22/01/2026
అమ్మమ్మ ఊరు అంటే చిన్నప్పుడే అవసరం అనుకున్న,
అత్తమామల దీవెనలు అవసరమచ్చిన్నప్పుడే వుంటే చాలనుకున్న,
బావ బావమరిదిల బంధం ఆటలతో,మాటలతో అయిపోయిందనుకున్న,
అక్కలు అప్పుడప్పుడు పలకరిస్తారనుకున్న,
ఆ ఊరి దోస్తులు అడపాదడపా కలుస్తారనుకున్న,
దూరం పెరిగినా,
స్థాయిలు మారినా,
మట్టివాసనతో మైమరిపించారు,
స్వచ్ఛమైన ప్రేమతో మీకెవ్వరు సరి రారనిపించారు,
అవ్వ మాత్రమే పెట్టే బువ్వను పెట్టారు,
బావ మాత్రమే చూపే బాధ్యత నెరిపారు,
రెండు రోజులు రెండు క్షణాలనై ,
ముప్పై ఏళ్లు మళ్లీ ముందుకు పోయినై,
అత్త మామ,అక్కా బావ మాటిస్తున్నా,
మీరిచ్చిన కౌగిలితో
మంచి మనుషుల కోటను కడుతా,
ప్రేమను పంచే దివిటీనవుతా,
మీ ఆతిథ్యం అమోఘం,
మీ దీవెనలు ఆజన్మం,
మీరు ఒప్పుకోరని కళ్లుమొక్కలేదులే కానీ,
మనసునిండా మీ అందరి పాదముద్రలు వేసుకున్న 🙇🏽♂️