13/10/2025
స్థానిక మహతి ఆడిటోరియంలో కలాం ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు డాక్టర్ ఏ పి జె అబ్దుల్ కలాం గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు . కార్యక్రమంలో భాగంగా వివిధ పాఠశాలల నుంచి విద్యార్తిని విద్యార్థులు మరియు ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్య సంస్థల చిన్నారులు , బుద్ధి మాంద్యం, అనాథ మరియు వికలంగా విద్యార్థులు వారిలో ఉన్న విశిష్ట ప్రతిభ కనబరిచారు . మాజీ రాష్ట్రపతి
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి మనువడు డాక్టర్ సుబ్రమణ్యం, సుదీక్ష గ్రూప్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు . వారు ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేశారు . రూపశేషాద్రి గారు ప్రఖ్యాత గుండె సంబందిత వైద్యులు బెంగళూరు. ఎల్లాప్రగడ భవాని కుమార్ - ఐ ఇ ఇ ఇ - లో సభ్యులు ( సైంటిస్ట్) విచ్చేశారు.
కార్యక్రమంలో బిర్లా స్కూల్ విద్యార్థుల విజ్ఞాన ప్రదర్శనలు వివిధ రకాల వర్గాల వారిని ఆలోచింపచేశాయి. విజ్ఞాన ప్రదర్శనలు సైన్స్ పట్ల అభిరుచి పెంచేలా ఉందని పలువురు విద్యార్థులు తెలియచేశారు . ప్రతి ఒక్కరిలో ఎదొక సామర్ధ్యము ఉంటుంది అని కొందరు ఆటలో మరికొందరు పాటలో ఇంకొందరు చదువు ఇలా చాలా మంది చాలా రకాల కళలను కలిగి ఉంటారు వాటిని వెలికి తీయడమే ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం అని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి భాష సిరివెళ్ళ తెలియచేశారు . ప్రతిభ కనపరిచిన చిన్నారులకు ప్రతిభ పురస్కారాలు, సమాజం పట్ల బాధ్యత యుతంగా ఉన్న పలు స్వచ్ఛంద సంస్థలను , సంస్థ ప్రతినిధులను ఎంపిక చేసి వారికి కలాం విశిష్ట సేవ పురస్కారాలు అందచేశారు . వారిలో ముఖ్యులు
శ్రీమతి రూప శేషాద్రి డాక్టర్ కర్ణాటక వైద్య విభాగంలో ,
శ్రీమతి ప్రొఫెసర్ అపర్ణ జే న్ టి యూనివర్సిటీ కలికిరి ,
ప్రొఫెసర్ జితేంద్ర -
జె న్ టి యూనివర్సిటీ అనంతపురం ,
శివ కుమార్ సామాజిక సేవ , తెలంగాణ .
రవికుమార్ సామాజిక సేవ చెన్నై , వివిధ రాష్ట్రాల్లో నుండి ఈ పురస్కారాలు అందుకున్నారు. కార్యక్రమంలో శ్రీమతి స్వర్ణలత తెలుగు ఉపాధ్యాయిని - చిత్తూరు , వెంకటసాయి ఫిజిక్స్ అధ్యాపకులు - కావాలి, ప్రశాంత్ - చెన్నై , సురేష్ కుమార్ - హైదరాబాద్,కార్తీక్ - బెంగళూరు, వినోద్ మరియు రాఘవేంద్ర , శ్రీనివాసులు - ఆంధ్రప్రదేశ్ నుండి కలాం ట్రస్ట్ వార్షిక కార్యక్రమం ( కలాం జయంతి వేడుకలు ) ముఖ్యభూమిక పోషించారు అని కలాం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి భాష సిరివెళ్ళ తెలియచేశారు