25/04/2024
*సైకలాజికల్ సపోర్ట్ ఫర్ బెటర్ అకడమిక్ పెర్ఫార్మెన్స్*
విద్యాసంస్థలు మరియు ఉపాధ్యాయులు పిల్లలు యొక్క విద్యా సంబంధమైన ఎదుగుదలకు బాధ్యత వహిస్తున్నారు కానీ పిల్లల యొక్క మానసిక మరియు సామాజిక పెరుగుదలకు ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ విజయ భాస్కర్ , త్యాబుల రస (TABULA RASA) అధ్యక్షులు దీనికోసం ప్రజల కోసం మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పిల్లలకి IQ బాగుంటుంది కానీ ఎమోషనల్ మేనేజ్మెంట్ మరియు సోషల్ మేనేజ్మెంట్ లో చాలా వెనకబడి ఉన్నారు అని.. దాని వల్లనే ఇప్పటి జనరేషన్ పిల్లలు డిప్రెషన్ , లోన్లీనెస్, అంక్సైటీ వంటి రకరకాల ఎమోషనల్ బిహేవియర్ గురి అవుతున్నారు అని.. వీటిని అధిగమించుటకు ఈ సమస్యలో ని సైకాలజిస్ట్ అందరూ పరిశోధన చేసి *Child's Mental immunity సైకలాజికల్ సపోర్ట్ ఫర్ బెటర్ ఎకడమిక్ పెర్ఫార్మె న్స్* అనే కాన్సెప్ట్ తో ఆన్యువల్ ప్లాన్ నీ రూపొందించారు.. ఈ ప్లాన్ లో భాగంగా ప్రతి నెల ఈ సంస్థలోని సైకాలజిస్ట్ ప్రతినెల రెండు నుంచి మూడు గంటల పాటు పిల్లలతో మమేకం అయ్యి, ఒక్కో నెల ఒక కాన్సెప్ట్ ఎమోషనల్ మేనేజ్మెంట్ ఎలా పెంచుకోవాలని ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, పాజిటివ్ పేరేంటి, మెమరీ స్కిల్స్, అటెన్షన్ ప్రాబ్లం, మొబైల్ ఎడిషన్ , లెర్నింగ్ స్టైల్స్ ఇన్ని ఇలా సుమారుగా పది నెలలకు 10 రకాల కాన్సెప్ట్ లో పొందుపరచడం జరిగింది. దీనిలో భాగంగా *వివేకానంద స్కూల్*, గుడిమెళ్లంక ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ శ్రీ ప్రసాద్ గారిని సంప్రదించ గా దీనికి అనుకూలంగా స్పందించి వారి విద్యా సంస్థలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రసాద్ గారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఇలాంటి మనో చైతన్య కార్యక్రమాలు చాలా అవసరం చెప్పడం జరిగింది.