Sateesh Krishna

Sateesh Krishna Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sateesh Krishna, Health & Wellness Website, Vijayawada.

16/04/2026
ఆహార నియమాలు దేవుడికి నివేదన చేయడానికి ముందు విస్తట్లో ఉప్పు వడ్డించకూడదని పండితులు చెబుతున్నారు. స్వామికి సమర్పించే విస...
14/04/2026

ఆహార నియమాలు

దేవుడికి నివేదన చేయడానికి ముందు విస్తట్లో ఉప్పు వడ్డించకూడదని పండితులు చెబుతున్నారు. స్వామికి సమర్పించే విస్తట్లో ఉప్పు మాత్రం ప్రత్యేకంగా వడ్డించకూడదని వారు అంటున్నారు.

ఇక యోగశాస్త్రం ప్రకారం మనుష్యుని శ్వాసగతి 12 అంగుళాల దాకా ఉంటుంది. భోజనం చేసేటపుడు 20 అంగుళాల దాకా ఉంటుంది. మాట్లాడితే శ్వాసగతి ఎక్కువవుతుంది. కాబట్టి ఆయుష్షు తగ్గుతుంది. కనుక ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు.

అలాగే త్రయోదశినాడు వంకాయ తినకూడదు. అష్టమి నాడు కొబ్బరి తినకూడదని, పాడ్యమినాడు గుమ్మడికాయ తినకూడదని, పురాణాలు చెబుతున్నాయి. దొండకాయ తింటే వెంటనే బుద్ధి నశిస్తుంది.

రాత్రి అన్నం తినేటపుడు దీపం ఆరిపోతే విస్తరాకునుగాని, పాత్రనుగాని చేతులతో పట్టుకొని సూర్యుణ్ణి స్మరించాలని దీపాన్ని చూసి మిగిలినది తినాలని అప్పుడు మరోసారి వడ్డించుకోవద్దని పెద్దలంటారు.

రాత్రి తింటూ ఉన్నప్పుడు తుమ్మితే నెత్తిపై నీళ్ళు చల్లడం, దేవతను స్మరింపచేయడం ఆచారంగా ఉంది. రాత్రి పెరుగు వాడకూడదు. ఒకవేళ వాడితే నెయ్యి, పంచదార కలిపివాడవచ్చు. ఇలా చేస్తే వాతాన్ని పోగొడుతుంది.

రాత్రిళ్లు కాచిన పెరుగును మజ్జిగపులుసు మొదలైనవి) వాడకూడదు. ఆవునేయి కంటికి మంచిది. ఆవు మజ్జిగ చాలా తేలికైనది. అందులో సైంధవలవణం కలిపితే వాతాన్ని పోగొడుతుందని, పంచదార కలిపితే పిత్తాన్ని పోగొడుతుందని, శొంఠికలిపితే కఫాన్ని పోగొడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

నలుగురు కూర్చొని తింటూ ఉన్నప్పుడు మధ్యలో లేవకూడదు. తేగలు, బుర్రగుంజు, జున్ను, తాటిపండు మొదలైనవి వేదవేత్తలు తినరు. మునగ, పుంస్త్వానికి (మగతనానికి) మంచిదంటారు.

ఆకలితో బాధపడేవారు కోడి, కుక్క మొదలైనవి చూస్తూ ఉండగా తినకూడదన్నారు.

ఎప్పుడూ నిర్ణీత సమయం లోనే భోజనం చెయ్యాలి . ( అందువలన బయోలాజికల్ క్లాక్ సక్రమంగా ఉంటుంది )

ఆహారం నెమ్మదిగా పూర్తిగా నమిలి తినాలి ( ఘన పదార్ధాలను త్రాగండి అంటారు . అంటే నోటిలోనే సగం నమలబడాలి . అందువలన లాలాజలం పూర్తిగా కలిసి , ముద్దా మింగడం సులువు అవుతుంది . పిండి పదార్ధాలు పూర్తిగా జీర్ణం అవుతాయి . కడుపులో ఊరే ఆమ్లాలకు లాలాజలం ( క్షారం ) విరుగుడు గా పనిచేస్తుంది .

ఆహార నియమాలను పాటించే వ్యక్తికి ఔషధాల అవుసరం ఏమి ఉంటుంది ? ఆహార నియమాలను పాటించని వ్యక్తికి ఔషధాలు ఏమి ఫలితాలను ఇవ్వగలవు ?

