28/02/2020
సృష్టికర్త అందరికి ఒక్కడే.ఇది నిజం. అలా కాక ఒకొక్క దేశానికి,ఒకొక్క కులానికి,ఒక్కొక్క సృష్టికర్త
ఉంటాడా?ఆలోచించండి.సృష్టికర్త ఎప్పుడు ప్రతి ఒక్కరితో వున్నాడని గ్రహించండి.ఇది తెలియని వారు తీర్థ యాత్రల పేరుతో దేశాలన్నీ తిరుగుతూ వుంటారు. గురువులు,బాబాలను ఆశ్రయిస్తూ వుంటారు.బాబాలు మాత్రం అమాయకులకు మంచి మార్గం తెలుప కుండా స్వార్థంతో రహస్యంగా కోట్ల ఆస్తులు-వందల కిలోల బంగారు దాచి పెట్టుకుంటు న్నారు.ఛస్తే ఇది ఎవరైనా వెంట తీసుకొని పోతారా?ఎవ్వరు తీసుకొని పోరు కదా!మరి ఎందుకు వీరికి ఈ ప్రయాస?ఇతరులకు మంచి మార్గం చూపరు,వారు నడువరు, వ్యర్థం గా కాల యాపన చేస్తున్నారు. ఇలాంటి వారి విషయం లో జాగ్రత్తగా ఆలోచించండి ఈ సమాజాన్ని పునీతం జేయడానికి ప్రతి ఒక్కరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి.సమాజాన్ని ప్రక్షాళన చేయడానికి సృష్టికర్త అందరికి ఒక్కడేనని, సమ సమాజ నిర్మాణానికి, మత సామరస్యానికి కంకణం కట్టండి, సృష్టికర్త అందరికి ఒక్కడే అని చాటి చెప్పే నవ సమాజo దిశగా" ధనాపేక్ష-ఫలాపేక్ష " లేకుండా స్వార్ధ రహితభక్తి మార్గాన్ని తెలియచేద్దాం. " ఉచితంగా "ప్రారంభించిన శ్రీ మహా సృష్టికర్త ధ్యాన మందిరంలో "ఉచితంగా" మనసా-వాచా-కర్మణా ధ్యానించండి, ఆరాధించండి, పూజించండి, శ్రీరస్తు...శుభమస్తు...భక్తి సిద్ధి రస్తు.....