22/11/2025
MGM హాస్పిటల్స్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆరోగ్య అవగాహనా సదస్సులు.
శ్రీకాళహస్తి ఆక్సి్ఫర్డ్ డిగ్రీ కాలేజీ విద్యార్ధినులకు శ్రీకాళహస్తి MGM హాస్పిటల్స్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్త్రీ సంబంధిత ఆరోగ్య అవగాహనా సదస్సులను నిర్వహించారు. MGM హాస్పిటల్స్ స్త్రీ సంబంధిత వైద్య నిపుణురాలు డాక్టర్ శ్రీమతి లక్ష్మి ప్రసన్న గారు విద్యార్ధినులకు ఋతుక్రమ సమయంలో అవసరమగు జాగ్రతలు మరియు తీసుకోవలసిన శుభ్రతా విధానాలను గురించి వివరంగా తెలియ జేశారు. ప్రతీ విషయంలోనూ అమ్మాయిలు తగు నియమాలను పాటిస్తూ ఆరోగ్యం గా ఉండాలని తెలిపారు.MGM హాస్పిటల్స్ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఉమా మహేశ్వర్ రావు గారు క్యాన్సర్ సంబంధిత వాక్సిన్ లు తగు సమయంలో వేసుకుంటూ ఆరోగ్యం గా ఉండాలని తెలిపారు. అలాగే విద్యార్ధినులు అడిగిన ప్రతీ సందేహాలకు వివరంగా విశదీకరించారు. ఈ సదస్సులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డాక్టర్ మయూర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ప్రతీ జూనియర్ కాలేజీ మరియు డిగ్రీ కాలేజీ లలో నిర్వహించి విద్యార్ధినులకు అవగాహన కల్పించడమే MGM హాస్పిటల్స్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న MGM హాస్పిటల్స్ డైరెక్టర్ గారికి ఆక్సిఫోర్డ్ డిగ్రీ కాలజీ కరెస్పాండంట్ మధుసూదనరెడ్డి గారు ధన్యవాదములు తెలిపారు.