పధ్యే సతి గదార్తస్య కి మౌషద నిషేవనై:
వినాపి భేశాజేవ్యర్ది : పత్యాదేవ్ నివర్తత
న తు పథ్య విహీనస్య భేశాజానాం శథైర్యపి

అంటే రోగికి ఔషధాల అవుసరం లేకుండానే కేవలం నియమిత ఆహారం పాటించడం వలన వ్యాధులు దూరమవుతాయి .

రోగికి ఆహారం పై నియంత్రణ లేక పోతే మాత్రం అత్యుత్తమ మైన మందులు కూడా ఫలితాన్ని ఇవ్వలేవు అని అర్ధం .

అన్నం బ్రహ్మ రసోవిష్ణు: బోక్తా దేవో మహేశ్వర: ఇతి సంచింత్య భుంజానం దృష్టిదోషో నబాధతే అంజనీగర్భంసంభూతం కుమారం బ్రహ్మచారిణం దృష్టిదోషవివానాశాయ హనుమంతం స్మరామ్నహం||

అనగా అన్నం బ్రహ్మం, అన్నరసం విష్ణురూపమై ఉన్నది. తినువాడు మహేశ్వరుడు, ఇట్లా చింతిస్తే దృష్టిదోషం ఉండదని పండితులు అంటున్నారు.











వాస్తుశాస్త్ర రీత్యా వంటశాల నిర్మాణం ఆహారం పుష్టికరంగా శుచిగా ఉండాలి. ఆహారాన్ని దోషరహితంగా తయారు చేయటంలో వంటశాలలకు అధికమ...
14/04/2026

వాస్తుశాస్త్ర రీత్యా వంటశాల నిర్మాణం

ఆహారం పుష్టికరంగా శుచిగా ఉండాలి. ఆహారాన్ని దోషరహితంగా తయారు చేయటంలో వంటశాలలకు అధికమైన ప్రాధాన్యత ఉంది. వంటశాల తగినంత వెలుతురు, గాలి ప్రసరించునట్లుగా నిర్మించవలెను. వండిన ఆహార పదార్ధాలకు దృష్టి దోషం తగలకుండా వంటశాల ఇంటికి వెనుకవైపు (పృష్ట భాగం) పెరడులో నిర్మించాలి. ఇంటిలోని వారు, స్త్రీలు వంట పనులు నిర్వర్తించటానికి వంటశాల గృహం లోపలి భాగంలో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది.

ఏ దిక్కున సింహాద్వారం ఉన్న గృహానికైనా ఆగ్నేయంలో వంటశాల ఉండాలనే మాట శాస్త్ర విరుద్ధం. వాస్తు పురుషుని ఊపిరితిత్తులకు చెందిన భాగమైన సింహాద్వారము ముందు గల ఖాళీ స్ధలములో ఆగ్నేయ కోణంలో వంటశాలలు నిర్మించుట శాస్త్ర విరుద్ధాలు.

శ్లో:- యమదిశి భోజన శాల సోమే ధన సంచాయా వాసమ్
ఆగ్నౌ ధాన్యాగారం ఖే వక్తీర్వ్యం జనాని తత్రైవ
ఆరాధన గృహ మిశేకూపం తత్రోదితం స్నానమ్
యాస్మిన్ యదుక్త ముచితం అన్యా విహి తత్ర సంప్ర యోజ్యాని

దక్షిణంలో భోజన శాల, ఆగ్నేయంలో ధాన్యశాల, తూర్పు ఆగ్నేయాల మధ్యలో అంతరిక్ష పదంలో వంటశాల, ఈశాన్యంలో పూజాగృహం, స్నాన గృహం, నుయ్యి నిర్మించాలి.

శ్లో:- ఉత్తరేశాన పర్జన్యే సర్వేషాం పచనాలయం
యాంయేచ నైఋతే వాపి సర్వేషాం భోజనాలయం

దీనిని బట్టి కూడా ఈశాన్య పర్జన్య స్ధానాలలో వంటశాల ఉండవచ్చని తెలియుచున్నది.

గృహ ముఖద్వారాన్ని బట్టి యే యే స్ధానాలలో వంటశాలలు నిర్మించాలో మయుడు, విశ్వకర్మ విశేష విధితో శాసించారు. విశ్వకర్మ ప్రకారం తూర్పు, దక్షిణ, ఉత్తర దిశల్లో ముఖద్వారాలు కలిగిన ఇండ్లకు వంటశాలలు ఈ క్రింది విధంగా నిర్మించుకోవాలి.

