02/05/2020
దగ్గు(పొడి మరియు తడి దగ్గు) ఉపశమనానికి ఈ కింది 5 ప్రభావవంతమైన ఇంటిచిట్కాలు ప్రయత్నించండి:
1. పసుపు పాలు
దగ్గు సమస్య పోగొట్టుకునేందుకు రోజుకి రెండుపూటలా గ్లాసు పాలల్లో ½ టీ స్పూన్ పసుపు వేసుకుని తాగాలి. వదలని దగ్గుకి మరో ఇంటి చిట్కా ఏంటంటే ఇదే మిశ్రమానికి వెల్లుల్లి కలపటం. ఏముంది, వెల్లుల్లిలో ఒక పాయని తీసుకుని పాలతో కలిపి మరిగించి, తర్వాత ఒక చిటికెడు పసుపు వేయండి. ఇలాంటి పాలు ఎందుకు అవసరం అంటే అది మీ గొంతుని బాగు చేస్తుంది. వెల్లుల్లి బదులు అల్లం కూడా వేసుకోవచ్చు. రెండూ ఒకే విధంగా పనిచేస్తాయి. ఆగకుండా దగ్గుతుంటే ఉపశమనం కోసం రోజులో కొన్నిసార్లు పసుపునీళ్ళతో పుక్కిలించండి.
2. తిప్పతీగ రసం
దగ్గు తీవ్రంగా ఉంటే, “2 చెంచాల తిప్పతీగ రసాన్ని నీటిలో కలిపి దగ్గు తగ్గేవరకూ ప్రతిరోజూ ఉదయాన్నే తాగండి,” అని సలహా ఇస్తున్నారు డాక్టర్ సిన్హా.
3. తేనె + యష్టిమధురం +దాల్చినచెక్క
"1/4 చెంచా తేనె,1/4 చెంచా యష్టిమధురం పొడి, ¼ చెంచా దాల్చిన చెక్క పొడి నీళ్లలో కలిపి రోజుకి రెండుసార్లు పొద్దున, సాయంత్రం తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయి.” అని అంటున్నారు
4. నల్ల మిరియాలు
దగ్గ వేధిస్తుంటే, మిరియాల కషాయం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ½ చెంచా నల్ల మిరియాల పొడిని దేశవాళి నెయ్యితో కలిపి కడుపు నిండుగా ఉన్నప్పుడు తీసుకోవాలి.
ఈ కషాయాన్ని కనీసం రోజుకి రెండు మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
5. పిల్లలకి దానిమ్మ రసం
పిల్లల గురించి మంచి చిట్కా వారికి ½ కప్పు దానిమ్మ రసం, చిటికెడు అల్లం పొడి అలాగే పిప్పళ్ల పొడిని కలిపి ఇవ్వొచ్చు.
పిప్పళ్లు ఒక ఆయుర్వేద మూలిక. దానిమ్మ రసం గొంతుపై తీవ్ర ప్రభావం చూపదు, అలాగే అల్లం వేడిచేస్తుంది. దానిమ్మ విటమిన్ ఎ, సి రోగనిరోధక శక్తిని పెంచుతాయి కూడా. కావాలంటే అల్లం బదులు నల్ల మిరియాలు కూడా వాడవచ్చు.
6. మసాలా టీ
వేడి వేడి మసాలా టీ, దగ్గుని సహజంగా తగ్గిస్తుంది. ½ చెంచా అల్లం పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి, కొన్ని లవంగాలు మీ టీకి జతచేయండి.
ఎందుకు పనిచేస్తుంది : ఈ మూడు దినుసులు శరీరం లోపలనుండి సమస్యను తగ్గిస్తాయని ప్రసిద్ధి. ఈ వేడిచేసే దినుసులు దిబ్బడను తగ్గించి, ఊపిరితిత్తుల్లో కఫం తగ్గేలా చేస్తాయి. అలాగే జలుబును కూడా తగ్గిస్తాయి.
చిన్న చిట్కా : రాత్రి సమయాల్లో దగ్గు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. ముక్కులోని మ్యూకస్ మీరు పడుకుని ఉన్నప్పుడు గొంతులోకి జారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే తలని కొంచెం ఎత్తులో ఉండేలా జాగ్రత్త తీసుకుని పడుకోవాలి. అప్పుడే దగ్గు తగ్గి.. హాయిగా నిద్రపోతారు.
దగ్గును హరించు సులభయోగాలు -
* పిప్పిళ్ల చూర్ణం , తేనెతో కలిపి సేవించిన దగ్గు హరించబడును.
* తిప్పతీగ కషాయంలో పిప్పిళ్ల చూర్ణం కలిపి సేవించిన దగ్గు తగ్గును.
* అల్లం రసంలో తేనె కలిపి సేవించుచున్న దగ్గు తగ్గును.
* ఉదయం సమయమున అల్లం రసం బెల్లంతోను , రాత్రుల యందు త్రిఫలా చూర్ణం తేనెతోను కలిపి తీసుకొనుచున్న దగ్గులు తగ్గును.
* లవంగాలు కాల్చి పొడిచేసి సేవించిన దగ్గు తగ్గును.
* మిరియాల చూర్ణంను నేతితో సేవించుచున్న దగ్గు తగ్గును.
* అరటిపండులో మిరియాల పొడి వేసి తినుచున్న దగ్గు తగ్గును.
* నిప్పులపైన వాము వేసి ఆపొగ పీల్చుతున్న దగ్గు తగ్గును.
* ఎందుజిల్లేడు ఆకులను చుట్టగా చుట్టి దానికి నిప్పు అంటించి ఆ పొగ లొపలికి పీల్చిన దగ్గు తగ్గును.
* గంటకొకసారి వెల్లుల్లిపాయ రేకును తినుచున్న దగ్గు తగ్గును.
* మోదుగు బెరడు కషాయాన్ని పూటకు పావుకప్పు చొప్పున తాగుచున్న దగ్గు తగ్గును.
* కరక్కాయ బెరడు ను బుగ్గన పెట్టుకుని ఆ రసమును సేవించిన దగ్గు తగ్గును.
* తులసి ఆకులు రసము సేవించిన దగ్గు తగ్గును.
* లవంగాలు బుగ్గన పెట్టుకున్న దగ్గు తగ్గును.
*ఒక టేబుల్ స్పూన్ తేనెలో సగం టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి పడుకునేటప్పుడు తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.
* తులసి , మిరియాలు కషాయం కూడా మంచి ఉపశమనం కలిగించును.