30/05/2021
Diabetic Education:
1. పిల్లలో వచ్చే టైపు 1 డయాబెటిస్ అనేది జీవిత కాలం ఉండే ఒక జబ్బు, కొన్ని రకాల జెనెటిక్ మార్పులు, auto immunity లేదా వైరల్ infections రావడం వలన pancreas అనే గ్రంధి లో ఉత్పత్తి కావలసిన ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం దీనికి కారణం.
2. సాధారణ జీవతం గడిపే అవకాశం సరి అయిన ట్రీట్మెంట్ తీసుకొనడం ద్వార సాధ్యం.
3. ఇన్సులిన్ అనేది మాత్రమె దీనికి ప్రస్తుతం ఉన్న మందు,
4. ప్రతి రోజు ఇన్సులిన్ ఇంజక్షన్లు అనేవి తప్పని సరిగా డోస్ ప్రకారం వేసుకోవాలి.
5. ఇన్సులిన్ అనేది జాగ్రత్తగా ఫ్రిడ్జ్ లోని బయట భాగం లో మాత్రమె స్టోర్ చేయాలి. ఫ్రీజర్ లో పెట్ట కూడదు.
6. ఇన్సులున్ ఎ విధంగా వేయాలి అనేది తప్పని సరిగా నేర్చుకోవాలి. ఇన్సులిన్ ఇంజక్షన్ గురించిన సమాచారం తెల్సుకోవాలి కొన్ని ఒక syringe లో 1 ml = 40 IU 1ml = 100 IU ఉంటుంది దానికి సబంధించిన ఇన్సులిన్ వైల్ పైన కూడా ఆ సమాచరం ఉంటుంది . దాన్ని బట్టి తగిన syringe ఎంచు కోవాలి .
7. ఇంటి వద్ద గ్లుకోమీటర్ తో గ్లూకోస్ లెవెల్ తెలుస్కోవడం నేర్చుకోవాలి.
8. ఇప్పటి నుండి ప్రతి రోజు ఎంత ఇన్సులిన్ వేసింది, మధ్యలో ఎప్పుడైనా షుగర్ లెవెల్ చేసింది మరియు షుగర్ లెవెల్ తగ్గినా పెరిగినా, ఎప్పుడైనా హాస్పిటల్ లో చేరిన లేదా హాస్పిటల్ కి చూపించుకోవడానికి వెళ్ళిన అన్ని వివరాలు డయాబెటిక్ డైరీ రూపం లో రాసి పెట్టుకోవాలి.
9. షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలు కాకుండా బలవర్ధకమైన ఆహారాన్ని పిల్లలకు ఇవ్వాలి,
10. ఒకే సారి ఎక్కువ ఆహరం కాకుండా మధ్య మధ్యలో స్నాక్స్ రూపంలో తక్కువ మోతాదు లో ఎక్కువ సార్లు ఇవ్వాలి, డయాబెటిక్ డైట్ చార్ట్ ప్రకారం పిల్లలకు ఆహరం ఇవ్వడం మంచిది కాదు , కాని కొన్ని రకాల పూర్తి షుగర్ తో ఉండే స్వీట్స్ కాని, ఫాట్స్ కాని , ఎక్కువ ఉప్పు కాని పిల్లలకు ఇవ్వ కూడదు. పిల్లలను పూర్తిగా కంట్రోల్ చేయడం సాధ్యం కాదు మరియు ఇలా చేయడం వలన గ్రోత్ దెబ్బతినే అవకాశం ఉన్న కారణం గా ఎప్పుడైనా ఎక్కువ ఆహరం లేద స్వీట్స్ తిన్న సందర్భంలో తగు మోతాదు లో ఇన్సులిన్ పెంచుకోవాలి, ప్రతి ౩౦- 50 గ్రాముల స్వీట్ లేదా ఆహరం కి ఒక యూనిట్ ఇన్సులిన్ పెంచుకోవాలి. మరియు hypoglycemia వచ్చిన ఎడల తగిన జాగ్రత్త తీస్కోవాలి.
