25/10/2025
#డయాలిసిస్ చేసే సమయంలో శరీరంలోని #రక్తాన్ని కిందున్న #ఎర్ర ట్యూబ్ ద్వారా #బయటకు తీసి, డయాలిసిస్ యంత్రంలో శుభ్రపరిచి, #నీలి రంగు ట్యూబ్ ద్వారా #తిరిగి శరీరంలోకి పంపిస్తారు.
శరీరంలోని రక్తమంతా శుభ్ర పరచడానికి #సుమారుగా 4 గంటలు పడుతుంది.
ఈ నాలుగు గంటలు శరీరాన్ని కదల్చకుండా ఉంచాలి.
ఈ ప్రక్రియ #వారానికి మూడు సార్లు, నెలకు 12 సార్లు నిర్వహించాలి.
ప్రతిసారీ 4 గంటలు, అంటే నెలకు 48 గంటలు, వెచ్చించాలి.
#డయాలిసిస్ అవసరం లేని వారిలో, ఈ ప్రక్రియను, ఎలాంటి ప్రయాస & అసౌకర్యం లేకుండా, #కిడ్నీలు రోజుకు 36 సార్లు వాటంతటవే చేస్తాయి.
ఇది చదివిన తరువాత మిత్రులు.. అతిగా #మద్యం సేవించక పోవడం, #ధూమపానం చేయకపోవడం, బయట #హోటళ్లలలో, #ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో లభించే తినుబండారాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం,
#అధిక చక్కెర, మైదాతో తయారయ్యే పదార్థాలను చాలా చాలా మితంగా తీసుకోవడం.
అన్నిటికంటే ముఖ్యంగా #శారీరక శ్రమ చేయడం వంటి ఉత్తమ #జీవనశైలి అలవాట్లను అలవరచుకొంటే మంచిది.
ఎందుకంటే ఇవి మన #కాలేయం_కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అందుబాటులో ఉన్న అత్యంత చౌకైన మార్గాలు. మంచి #ఆరోగ్యానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉండండి.
//అయితే స్పెషలిస్టులు//
ఇలా అంటున్నారు:
ఆరోగ్యకరమైన కిడ్నీలు రోజుకు 24 గంటలు నిరంతరం రక్తాన్ని వడకట్టుతాయి.
“రోజుకు 36 సార్లు కిడ్నీలు చేస్తాయి” అని చెప్పడం సరిగా కాదు.
వాస్తవానికి కిడ్నీలు రోజుకు సుమారు 50 గ్యాలన్ల (180 లీటర్ల వరకు) రక్తాన్ని నిరంతరం వడకట్టి, అందులోని వ్యర్థాలను తొలగిస్తాయి.
ఇది “సార్లు” అనే లెక్కతో కాదు, నిరంతరంగా జరిగే ప్రక్రియ.
డయాలిసిస్ సమయంలో “శరీరాన్ని కదల్చకూడదు” అన్నది కొంచెం అతిశయోక్తి.
రోగి పెద్దగా కదలకపోవడం మంచిది (యాక్సెస్ పాయింట్ నుండి రక్తం వస్తుండటంతో),
కానీ చేతులు కదపడం, మాట్లాడటం, తినడం లాంటివి సాధ్యమే.
కాపీడ్