తూర్పు సింహా ద్వారం గల ఇంటికి వంటశాల నిర్మాణం

తూర్పు సింహాద్వారం కలిగిన గృహానికి పడమర దిశలో మానుషభాగం ఉంటుంది. అందువల్ల ఇంటికి పడమర వసారాలోని నైఋతి వాయువ్య కోణాలలోని గదులకు వంట గదులుగా ఉపయోగించుకోవచ్చును. లేదా పశ్చిమంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో నైఋతి, వాయువ్యకోణాలలో వంటశాలలు నిర్మించుకోవచ్చును.

దక్షిణ సింహా ద్వారం గల ఇంటికి వంటశాల నిర్మాణం

దక్షిణ సింహాద్వారం కలిగిన గృహానికి ఉత్తర దిశలో మానుష భాగం ఉంటుంది. అందువల్ల ఉత్తరదిశలో వరండా భాగంలో వాయువ్యంలోని గదిలో వంట చేయవచ్చు. లేదా ఖాళీ స్ధాలంలో వాయువ్య కోణంలో వంటశాల విడిగా కట్టుకోవచ్చు.

పడమర సింహా ద్వారం గల ఇంటికి వంటశాల నిర్మాణం

పడమర సింహాద్వారం కలిగిన ఇంటికి తూర్పుదిశలో మానుష భాగం ఉంటుంది. అందువల్ల తూర్పున వసారాలోని ఇంటికి ఆగ్నేయ మూలలోని గదిలో వంట చేయాలి. లేదా ఖాళీ స్ధలంలో ఆగ్నేయ మూలలో వంటసాల విడిగా నిర్మించుకోవచ్చును.

ఉత్తర సింహా ద్వారం గల ఇంటికి వంటశాల నిర్మాణం

ఉత్తర సింహాద్వారం గల గృహానికి దక్షిణ దిశలో మానుష భాగం ఉంటుంది. అందువల్ల దక్షణ వసారాలోని ఇంటికి ఆగ్నేయ మూల గదిలోగాని, నైఋతి మూల గదిలో గాని వంట చేయాలి. లేదా ఖాళీ స్ధలం ఉంటే ఆగ్నేయంలో గాని, నైఋతి దిశలో గాని వంట శాలలు నిర్మించవచ్చును.

శ్లో:- అంతరిక్షే బవేచ్చుల్లీ సత్యా కేశ్యాదులూ ఖలమ్
ఐశాన్యం పచన స్ధానం సర్వేషాం దేహినాం శుభం

మయమతం ప్రకారం ఆగ్నేయ భాగంలోని అంతరిక్ష పాదంలో వంటశాల ఆ వంటశాలకు ఉత్తరంలో రుబ్బురోలు అమరిక చేయాలి. లేదా సమస్తమైన వారికి ఈశాన్యంలో వంటశాల శుభప్రదమైనది అనే విశేష విధిని తెలియజేశాడు.

ఈశాన్యమున వంటశాల నిర్మాణం మయబ్రహ్మ అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఈశాన్య దిక్కుకు అధిపతి రుద్రుడు. ఆరుద్రా నక్షత్ర మండలానికి అధిపతి రుద్రుడు. ఆరుద్రా నక్షత్రం మహా అగ్నిగోళం. రుద్రుని మూడవ నేత్రంగా భావించి ఆరాధింపబడు ఆరుద్రా నక్షత్రమునకు అధిదైవత అగు రుద్రుడే ఈశాన్య దిక్కుకు అధిపతి. సమస్త ప్రజలకు అగ్ని ఆరాధ్య దైవం.

అగ్ని ప్రతిష్ఠ, నిత్యారాధన చేయువారికి ఈశాన్యం శుభప్రదం. ఈశాన్యము నందు వంటశాల ఏర్పరుచుట ఆగ్నేయం కంటే శ్రేష్ఠమని మయుని అభిప్రాయం. గృహములో ఈశాన్యమున నుయ్యి, పూజామందిరం ఉండును. పూర్వం నుండి చేసిన వంటకాలు గృహగత పరమేశునకు నివేదన చేయు ఆచారం కలదు. అందువలన ఈశాన్య దిశ యందు వంటశాల ఈశ్వరుని నివేదనకు అనుకూలంగా ఉండును.

http://astroexperts.blogspot.in/2017/04/blog-post_87.html










14/04/2026
13/04/2026
13/04/2026
13/04/2026

Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when Sateesh Krishna posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sateesh Krishna:

Share