02/12/2025
ఎస్ఎఫ్ఐ 25వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
ఎస్ఎఫ్ఐ కడప నగర అధ్యక్షులు జాలా సుమంత్.
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర మహాసభలు జయప్రదం చెయ్యాలని మంగళవారం కడప నగరంలోని ప్రకాష్ నగర్ బాలుర సంక్షేమ హాస్టల్ నందు గోడపత్రికలను విడుదల చేసిన ఎస్ఎఫ్ఐ కడప నగర అధ్యక్షులు జాలా సుమంత్.
ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ.....
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 25వ మహాసభలు తిరుపతి నగరంలో డిసెంబర్ 12 13 14 తేదీలలో నిర్వహిస్తున్నమన్నారు. డిసెంబర్ 12న ర్యాలీ బహిరంగ సభ ఇందిర మైదానంలో నిర్వహిస్తున్నామని దీనిలో వేలాదిగా విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుండి 500 మంది ఎంపిక చేయబడిన ప్రతినిధులు పాల్గొని రాష్ట్రంలో విద్యారంగ సమస్యలపై మరియు రాష్ట్ర విద్యారంగా అభివృద్ధి కోసం పలు తీర్మానాలు చేస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నెర కావస్తున్నా నేటికీ విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాలేదని బకాయిలు ఉన్న ఫీజు రీయింబర్స్, స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని తెలిపారు. సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని మెస్ ఛార్జీలు పెంచాలని కోరారు. గిరిజన విద్యార్థుల మరణాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడంలేదని గిరిజన విద్యార్థులకు సమస్యలు పరిష్కరించేందుకు ఆశ్రమ పాఠశాలలో ఏఎన్ఎం పోస్టులు భర్తీ చేయాలి మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తన శాఖ మినహా అన్ని శాఖల పనులు చేస్తున్నారని విద్యారంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసారని యువగళం పాదయాత్రలో తను ఇచ్చిన హామీలు కోసం ఆలోచించడం లేదని అన్నారు. అదేవిధంగా యూనివర్సిటీలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని జూనియర్ డిగ్రీ కళాశాల కళాశాలల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు ఈ సమస్యలన్నింటిలపై 25వ రాష్ట్ర మహాసభల్లో చర్చిస్తామని తెలియజేశారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మెడికల్ కాలేజీల సీట్ల అమ్మకానికి వ్యతిరేకించి నేడు అధికారంలోకి వచ్చాక అవే మెడికల్ కాలేజీలను 100% ప్రైవేటు వ్యక్తులకు కారుచౌకగా అమ్మడాన్ని వ్యతిరేకించారు. జీవో నెంబర్ 117 రద్దుచేసి స్కూల్స్ మూసివేత ఆపుతామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చి నేడు యదేచ్చగా స్కూల్స్ ను మూసేస్తున్నారు అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో పేరుకుపోయిన విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర మహాసభల్లో తీర్మానాలు చేసి భవిష్యత్తు ప్రణాళికను రూపొందించి పనిచేస్తామని తెలియజేశారు ఈ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులతో పాటు అఖిలభారత నాయకత్వం విద్యా మేధావులు పాల్గొంటారని ఈ మహాసభలను జయప్రదం చేయాల్సిందిగా విద్యార్థులకు ప్రజలకు అదేవిధంగా విద్యా శ్రేయోభిలాషులకు కోరుతున్నామని అన్నారు ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ కడప నగర ఉపాధ్యక్షులు అఖిలేష్, నవీన్,కార్తీక్, ఎస్ఎఫ్ఐ నగర కమిటీ సభ్యులు మనోహర్, అభిలేష్, సాగర్, రాజేష్, ఓంకార్, నరసింహ, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.