18/05/2020
రేపటి నుంచి షరతులతో కూడిన సడలింపులు..*
* *కుడివైపు దుకాణాలు ఒకరోజు.. ఎడమవైపు దుకాణాలు మరో రోజు..*
* *ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అనుమతి*
* *విద్యా సంస్థలు, సెలూన్ షాపులు,షాపింగ్ మాల్స్, సినిమా హాళ్ల నిషేధం*
* *ఇతర దుకాణాల్లోనూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి*
* *నగరంలో కంటోన్మెంట్ జోన్ మినహా మిగిలిన చోట్ల యధావిధిగా కార్యకలాపాలు*
* *కంటైన్మెంట్ జోన్ గా 37 వ వార్డు, యధావిధిగా నిబంధన వర్తింపు*
*** Textiles ఉదయం 7 గంటల నుంచి 1:00 వరకు అనుమతి
* *విలేకర్ల సమావేశంలో నగర కమిషనర్ చల్లా ఓబులేసు, సీఐ యుగంధర్, భాస్కర్ రెడ్డి, తాహాసిల్దార్ సుబ్రహ్మణ్యం వెల్లడి*
చిత్తూరు : కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 4వ విడత లాక్ డౌన్ కొనసాగింపులో భాగంగా కొన్ని షరతులతో కూడిన సడలింపులు ప్రకటించినట్లు నగర కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. చిత్తూరు నగర పరిధిలో మంగళవారం నుంచి అమలు చేయనున్న లాక్ డౌన్ నిబంధనలు, షరతుల పై నగర సీఐలు యుగంధర్, భాస్కర్ రెడ్డి, తాసిల్దార్ సుబ్రమణ్యంతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఉత్తర్వుల మేరకు చిత్తూరు నగరంలో మంగళవారం నుంచి కొన్ని సడలింపు ఇస్తున్నట్లు వివరించారు. నగరంలోని 37 వ వార్డు కంటైన్మెంట్ జోన్ గా కొనసాగిస్తున్నామని.. ఈ వార్డులో ఇదివరకటి నిబంధనలు కొనసాగుతాయన్నారు. మిగిలిన వార్డుల్లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సాధారణ కార్యకలాపాలు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. అయితే విద్యాసంస్థలు, సెలూన్లు, జిమ్, షాపింగ్ మాల్స్, సినిమా హాలు, క్రీడలు, రాజకీయ, సామాజిక మతపరమైన సమావేశాలపై నిషేధం కొనసాగుతుందన్నారు. పార్సెల్ డెలివరీ చేసే హోటల్ లో మాత్రం తెలుసుకోవచ్చన్నారు. హోటళ్లు, దుకాణాల్లో పనిచేసే సిబ్బంది కచ్చితంగా మాస్కులు, చేతికి గ్లౌజులు వాడాలని, దుకాణాల్లో సామాజిక దూరం పాటించాలని, వినియోగదారులకు శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. వ్యక్తిగత శుభ్రత కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వివాహానికి సంబంధించి 50 మందికి అనుమతిస్తామని, ఇక్కడ సామాజిక దూరం పాటించాలన్నారు. సిఐ యుగంధర్, భాస్కర్ రెడ్డి లు మాట్లాడుతూ నగరంలోని ఇరకైన వీధులు.. రద్దీ దుకాణాల నేపథ్యంలో.. రోజు మార్చి రోజు దుకాణాలను తెరిచేందుకు అనుమతిస్తామని.. మొదటిరోజు కుడివైపున ఉన్న దుకాణాలు తెరవాలని, ఎడమవైపుగా వాహనాలు పార్కింగ్ చేసుకోవాలన్నారు. మరుసటి రోజు ఎడమవైపు ఉన్న దుకాణాలు తెరవాలని, కుడివైపుగా వాహనాలు పార్కింగ్ చేసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు నిర్వహించే వారిపై ఐపీసీ సెక్షన్ 188, విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాహాసిల్దార్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. వలస కూలీల కు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నామన, అయితే అధికారుల వద్ద అనుమతి తీసుకున్న తర్వాత వలస కూలీలు చిత్తూరు కి రావాలని కోరారు.
---------------✍
పీఆర్వో - చిత్తూరు నగరపాలక సంస్థ😷