20/01/2024
హర హర మహాదేవ్
జై శ్రీ రామ్
శ్రీరామ చంద్ర మూర్తి అన్నా శ్రీరామ నామ సంకీర్తనం అన్న పరమ గురువులైన శ్రీశ్రీశ్రీ కృష్ణ పరమహంస స్వామి వారికి మహా ప్రీతి , వారి దైవోపాసన చాలా భిన్నంగా ఉండేది , పరమహంస పరివ్రాజకులైన గురుదేవులు ప్రతి నిత్యం అత్యంత భక్తితో రామచంద్రమూర్తిని స్మరిస్తూ భక్తి పారవశ్యం చెందేవరకు ఎడతెరపి లేకుండా రామనామ సంకీర్తన చేసేవారు ప్రతిరోజూ ఆనంద భాష్ప పుష్పాలను రాముని పాదాల చెంత సమర్పించకుండా వారి తపోనుష్ఠానం ముగిసేది కాదు , శ్రీశ్రీశ్రీ కృష్ణ పరమహంస స్వామివారు తన ఆరాధ్య దైవం అయిన శ్రీరామచంద్ర జనభూమి అయోధ్యలో రాముడు రావాలని చిరకాల వాంఛ వారిసమయంలో (1996కి ముందు)అయోధ్య రామాలయ నిర్మాణానికి ఇటుకలను నామ జపం చేసి భక్తులందరిచేత కూడా జపం చేయించి ఆ ఇటుకలను అయోధ్యకి పంపించటం జరిగింది ,శ్రీశ్రీశ్రీ కృష్ణ పరమహంస స్వామి వారి శిష్యులైన శ్రీశివయోగి సిద్ధదత్త అవధూత స్వామి వారు పరమ గురువుల ప్రీతీ కొరకు తమ సర్వస్వాన్ని సమర్పించి మన ఆశ్రమం లో 1996 నుండి 25సప్తాహాలు (ఏడు రోజులు రాత్రి పగలు నిర్విరామంగా రామనామ సంకీర్తన = ఒక సప్తాహం), సప్త సప్తాహాలు,25 సంవత్సరాలు కార్తీక మాసంలో ఏకాహం , ప్రతీ సప్తాహానికి చివరి రోజు 108 హనుమాన్ చాలీసా పారాయణలు ఇలా గురుభక్తిని మరియు రామ నామ సంకీర్తన ద్వారా మన సనాతన ధర్మ పరిరక్షణను మన ఆశ్రమం ద్వార నిస్వార్థం గా చేయటం జరిగింది,
అలాగే ఎందరో మహానుభావుల చిరకాల దివ్య సంకల్పం అయోధ్య శ్రీరామ మందిరం ఇన్నాళ్లకు సిద్ధించనుంది, ఇది భారతీయులుగా ,సనాతన ధర్మానుయాయులుగా మహాత్ముల సంకల్పాలకు సాక్షులుగా మనం అందరం ఈ తరుణం లో ఉండటం మన సుకృతం , అయోధ్య రామ మందిర నిర్మాణ సమయంలో కూడా 2022 లో మన అందరి తరుపున మన శారద శ్రీవిద్యా పీఠం ధన రూపేణ కానుకలు సమర్పించటం జరిగింది.
అయోధ్యలో శ్రీబాలరాముని విగ్రహ ప్రతిష్ట ఈనెల 22న మధ్యాహ్నం 12:29 సమయానికి జరుగుతుంది
స్వర యోగ ప్రాణ సాధన ద్వార ఆత్మానందాన్ని పొందటమే కాకుండా మన అందరి ఈ మహత్తర శ్రీరామ ప్రాణ ప్రతిష్ట రోజున ప్రాణ ప్రతిష్ఠకు మనం ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా,మన గురు దేవుల అనుగ్రహంతో పరోక్షంగా పాల్గొని మన వంతు ప్రాణ సాధన ద్వారా మన భక్తిని ,ప్రాణశక్తిని ,జప శక్తిని ధార పోసే విధానము సాధన చేయుటకు నిర్ణయించటమైనది కావున ప్రతిఒక్కరు 22/1/24 రోజున మధ్యాహ్నం 12:25 నుండి యూట్యూబ్ లైవ్ లో గురువు గారి ద్వారా మనం అందరం ఉన్నచోటి నుండే ప్రాణ శక్తి ద్వారా మన అందరి ఆత్మ చైతన్యమ్ తో ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొందాం.
గమనిక -లైవ్ సమయానికి ఆరు దీపాలు (షట్కోణం ముగ్గు వేసి🔯 షట్కోణంలో 🔯ప్రాణ అనుసంధానం కొరకు పెట్టవలసి ఉంటుంది )కొబ్బరికాయ పూలు పండ్లు సిద్ధంగా ఉంచుకోగలరు.
హర హర హర మహాదేవ
జై శ్రీ రామ్
🕉️🙏🏽🙏🏽🙏🏽🕉️
శ్రీరామ చంద్ర మూర్తి అన్నా శ్రీరామ నామ సంకీర్తనం అన్న పరమ గురువులైన శ్రీశ్రీశ్రీ కృష్ణ పరమహంస స్వామి వారికి మహ...