ఆత్మ ద్వారా పరమాత్ముని దర్శనంతో తన్మయత్వం పొందినవారు మాత్రమే ఆత్మను గురించి చెప్పగలరు. వెరెవ్వరి వలన అది సాధ్యపడదు.

ఏకో వశీ సర్వభూతాన్త రాత్మాఏకం రూపం బహుధా యః కరోతి!తమాత్మస్థం యేను పశ్యన్తి ధీరాస్తేషాంసుఖం శాశ్వతం నేత రేషామ్!!సకల జీవుల...
23/03/2022

ఏకో వశీ సర్వభూతాన్త రాత్మా
ఏకం రూపం బహుధా యః కరోతి!
తమాత్మస్థం యేను పశ్యన్తి ధీరాస్తేషాం
సుఖం శాశ్వతం నేత రేషామ్!!

సకల జీవులలో అంతరాత్మగా వున్న ఆ పరమాత్ముడు (సృష్టికర్త) తన ఓకే రూపాన్ని ఎన్నో విధాలుగా కన పరుస్తున్నాడు పరమాత్మ తనతోనే ఆత్మ రూపంలో వున్నాడని గ్రహించిన జ్ఞానులు శాశ్విత ఆనందం పొందుతారు....

ఇహచే దశకద్భో ద్ధుం ప్రాక్ఛరీరస్య విస్రసఃతతః సర్గేషు లోకేషు, శరీరత్వాయ కల్పతే!!మానవుడు ఆ సృష్టికర్తను ఇక్కడే అనగా ఈ శరీరం...
22/03/2022

ఇహచే దశకద్భో ద్ధుం ప్రాక్ఛరీరస్య విస్రసః
తతః సర్గేషు లోకేషు, శరీరత్వాయ కల్పతే!!

మానవుడు ఆ సృష్టికర్తను ఇక్కడే అనగా ఈ శరీరం నశించక ముందే సాక్షాత్కరించుకో గలిగితే సంసార బంధం నుంచి విముక్తుడయి మరుజన్మ లేని మోక్షం పొందుతాడు. లేనిచో సృష్టిలోని ఎన్నో లోకాలలో - ఏ స్థితిలోనో మళ్ళీ - మళ్ళీ జన్మించవలసి ఉంటుంది.
(ఆత్మ ఈ మానవ శరీరం వున్నప్పుడే పరమాత్మను దర్శించుకోవాలి )

న దానైర్నతపోభిర్వాయజ్నైర్వా బహుదక్షినైః!భక్తిహీనైర్మునిశ్రేష్ఠ తుష్యతే భగవాన్ నమః!!మానవుడు దానమైనా, ధ్యానమైనా, తపస్సయినా...
18/03/2022

న దానైర్నతపోభిర్వాయజ్నైర్వా బహుదక్షినైః!
భక్తిహీనైర్మునిశ్రేష్ఠ తుష్యతే భగవాన్ నమః!!

మానవుడు దానమైనా, ధ్యానమైనా, తపస్సయినా, సృష్టికర్తపై సంపూర్ణమైన భక్తి - విశ్వాసాలతో చేయాలి. అహంకారంతో, కోరికలతో చేస్తే అది ఫలించదు.

పరమేవాక్షరం ప్రతిపద్యతే స యో హవైతదచ్ఛాయ మ శరీర మలోహితం శుభ్రమక్షరం వేదయతే యస్తు సోమ్య స సర్వజ్ఞః సర్వో భవతి తదేష శ్లోకఃఎ...
16/03/2022

పరమేవాక్షరం ప్రతిపద్యతే స యో హవై
తదచ్ఛాయ మ శరీర మలోహితం శుభ్రమక్షరం వేదయతే యస్తు సోమ్య స సర్వజ్ఞః సర్వో భవతి తదేష శ్లోకః

ఎవరైతే గొప్పదైన , నాశనం లేని , నీడలేని , శరీరం-రంగు లేని , స్వచ్ఛమైన , స్వయం ప్రకాశక మైన పరమాత్మను చూడగోరు చున్నారో వారు తమ ఆత్మ ద్వారా సృష్టికర్తను దర్శించ గలరు. అలా ఆత్మను దర్శించిన వారు సర్వఘ్నులుగా సమస్తం తామే అవుతారు.

