16/10/2023
అల్లూరి సీతారామరాజు జిల్లా.
చింతూరు మండలం చింతూరు దగ్గర నిమ్మలగుడెం రోడ్ లో ఉన్న ప్రభుత్వ జిల్లా హైస్కూల్ అవరణంలో ఏర్పాటు చేసిన సేవా భారతి విద్యా మిత్ర ట్రస్ట్ సంయుక్త అధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళణం.
సేవా భారతి ఆధ్వర్యంలో ఎటపాక మండలం కూనవరం మండలం వీఆర్ పురం మండలం చింతూరు మండలానికి సంబంధించి పూర్వ విద్యార్థులతో ఈ సమావేశం నిర్వహించడం జరిగినది ఈ సమావేశంలో సేవా భారతి అఖిలభారత నాయకులు శ్రీ బాగయ్య గారు .
సేవా భారతి .
అధ్యక్షులు డాక్టర్ సాయి కిషోర్ గారు యం.డి.
ఆరోగ్య భారతి అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్. పి ఎస్ రావు గారు
సేవా భారతి ప్రముఖ నాయకులు డాక్టర్ మురళీకృష్ణ గారు పాల్గొన్నారు సేవా భారతి మరియు విద్యా మిత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నిరుపేద ఆదివాసి పిల్లలకు నర్సింగ్ కోర్సులో సంబంధించి వివిధ రకాల కోర్సులలో ఉచిత విద్యను అందించి వారు ఉద్యోగాలు పొందే విధంగా కృషిచేసి సుమారు వందమంది పైగా ఈ నాలుగు మండలాల నుంచి ఉద్యోగులు ఉన్నారని అదేవిధంగా సుమారు 100 మంది ఇంకా చదువుతున్నారు . ఈరోజు జరిగినటువంటి గిరిజన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులందరూ పాల్గొనడం జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పూర్వ విద్యార్థులు వారి యొక్క అనుభవాలను అదేవిధంగా పెద్దలు మార్గదర్శనం చేయడం జరిగినది.
నిర్వాహకులు డాక్టర్ మురళీకృష్ణ గారు మరియు చింతూరు సేవా భారతి వైద్యులు డాక్టర్ గంగాధర ప్రసాద్ గారు మరియు పూర్వ విద్యార్థుల సమన్వయకర్త కన్నా రాజు సోయం ,రాజు మోసం ,రాంబాబు,జోగారావు, కళ్యాణ్ మరియు తదితరులు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది పాల్గొన్నారు అదే విధంగా కాకినాడ రాజమండ్రి నుంచి సేవా భారతి జిల్లా మరియు రాష్ట్రస్థాయి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేశారని తెలియజేశారు.
కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థులు చక్కగా నిర్వహణ చేసి విజయవంతం చేశారని భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలను సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలియజేయడం జరిగినది. ఈరోజు జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు కొద్దిమంది డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను హెల్త్ డిపార్ట్మెంట్ లోను కొద్దిమంది ఉపాధ్యాయ వృత్తిలోనూ మరి కొద్ది మంది సచివాలయం ఉద్యోగాలలోను మరి కొద్ది మంది పోలీస్ డిపార్ట్మెంట్లను ఈ విధంగా సుమారు వందమంది ఉద్యోగాలను చేస్తూ ఉన్నారని సుమారు 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక వందల వేల మందిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో సేవా భారతి యొక్క సేవలు అమూల్యం.
గోదావరి వరదలు వచ్చినప్పుడు అనేక రకాల సేవా కార్యక్రమాలతో పాటు కరోనా సమయంలో కూడా పూర్వ విద్యార్థులు సేవాభారతి ఆధ్వర్యంలో వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించారని అంతేకాకుండా వివిధ సామాజిక కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంటూ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులను చైతన్యవంతం చేయడంలో పూర్వ విద్యార్థుల ప్రముఖ పాత్ర వహిస్తున్నారని. సమాజంలో మార్పులు తీసుకురావడం కోసం అందరం కలిసికట్టుగా ఐక్యంగా ముందుకు వచ్చి పనిచేయాలని నేను నాది నా ఇల్లు అన్నట్లుగా కాకుండా మనము మనది మన దేశం అనే భావనతో ప్రతి ఒక్కరు నిస్వార్ధంగా పనిచేయాలని అఖిల భారత సేవా భారతి ప్రముఖులు బాగయ్య గారు తెలియజేశారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా మాత్రమే ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతామని భవిష్యత్తులో వ్యవసాయానికి ప్రతి ఒక్కరు పెద్ద పీట వేయాలని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరు వారి యొక్క బాధ్యతలను నిర్వర్తించాలని సేవా భారతీ ఆధ్వర్యంలో దేశం మొత్తం మీద అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహణ జరుగుతున్నదని ప్రత్యేకించి ఆదివాసుల కోసం షెడ్యూల్ ఏరియా ప్రాంతాలలో విస్తృతంగా ఏకోపాద్యాయ పాఠశాలలు, రెసిడెన్షియల్ బ్రిడ్జి స్కూల్స్, సేవాభారతి ఆధ్వర్యంలో రక్త నిధి కార్యక్రమాలు, స్వర్గీయ కర్నాటి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో జరిగిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సేవా భారతి వివిధ రకాల ఆశ్రమాలు నిర్వహణ జరుగుతూ ఉన్నదని కార్యక్రమాల ద్వారా సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారికి అభ్యున్నతి కోసం సేవా భారతి నిస్వార్ధంగా పనిచేస్తూ ఉన్నదని దీనికోసం అనేకమంది దాతలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చి కార్యక్రమాలకు సహకరిస్తున్నారని వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సేవా భారతి అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రతినిధి కట్టం ముత్తయ్య గారు, ఆవుల సుబ్బారావు గారి యొక్క సేవలను కొనియాడారు,రాజమండ్రి జిల్లా కాకినాడ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. విజయవాడ నుంచి సేవా భారతి రామకృష్ణ గారు,
రాజమండ్రి నుంచి ఓలేటి సత్యనారాయణ గారు కాకినాడ నుంచి రాజా రామచంద్రమూర్తి గారు మరియు శ్రీ విజయ ఆదిత్య గారు, కాటేపల్లి లక్ష్మీనారాయణ గారు, రామచంద్ర మూర్తి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.
డాక్టర్ వై సాయి కిషోర్ అధ్యక్షులు
సేవా భారతి విజయవాడ.