11. Honeymoon Phase : అనగా ఒక్కొకసారి ఇన్సులిన్ థెరపీ మొదలు పెట్టిన తరువాత శరీరం ఒక వారం పది రోజుల తరువాత కొన్ని రోజుల పాటు ఇన్సులిన్ స్వంతంగా ఉత్పత్తి చేస్తుంది, ఇది కేవలం తాత్కాలికం మాత్రమె , ఇది కొన్ని సార్లు ఒక వారం నుండి నెల వరకు ఉండే అవకాశం కలదు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ Phase ఒక ఏడాది పాటు కూడా ఉండవచ్చు. ఇలాంటి సందర్భం లో జాగ్రత్తగా షుగర్ లెవల్స్ మానిటర్ చేస్తూ , ఇన్సులిన్ థెరపీ ని తగ్గించుకోవాల్సి వస్తుంది.
12. Hypoglycemia : షుగర్ లెవెల్ తగ్గడం : ఇది ఇన్సులిన్ థెరపీ మీద ఉన్న పిల్లలలో సర్వ సాధారణం, దీన్ని త్వరగా గుర్తు పట్టి చెక్ చేసుకోవాలి, దీని లక్షణాలు : చెమటలు పట్టడం, గుండె దడ రావటం, వణకడం, వీటితో పాటుగా ఆకలి ఎక్కువగా ఉండటం, ఇవే కాక తల నొప్పి, కన్ఫ్యూషన్, మూర్చ (FITS) రావడం, స్పృహ లేకుండా పడిపోవడం
ఇలాంటి లక్షణాలు ఉన్న్నప్పుడు వెంటనే నోటిలో ఒకటి లేదా రెండు చెంచాల గ్లూకోస్ పొడి ( అది అందుబాటు లో లేనప్పుడు చెక్కర పొడి ) ను నోటి లోపలి దవడ కు కొంచెం కొంచెం గా కరిగేటట్టు పెట్టాలి. ఒక 5 నుండి పది నిముషాల్లో సాధారణ స్థితికి రాకపోతే వెంటనే హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాలి.
13. HbA1C అనేది గ్లైసేమిక్ కంట్రోల్ యొక్క మార్కర్ దీని విలువ 7.5 కంటే తక్కువ ఉంటె మంచిది.
ప్రతి మూడు నుండి ఆరు నెలలకు ఒకసారి పై పరీక్ష చేసుకోవాలి
14. sick day : జ్వరం లేదా ఇతర జబ్బు పడిన రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
జ్వరం : ఇన్సులిన్ అవసరం పెరుగుతుంది , టెస్ట్ చేస్కొని (> 270 mg/dl కంటే ఎక్కువగా ఉంటె) ఒకటి లేదా రెండు యూనిట్స్ (10 %) పెంచుకోవాలి’
వాంతులు మరియు విరోచనాలు : ఇన్సులిన్ అవసరం తగ్గుతుంది , ఒక యూనిట్ తగ్గించుకోవాలి , ఒక వేల షుగర్ లెవెల్ 80 కన్నా తక్కువ ఉన్నప్పుడు సగం ఇన్సులిన్ తగ్గ్గించి వేయాలి .
80-270 మధ్య ఉన్నప్పుడు ఎప్పటి లాంటి డోస్ ఇన్సులిన్ ఇస్తూ నే, ఎక్కువగా నీళ్ళు తాపించాలి, షుగర్ లెవల్ ప్రతి నాలుగు గంటలకు ఒకసారి చూడాలి.
ఎప్పుడు కూడా ఇన్సులిన్ వేయకుండా ఆపకూడదు .
ఎప్పుడైనా సరే వాంతులు ఎక్కువగా కావడం, తగిన ఆహరం తీసుకోలేక పోవడం,
షుగర్ లెవెల్ ౩౦౦ పైన ఎక్కువ సమయం ఉండటం ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేయాలి.
15. DKA లేదా డయాబెటిక్ కీటో అసిడోసిస్ అనే ఒక complication చాల ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, దీని లక్షణాలు : కడుపు లో నొప్పి రావడం, శ్వాస ఎక్కువగా తీసుకోవడం, ఉపిరి తీస్కోవడం లో ఇబ్బంది పడటం, నోటి నుడి బాగా పండిన పండ్ల వంటి వాసన రావడం, ఎక్కువగా వాంతులు కావడం, డీ హైడ్రేషన్ కి గురి కావడం , లేదా స్పృహ కోల్పోవడం, చిరాకుగా ప్రవర్తించడం.
ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే షుగర్ లెవల్ చూస్కొని ఆసుపత్రి కి తరలించడం లేదా సంప్రదించడం చేయాలి.
16. కొన్ని రకాల శరీర సమస్యలు వచ్చే అవకాశం కలదు కనుక వీటి పై శ్రద్ధ ఉంచాలి
17. Retinopathy : కంటి సమస్యలు మొదటి సారి 3 నెలల తరువాత కంటి పరీక్ష చేయించుకోవాలి ఆ తరువాత 10 యేండ్ల తరువాత ప్రతి ఏడాది లేద ఆరు నెలలకు ఒక సారి కంటి డాక్టర్ ను సంప్రదించాలి. షుగర్ వచ్చిన 5 యేండ్ల తరువాత కంటి సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది.
18. Nephropathy : అనగా కిడ్నీ కి సంబంధించిన సమస్యలు ఇది కూడా షుగర్ వచ్చిన 5 యేండ్ల తరువాత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కనుక అప్పుడు ప్రతి ఏడాది కూడా కిడ్నీ కి సంబంధించిన క్రియటినిన్, blood urea, మూత్రం లో ఆల్బుమిన్ పరీక్ష మరియు ఆల్ట్రాసౌండ్ KUB అనే పరీక్షలు తప్పని సరిగా చేసుకోవాలి.
19. Peripheral Neuropathy : ఇది పిల్లలో సాధారణంగా రాదు.
20. BP కూడా ప్రతి మూడు నెలలకు ఒక సారి పరీక్షించు కోవాలి.
21. థైరాయిడ్ కి సంబంధించిన పరీక్ష , షుగర్ వచ్చినప్పుడు మరియు ఆ తరువాత ప్రతి రెండు సంవత్సరాలకు చేసుకోవాలి.
22. లిపిడ్ ప్రొఫైల్ :మొదట మరియు 12 యేండ్ల తరువాత ప్రతి ఏడాది చేయించుకోవాలి.
23. lipoatrophy: అనగా ఇన్సులిన్ ఇంజక్షన్ ఒకే దగ్గర వేయడం వలన వచ్చే ఇబ్బంది కనుక వేరు వేరు చోట్ల వేయాలి.
24. లిమిటెడ్ జాయింట్ మొబిలిటీ : చేతుల్లో జాయింట్ మొబిలిటీ తగ్గడం.
25. Growth failure : ఎత్తు మరియు పెరగక పోవడం ; సరి అయిన గ్లూకోస్ కంట్రోల్ ద్వార ఈ సమస్య ని అదిగమించ వచ్చు. ప్రతి ఆరు నెలలకు ఒక సారి ఎత్తు మరియు బరువు ని కొలవాలి మరియు growth చార్ట్ లో నమోదు చేసుకోవాలి.
26. ఇన్సులిన్ వేయు విధానం పూర్తిగా నేర్చుకోవాలి. చర్మం ని కొంచెం ఒక దగ్గరికి లాగి సూది వేయాలి.
27. పొట్ట, తొడలు మరియు మోచేతుల పై బాగం లో ముందు లేదా వెనుక వెయ వచ్చు.
28. ప్రతి సారి ఇన్సులిన్ వేసే ప్రదేశాన్ని మారుస్తూ ఉండాలి.
29. ప్రతి రోజు కనీసం 60 నిముషాల పాటు బయటి ఆటలు ఆడుకోనివాలి : రన్నింగ్, సైక్లింగ్, ఏదైనా స్పోర్ట్స్.
30. ఆధునిక పరిశోధన అయిన pancreatic transplant పైన పరిశోధనలు జరుగు చున్నవి ఇలాంటి పరిశోధనలు సత్ఫలితాలు వస్తే ఇలాంటి జబ్బు కి శాశ్వత పరిష్కారం రావాలి అని కోరుకుందాం.