మనోమయః ప్రాణశరీరనేతా ప్రతిష్టితోన్నే హృదయం సన్నిధాయ!తద్వి జ్ఞానేనా పరిపశ్యన్తి ధీరా ఆనన్దరూప మమృతం యద్విభాతి!! సృష్టికర్...
23/02/2022

మనోమయః ప్రాణశరీరనేతా
ప్రతిష్టితోన్నే హృదయం సన్నిధాయ!
తద్వి జ్ఞానేనా పరిపశ్యన్తి ధీరా ఆనన్ద
రూప మమృతం యద్విభాతి!!

సృష్టికర్తను దర్శించు కొనుట కొరకు మనస్సును శుద్ధి పరచుకొని, ఆ సృష్టికర్తే సకల ప్రాణులకు అధినేత అని గ్రహించి, ధ్యానం లో నిమగ్నమైన యెడల హృదయం శాంత పడును . అలా సంపూర్ణమైన ఆత్మ జ్ఞానాన్ని వికశింప చేసుకోవాలి. ఈ స్థితి కలిగిన వారు మాత్రమే ఇదే జన్మలో శాస్విత ఆనందమును కలిగించే స్వయం ప్రకాశ మయమైన సృష్టికర్తను సాక్షాత్కరించు కుంటారు.

అవిద్యాయాం బహుధా వర్తమానాఃవయం కృతర్ధా ఇత్యభిమన్యన్తి బాలాః!యత్కర్మిణో నప్రవేదయన్తి రాగాత్ తేనా హతురాః క్షీణలోకాశ్చ్యవన్త...
19/02/2022

అవిద్యాయాం బహుధా వర్తమానాః
వయం కృతర్ధా ఇత్యభిమన్యన్తి బాలాః!
యత్కర్మిణో నప్రవేదయన్తి రాగాత్
తేనా హతురాః క్షీణలోకాశ్చ్యవన్తే!!

అజ్ఞానంలో మునిగిపోయిన వారికి పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాత్రలు, దానాలు అనే కర్మలు చేయాలని ఆసక్తి ఎక్కువ. వీరికి కర్మఫలం మీద ఆసక్తి ఉన్నంతవరకు జ్ఞానోదయం కాదు. అందువలన వారి పుణ్యకర్మల ఫలితం వలన స్వర్గలోకానికి చేరినప్పటికి తిరిగి పునర్జన్మ తప్పదు. మానవుడు ఫలితం ఆశించకుండా కర్మలు చేయవలెను కానీ ధ్యానం చేయుట మానరాదు.

న త త్ర సూర్యో భాతి న చన్ద్రతారకంనేమా విద్యుతోభాన్తి కుతో యమగ్నిః!తమేవ భాన్తి మనుభాతి సర్వం తస్యభాసా సర్వ మిదం విభాతి!!స...
14/02/2022

న త త్ర సూర్యో భాతి న చన్ద్రతారకం
నేమా విద్యుతోభాన్తి కుతో యమగ్నిః!
తమేవ భాన్తి మనుభాతి సర్వం తస్య
భాసా సర్వ మిదం విభాతి!!

సృష్టికర్త విశ్వంకోసం సృష్టించిన సూర్య,చంద్ర, నక్షత్రాలు స్వయంగా వెలుగలేవు సృష్టికర్త దివ్య తేజస్సుతోనే అవన్నీ కాంతిని పొందుతున్నాయి ఈ సకల చరాచర విశ్వమంతా ఆయన వెలుగు ద్వారానే దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.

ఇష్టాపూర్తం మన్యమానా వరిష్ఠo నాన్య చ్చ్రేయో వేదయన్తే ప్రమూడాః!నా కస్య పృష్టేతే సుకృతే నుభూత్వాఇమం లోకం హీనతరంవా విశన్తి!...
10/02/2022

ఇష్టాపూర్తం మన్యమానా వరిష్ఠo
నాన్య చ్చ్రేయో వేదయన్తే ప్రమూడాః!
నా కస్య పృష్టేతే సుకృతే నుభూత్వా
ఇమం లోకం హీనతరంవా విశన్తి!!

