17/12/2018
Signs of Depression
•రోజులో ఎక్కువ సమయం మనసంతా బాధగా ఉండటం,విపరీతమయిన వేదన అనుభవించడం.
•ఇంతక మునుపు ఇష్టం గా చేసే పనులలో కూడా ఇప్పుడు ఆసక్తి లేక పోవడం.
•సంతోషంగా ఉండలేక పోవడం.
•ఆహారం తీసుకోవాలని అనిపించకపోవడం, ఆకలి తగ్గిపోవడం.
•నిద్ర పట్టకపోవడం/నిద్రలోమెలుకువ రావడం/ తెల్లవారు ఝామునే మెలుకువ వచ్చి మరలా నిద్ర పట్టక పోవడం.
•నీరసంగా ఒంట్లో శక్తి లేనట్లు అనిపించడం.
•ఎవరితోనూ కనీసం ఇష్టమయిన వ్యక్తులతో కూడా మాట్లాడాలనిపించక పోవడం.
•చేసే పని మీద దృష్టి పెట్టలేకపోవడం / ఏకాగ్రత లోపించడం.
•దిగులుగా /డల్ గా ఉండటం. చికాకు అనిపించడం. కారణం లేకుండా ఏడుపు రవటం.
•నెగటివ్ ఆలోచనలు / టెన్షన్ గా ఉండటం.
•చిన్న చిన్నవిషయాలకే ఏడుపు రావటం.
• అపరాధ భావం (guilty) కలిగి ఉండటం.
•తనని తాను తక్కువ గా భావించడం (ఆత్మన్యూనత)
•ఆత్మహత్య ఆలోచనలు / చనిపోతే బాగుండు
అనిపించడం /చనిపోవాలని ప్రయత్నించడం.
***** డిప్రెషన్ ని త్వరగా గుర్తించి వైద్య సలహా తీసుకోవడం ద్వారా ఆత్మహత్యలను నివారించవచ్చు******