కొందరు యజ్ఞయాగాది పుణ్య కర్మలు మాత్రమే అన్నిటి కన్నా ఉత్తమ మైనవని అనుకుంటూ, అంతకు మించి మరేది లేదని భావిస్తారు. వారంతా సకల భోగాలకు నిలయ మైన స్వర్గ లోకాన్ని చేరి తమ పుణ్యఫలమంతా అనుభవించి, తిరిగి హీనమైన పునర్జన్మ పొందుతారు. కర్మల కోసం ఎవరు ఎలాంటి పూజలు, యజ్ఞాలు చేసినా సృష్టికర్తను ధ్యానించుట మాత్రం మరువ కూడదు .ఇది శాస్వితమైన నిజమైన పునర్జన్మ లేని మార్గం.

రాతిబొమ్మకేల రంగైన వలువలుగుళ్ళు గోపురములు కుంభములును!కూడు గుట్ట తాను కోరునా దేవుడునిరాకార దేవుణ్ణి చూడుమయా!!విలువైన, అంద...
16/12/2021

రాతిబొమ్మకేల రంగైన వలువలు
గుళ్ళు గోపురములు కుంభములును!
కూడు గుట్ట తాను కోరునా దేవుడు
నిరాకార దేవుణ్ణి చూడుమయా!!

విలువైన, అందమైన వస్త్రములు విగ్రహములకు కడతారు. ఈ విగ్రహాలకు గుళ్ళు, గోపురాలు కట్టి కుంభాలు పెడతారు. పూజలు చేస్తారు. మహాశక్తి వంతుడైన శ్రీ మహా సృష్టికర్త (పరమాత్మ ) ఒక్కడే అని తెలిసి, నిరాకారుడు అని కూడా తెలిసి ఆయన అన్నియు ఇచ్చువాడే కానీ మానవుని వద్ద కూడు - గుడ్డ కోరువాడు కాడు అని తెలిసి కూడా మానవుడు మూర్ఖంగా ప్రవర్తిస్తూ తనను సృష్టించిన సృష్టికర్తనే ధ్యానించక మరచిపోయాడు. ధర్మ ,అధర్మమును
మరచి ప్రవర్తిస్తున్నాడు.

ఒకయూరికి నొక కరణమునొక తీర్పరియైన గాక నొగిదఱచైనం!గకవికలుగాక యుండునెసకలంబును గొట్టువడక సహజము!!ఒక గ్రామమునకు ఒకే కరణము, ఒకే...
05/12/2021

ఒకయూరికి నొక కరణము
నొక తీర్పరియైన గాక నొగిదఱచైనం!
గకవికలుగాక యుండునె
సకలంబును గొట్టువడక సహజము!!

ఒక గ్రామమునకు ఒకే కరణము, ఒకే ధర్మాధికారి మాత్రమే ఉండవలయును. అట్లు గానిచో అనేక మంది కరణములు, అనేక మంది ధర్మాధికారులు ఉండినచో ఎవరికి తోచినట్లు వారు గ్రామములోని పరిస్థితులు మారుస్తూ అన్ని పనులు చెడగొట్టును. అటులనే సకల సృష్టిని సృష్టించి సృష్టిలోని సమస్తానికి, సకల ప్రాణుల సృష్టి -పోషణ - ప్రళయ కారణములకు ఆధారమైన శ్రీ మహా సృష్టికర్త ఒక్కరే.అందరు దేవుళ్ళు కాదు దీనిని ప్రతి ఒక్కరూ గ్రహించి ధర్మమును వీడక, సృష్టికర్తను మరువక జీవించవసినదిగా సద్గురు శ్రీ వీర ప్రకాశం గురువు గారు సందేశమిచ్చారు.

Address

Rajampet
516115

Website

Alerts

Be the first to know and let us send you an email when ధ్యానం తోనే దైవ దర్శనం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share